Adipurush movie: బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ మారిపోయింది. అప్పటినుంచి ప్రభాస్ సినిమా అంటే భారీ స్థాయిలో అంచనాలు ఉంటున్నాయి. అయితే బాహుబలి తరవాత వచ్చిన సినిమాలు అనుకున్న స్థాయిలో ఏమి హిట్ కాలేదు. ఇక ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఆదిపురుష్ పై భారీ అంచనాలు ఉన్నాయి ( Adipursh movie story was leaked and that scene will be super ). ఈ సినిమా శ్రీరామచంద్రుడి రామాయణం పై తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ అభిమానులు అయితే ఈ సినిమా పై గట్టి ఆశలే పెట్టుకున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ఆదిపురుష్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా జూన్ 16 న విడుదల కానుంది అని అనౌన్స్ చేసారు. ఇంకా రెండు నెలలు టైం దొరికింది కాబట్టి ఈ సినిమా గురించి నెటిజనులు బాగా కామెంట్స్ చేసుకుంటున్నారు. చిత్ర బృందం శ్రీరామనవమి రోజు ఒక పోస్టర్ రిలీజ్ చేసారు గాని, అది ఎవ్వరికీ నచ్చలేదో ఏమో గాని, చాలా నెగటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. దానివలన సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కి దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇకపోతే ఆదిపురుష్ సినిమా స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో పోస్ట్స్ వస్తున్నాయి. ఈ సినిమా రామాయణం మీదే నడుస్తాది కానీ, రామాయణంలో ఉన్న అనేక ఘట్టాలు ఉన్నాయన్నసంగతి మనకు తెలిసందే.
అందులో ఈ సినిమా ఎక్కడ నుంచి మొదలయ్యి, ఎక్కడితో ముగుస్తుందో అనేదే స్టోరీ. సినిమా మొదలు.. రాముడు తండ్రి మాటకై వనవాసం బయలుదేరతాడు. వనవాసంలో సీతను రాముడు తీసుకునిపోతాడు. సీతను వెతికే క్రమంలో ప్రభాస్(రాముడు) హీరోయిన్ (సీత) మధ్య జరిగిన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్ని చాలా బాగా చూపిస్తాడట. ఇక లంకను ( Adipursh movie story was leaked and that scene will be super ) అయితే చాల గ్రాఫిక్స్ తో చాలా అద్భుతంగా చూపిస్తాడట. ఆ తరవాత లాస్ట్ సీన్ సముద్రం దాటి వెళ్లి రాముడు రావణాసురిడితో చేసిన యుద్ధం, సముద్రంలో సీన్స్, ఆ యుద్ధం మొత్తం ఇంగ్లీష్ సినిమా చూస్తున్నంత క్లారిటీగా మంచి గ్రాఫిక్స్ తో 30 మినిట్స్ ఉంటాదట.
యుద్ధం గెలవడంతో సినిమా అయిపోతాదట. ఈ సినిమాలో సీతను రావణుడు ఎత్తుకుని పోయిన సన్నివేశంలో కూడా గ్రాఫిక్స్ చాలా బాగుంటాయట. అన్ని బాగానే ఉన్నాయి గాని, ఏ సినిమా అయినా ఒక భాష హీరో సినిమా ఆ భాషలో ఎంత పెద్ద హిట్ అయితే ఆ తర్వాత మిగిలిన అన్ని భాషల్లో అంత పాజిటివ్ రిజల్ట్ వస్తాది. కానీ ఈ సినిమాలో గ్రాఫిక్స్, బాలీవుడ్ దర్శకుడి అభిరుచి, ఇంగ్లీష్ సినిమాల సీన్స్ ప్రభావంతో సినిమాలో చాలా వరకు తెలుగుదనాన్ని మిస్ అవుతారేమో అనిపిస్తుంది.
దీనివలన సినిమా అంచనాలకు తగ్గట్టు హిట్ కాకపోవచ్చని అంచనాలు వేస్తున్నారు. ఏది ఏమైనా నెటిజనులు మాత్రం సినిమా స్టోరీని అల్లుకోవడంలో మంచి స్పీడ్ గా ఉన్నారని అర్ధం అవుతుంది. ఇక ఈ సినిమాలో అసలు స్టోరీ ఇలానే ఉంటాదా? లేదా? ఎలా ఉంటాదో తెలియాలంటే జూన్ 6 వరకు వెయిట్ చెయ్యాల్సిందే..