Niharika Konidela: సినీ ప్రపంచంలో వారి వ్యక్తిగత జీవిత విషయాలు ఎంతో చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఎంతో ఇష్టపడి ఎరి కోరి వివాహం చేసుకుంటారో మళ్లీ అంతే త్వరగా విడిపోతుంటారు. వీళ్ళు ఎందుకు తొందరపడి పెళ్లి చేసుకుంటారో.. అదే తొందరపాటుతో విడాకులు తీసుకుంటారన్నది.. ఎవరికీ తెలియని విషయం. ఇప్పుడు నడుస్తున్న యుగమంతా సోషల్ మీడియా యుగమని చెప్పాలి. ఎందుకంటే.. ప్రస్తుతం ఫేస్బుక్ లో, వాట్సాప్ లో తెగ ప్రేమించేసుకుంటున్నారు ఆ తర్వాత ఇంస్టాగ్రామ్ లోనో.. ట్విట్టర్ లోనో.. విడాకులు తీసుకుంటున్నారు.
ఈ సినీ రంగంలో ఉన్న వాళ్లందరికీ డివోర్స్ అంటే మామూలు విషయం ఇలా విడాకులు తీసుకొని అలా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు. ఇక ప్రస్తుతం అదే బాటలో ప్రయాణిస్తున్నది మెగా డాటర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల.
ఇప్పుడు ఈమె విడాకులు తీసుకుపోతుందంటూ నెట్టింట వార్తలు ఓ రేంజ్ లో ఊపందకున్నాయి. రెండు సంవత్సరాల కిందనే గుంటూరు చెందిన మాజీ పోలీసు ఉన్నతాధికారుని కుమారుడు జొన్నలగడ్డ చైతన్యను వివాహం ఆడింది నిహారిక. ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా రాజస్థాన్లోని ఉదయపూర్ లో వీరిద్దరి వివాహం జరిగింది. వివాహ అనంతరం వెండి తెరకు దూరంగా ఉన్నప్పటికీ సినిమా రంగంలో దగ్గరగానే ఉంది. నటనకు దూరంగా ఉంటూ నిర్మాతగా మారి వెబ్ సిరీస్ నిర్మిస్తుంది. తాను నిర్మించిన కొన్ని వెబ్ సిరీస్లు మంచి హిట్స్ ఇచ్చాయి.. ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నిహారిక.. తన భర్తతో కలిసి టూర్లలో ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లో ఉంటుంది. ఇలా నిహారిక ఏ టూర్ కి వెళ్లిన, ఏ వెకేషన్ కి వెళ్ళినా ఆమె సోషల్ మీడియా నిండ వీళ్ళిద్దరి ఫోటోలే ఉండేవి.
మెగా అభిమానులు కూడా మెగా ఫ్యామిలీకి మంచి అల్లుడు దొరికాడు నిహారిక కి సరైన అల్లుడని తెగ కామెంట్లు పెట్టి సంబర పడిపోయారు. ప్రస్తుతానికి ఏమైందో ఏమో తెలియదు గానీ గత రెండు వారాల నుంచి వీళ్లిద్దరి మధ్య విభేదాలు తలేత్తుతున్నాయని త్వరలో విడాకులు కూడా తీసుకోబోతున్నారంటూ ఒకటే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలకు తోడు చైతన్య తన భార్య నిహారికతో ఉన్న ఫోటోలు ఆయన సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయడం అదేవిధంగా నిహారికను అన్ ఫాలో కూడా చేయడం. నిహారిక సైతం భర్తతో ఉన్న అన్ని ఫోటోలు డిలీట్ చేసి ఒక్క ఫోటో మాత్రం వదిలిపెట్టింది. ఇప్పుడు ఆ ఒక్క ఫోటోనే ట్విస్ట్ గా మారింది. పెళ్లిలో చైతన్యతో కలిసి ఉన్న ఫోటో మాత్రం నిహారిక డిలీట్ చేయలేదు.
అయితే ఒక ఫోటో ఎందుకు డిలీట్ చేయలేదు అనేది మిస్టరీగా మారింది. ఆ ఫోటోతో క్యాప్షన్ కూడా పెట్టింది. అదేంటంటే.. నా దగ్గర ఒక రహస్యం ఉంది. అది మీకు చెప్తే రహస్యం ఎందుకు అవుతుంది. దాన్ని నేను చెప్పలేను క్షమించండి అని ఉంది. ఈ యొక్క ఫోటో కావాలని నిహారిక డిలీట్ చేయలేదు. అ రహస్యం ఏంటి అనేది రకరకాల చర్చలు సాగుతున్నాయి ఈ ఫోటోపై.. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే నిహారిక (Niharika Konidela) భర్త మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నారని అది నచ్చకనే చైతన్యతో దూరం అవుతుందని ఆ విషయం బయట పెట్టడం ఆమెకి ఇష్టం లేదన్న కొత్త చర్చ మొదలైందని.. ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరూ నోరు మెదపనంతకాలం ఇలా ఎన్నో పుకార్లు వైరల్ అవుతూనే ఉంటాయి.