Home Cinema Keerthy Suresh: కీర్తి సురేష్ ప్రేమ వ్యవహారంపై తొలిసారి నోరు విప్పిన తన తల్లి..!! షాకింగ్...

Keerthy Suresh: కీర్తి సురేష్ ప్రేమ వ్యవహారంపై తొలిసారి నోరు విప్పిన తన తల్లి..!! షాకింగ్ నిజాలు.??

Keerthy Suresh: కీర్తి సురేష్ మలయాళ సినీ నిర్మాత అయినటువంటి సురేష్ కుమార్ గారి అలాగే మలయాళ నటి మేనక (Keerthy suresh mother) దంపతుల యొక్క కుమార్తె.. ఆమె తెలుగులో నటించిన మొదటి చిత్రం నేను శైలజ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన నటనతో తన టాలెంట్ చూపిస్తూ అతి తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపు పొందింది. తల్లిదండ్రుల బ్యాక్ గ్రౌండ్ ఏ మాత్రం ఉపయోగించకుండా స్వతహాగా తన టాలెంట్ తో, నటనతో కోట్ల మంది ప్రేక్షకుల మనసు కొల్లగొట్టింది. తాజాగా ఈ అమ్మడు నాని సరసన దసరా సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించింది.

See also  Sai Pallavi : అలాంటి టార్చర్ భరించలేక షూటింగ్ నుంచి ఏడుస్తూ వెళ్లిపోయిన సాయిపల్లవి..

Keerthy suresh mother talks about her daughter relationship for first time

ఈ చిత్రంలో తన నటనతో అందరిని ఇట్టే ఆకట్టుకుంది. నాచురల్ స్టార్ హీరో నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకుని విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ గా రివ్యూలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ సినిమాలో హీరో నాని హీరోయిన్ కీర్తి సురేష్ వారి జీవితంలోనే గొప్ప పర్ఫామెన్స్ ఇచ్చారని తెలుస్తుంది. ఇక వీళ్లిద్దరు కలిసి నటంచిన సినిమా డైరెక్టర్ త్రినాధరావు నక్కిన తెరకెక్కినటువంటి నేను లోకల్ ఎంత విజయం సాధించిందో మనందరికీ తెలుసు..

Keerthy suresh mother talks about her daughter relationship for first time

వీళ్ళిద్దరి కాంబోలో తెరకెక్కిన రెండవ చిత్రం దసరా.. ఇక అసలు విషయానికి వస్తే.. గత కొంతకాలంగా కీర్తి సురేష్ ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో తెగచిక్కర్లు కొడుతుంది. కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు, బడ వ్యాపారవేతతో ప్రేమలో మునిగి తేలుతుందని జోరుగా ప్రచారం సాగుతున్న విషయం మనందరికీ తెలుసు.. వీళ్లిద్దరు ఎంతో కాలం నుండి ప్రేమించుకుంటున్నారని వీరిద్దరి ప్రేమ వివాహం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కూడా ఆ వ్యక్తితో కీర్తి సురేష్ వివాహం చేయనున్నట్లు నిర్ణయించారని వార్తలు కూడా వినిపించాయి. త్వరలోనే పెళ్లి గురించి ఓ ప్రకటన కూడా ఉంటుందని టాక్ కూడా వచ్చింది.

See also  Baby : వైష్ణవి బేబీ సినిమాని ఎలా ఒప్పుకుందో సీక్రెట్ బయట పడింది..

keerthy-suresh-mother-talks-about-her-daughter-relationship-for-first-time

దీంతో ఈ వివాదం ఇంతటితో సద్దు మనగదని అర్థమైన కీర్తి సురేష్ తల్లి (Keerthy suresh mother) అలనాటి తార మేనక ఈ రూమర్ల గురించి తొలిసారి తన నోరు విప్పింది. నెట్టింట కీర్తి సురేష్ పై వస్తున్న వార్తలు ఏమాత్రం నిజం లేదని ఆమె తల్లి మేనక స్పష్టం చేశారు. ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న మేనక కీర్తి సురేష్ ఎవరిని ప్రేమించలేదని, తన ఫోకస్ మొత్తం తన తదుపరి సినిమాలపైనే ఉందని.. ఒకవేళ కీర్తి సురేష్ ఎవరైనా ప్రేమిస్తే మాకు కచ్చితంగా చెబుతుందని.. అప్పుడు మేమే స్వయంగా అతను ఎవరో మీడియాకు తెలుపుతామని స్పష్టం చేసింది. ఇలా కీర్తి సురేష్ మీద పుకార్లు వస్తున్నాయంటే దాని అర్థం ఆమె ఎంతో ఎత్తుకి ఎదిగిందని ఆమె తెలిపారు.