Tollywood Industry Hits: ప్రతీ రంగంలో శ్రమ ఎలా ఉంటాదో , పోటీ కూడా అలానే ఉంటాది. పోటీ లేని ప్రపంచం చాల చప్పగా ఉంటాది. ఎందుకంటే మనిషి కష్టపడాలంటే పోటీ ఉండాలి లేకపోతే ఎదుగుదల ఉండదు. సినిమా రంగంలో కూడా పోటీ గట్టిగానే ఉంటాది. ఇక్కడ పోటీ అనేది నటీనటుల మద్యే కాదు, వాళ్ళ అభిమానుల మధ్య కూడా ఉంటాది. నిజానికి ( Tollywood Industry Hit movies list ) నటీనటులకు వాళ్ళ అభిమానుల పోటీ తత్వమే వాళ్లకు చాలా శక్తిని ఇస్తుంది. అందులోనే వాళ్లకు ఆనందం దొరుకుతుంది.
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. కానీ అందులో ఇండస్ట్రీ హిట్ అనే సినిమాలు కొన్ని మాత్రమే ఉంటాయి. ఇండస్ట్రీ హిట్ అంటే.. అప్పటివరకు ఉన్న సినిమా రికార్డ్స్ ని ఇంకొక సినిమా వచ్చి బ్రేక్ చేస్తాది. దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన అడవి రాముడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అలాగే ఆయన దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ఘరానామొగుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి ఇండస్ట్రీ హిట్ కొట్టాయి.
అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకతంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన.. అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడమే కాకుండా ట్రెండ్ ని సెట్ చేసింది అని కూడా చెప్పుకోవచ్చు. ఇకపోతే జక్కన్న అంటే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అలాగే రాజమౌళి దర్శకతంలో ( Tollywood Industry Hit movies list ) ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి, బాహుబలి 2 రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి.
అలాగే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాకుండా, ఇందులో సాంగ్ కి ఆస్కార్ అవార్డు కూడా తెచ్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా చేసిన పోకిరీ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇలా ( Tollywood Industry Hit movies list ) మొత్తం మీద చూస్తే.. ఎక్కువగా ఇండస్ట్రీ హిట్ రికార్డ్స్ కొట్టిన ఫ్యామిలీ అంటే అది మెగా ఫ్యామిలీ అని అర్ధమవుతుంది.