Keerthy Suresh: నాచురల్ స్టార్ హీరో నాని, కీర్తి సురేష్ హీరోయిన్ జంటగా కలిసి నటించిన చిత్రం (Dasara movie) దసరా.. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా లెవల్లో విడుదలై భారీ స్థాయిలో గుర్తింపు దక్కించుకుని బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.. దీంతో హీరో నాని ఖాతాలో మరొక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ పడ్డట్టేనని నాని అభిమానులు తెగ సంబంరంలో మునిగి తేలుతున్నారు.. ఇటు అభిమానులే కాక మరొపక్క చిత్ర యూనిట్, హీరో, హీరోయిన్లు కూడా సెలబ్రేషన్స్ మొదలుపెట్టేసారు. ఇక ఈ చిత్రం ఎంతో మందికి నచ్చి పాజిటివ్ వైబ్స్ తో దూసుకెళ్తుంది.
ఇక అసలు విషయానికి వస్తే.. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని వద్దన్నాడట డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. ఆయన ఎందుకు వద్దన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.. దసరా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. దసరా సినిమా కథ ముందుగా నాని కి వినిపించడంతో ఆయన సరే అని హీరోయిన్ గా కీర్తి సురేష్ ని తీసుకుంటే బాగుంటుంది అని చెప్పాడంట. కానీ నాకేమో కీర్తి సురేష్ హీరోయిన్ గా తీసుకోవడం అసలు ఇష్టం లేక వద్దనుకున్నాను. ఎందుకంటే ఇద్దరు స్టార్స్ ని నా సినిమాలో డీల్ చేయడం నా వల్ల కాదు అది కుదరని పని అనిపించింది.
కానీ నాని మాట కాదనలేక కీర్తి సురేష్ కి కూడా కథ వినిపించాడను. కథ వినడంతోనే కీర్తి సురేష్ నేను చెయ్యను అని చెప్పేసింది. తాను అలా చేయననేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ చిత్రంలో వెన్నెల పాత్ర కోసం అచ్చ తెలుగు అమ్మాయిని తీసుకుందామని ఎన్నో ప్రయత్నాలు చేశానని కానీ ఎక్కడా ఆ పాత్రకు తగ్గ అమ్మాయి దొరకకపోవడంతో.. మరోసారి కీర్తి సురేష్ కి ట్రాన్స్ లెటర్ ద్వారా ఈ కథ మొత్తం వినిపించానని తద్వారా కీర్తి సురేష్ ఈ సినిమాలో (Dasara movie) చేస్తానని ఒప్పుకుంది. అయినప్పటికీ కూడా నాకు కీర్తి సురేష్ ఈ సినిమాలో వద్దనే అనుకున్నాను, నాకు ఇష్టం లేదు తీసుకోవడం.
కానీ ఎప్పుడైతే ఈ చిత్రం కోసం మొదటి షార్ట్ తీసామో.. అది కీర్తి సురేష్ పేడ కలిపే సన్నివేషన్స్ లో నటించినప్పుడు నాకు తనపై పూర్తి నమ్మకం కలిగింది. దాంతో ఆమె కచ్చితంగా ఈ సినిమాలో వెన్నెల పాత్ర అద్భుతంగా చేస్తుందని భావించి కీర్తి సురేష్ ని ఫైనల్ చేసాము. ఇక్కడ ఈ చిత్రంలో వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ ని తప్ప మరొక హీరోయిన్ ని ఊహించలేమని ఎందుకంటే.. ఈ సినిమాలో కీర్తి సురేష్ వెన్నెల పాత్రలో అంతగా ఒదిగిపోయి నటించిందని మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. తప్పక ఈ సినిమా చూడండి వెన్నెల పాత్రను అస్సలు మిస్ అవ్వకండి. ఈ ఎండకాలం ఈ బ్లాక్ బస్టర్ సినిమా మీ కుటుంబంతో చూసి ఆనందించండి.