Home Cinema అర్జున్ రెడ్డి ( విజయ్ దేవరకొండ ) కొత్త సినిమా ఖుషి ఎంతవరకు వచ్చింది మరి.?

అర్జున్ రెడ్డి ( విజయ్ దేవరకొండ ) కొత్త సినిమా ఖుషి ఎంతవరకు వచ్చింది మరి.?

అర్జున్ రెడ్డి ( విజయ్ దేవరకొండ ) కొత్త సినిమా ఖుషి ఎంతవరకు వచ్చింది మరి.?

తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి ఆధారం లేకుండా సినీచిత్రపరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ హీరోల స్థాయిలో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన అతి తక్కువ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు, తమదైన స్టైల్లో ఫాలింయింగ్ సంపాదించుకున్నాడు విజయ్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన సినీ జీవితం మొదలుపెట్టి నేడు పాన్ ఇండియా మూవీ స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు, దానికి ఎంతో కష్టపడాలి ఆ కష్టానికి తగినంత అదృష్టం తోడు రావాలి అలాంటి అదృష్టమే విజయ్ దేవరకొండ వెంట నడుచుకుంటూ వచ్చింది అర్జున్ రెడ్డి రూపంలో లో ఇంకేముంది ఒక్కసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కడికో వెళ్లిపోయాడు.

” అర్జున్ రెడ్డి ‘ సినిమాలో విజయ్ దేవరకొండ తప్ప వేరొకరు ఈ పాత్రకు న్యాయం చేయలేరు అన్నంత గొప్పగా యాక్ట్ చేసారు విజయ్ ఆ యాక్టింగ్ తో కోట్ల అభిమానుల మనసులు గెలుచుకున్నారు. ఆ తర్వాత అంత అంత మాత్రంగా రిలీజైన  గీతా గోవిందం బాక్స్ ఆఫీస్ వద్ద బద్దలు కొట్టింది. దీంతో ఇటు యూత్ అటు ఫ్యామిలీ పరంగా ఆడియన్స్ ను తెగ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన నోటా బోల్తా కొట్టింది. రెండు వరుస విజయాల తర్వాత ఇది ఎవ్వరికైనా కామనే కానీ ఆ తర్వాత వచ్చిన టాక్సీవాలా దుమ్ములేపేసింది. దీంతో విజయ్ క్రేజ్ మరింతకు పెరిగిపోయింది. ఈ విజయం తర్వాత మళ్ళీ రెండు సినిమాలు బొక్కా బోర్లా పడ్డాయి.

See also  Niharika: మెగా హీరోల అందరికంటే ఆ హీరోనే బెస్ట్.. సొంత ఫ్యామిలీని కాదంటూ నిహారిక కామెంట్స్..

రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న తర్వాత లైగర్ గా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి రోజు కలెక్షన్లు పరవాలేదు అనిపించుకున్నప్పటికీ నెక్స్ట్ డే నుంచి మూవీస్ గోపి లేకుండా పోయింది వారం రోజుల్లో మూవీ మొత్తం తల క్రిందులు అయిపోయింది. కారణం విజయ్ దేవరకొండ లాంటి హీరోకి నత్తి ఆడ్ చేసి సినిమాలో సుత్తి పెంచి అది పాన్ ఇండియా లెవెల్ లో దాని ఇంట్రడ్యూస్ చేసి పూరి గారు ఒక కొత్త చరిత్ర సృష్టిద్దాం అనుకున్నారు కానీ దానికి పులిస్టాప్ పడింది కేవలం దీనికే కాదు దీని తర్వాత ప్రాజెక్టు జనగణమన మనకు కూడా పులిస్టాప్ పడింది.

See also  Upasana: ప్రస్తుతం కడుపుతో ఉన్న ఉపాసనకు ఎన్టీఆర్ బార్య స్వయం గా పంపిన అద్భుతమైన కానుక..

ప్రస్తుతం విజయ చేతుల్లో ఉన్న ఒకే ఒక్క సినిమా ఖుషి, ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఆశలన్నీ ఈ చిత్రం పైనే. ఈ చిత్రం రిలీజ్ డేట్ పైనే తదుపరి సినిమాల అవకాశాలు వచ్చేది తెలుస్తాయి విజయ్ కోటి కళ్ళతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాడు కానీ సమంత ఆరోగ్య పరిస్థితి దృశ్య ఇంకా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుంది. వచ్చే నెలలో సమంత ఆరోగ్యం కుదుటపడుతుందని వార్తలు రావడంతో షూటింగ్ పనులు ప్రారంభిస్తారని అంచనా అయితే ఇప్పటికే ఈ సినిమా ఈ టైంలో కల్లా రిలీజ్ కావాల్సి ఉంది కానీ సమంత ఆరోగ్యం వల్ల కాస్త లేట్ అయింది. ఏదేమైనా సమంత ఆరోగ్యం కుదుటపడి విజయ్ కు ఈ సినిమా బారీ హిట్టుతో మళ్ళీ కం బ్యాక్ ఇవ్వాలని ఆశిద్దాం.

See also  Star heroines Marriages: రహస్యంగా పెళ్లి చేసుకుని అందరిని షాక్ కు గురి చేసిన స్టార్ హీరోయిన్స్ విళ్ళే..