Ramcharan Birthday special: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు ఈరోజు. ఈరోజు మెగా అభిమానులు అందరికీ పండగలాంటి రోజు. రామ్ చరణ్ ((Game Changer movie name released for Ramcharan birthday special) జీవితంలో ఇప్పటి వరకు వచ్చిన పుట్టిన రోజుల్లో ఇదొక మంచి స్పెషల్ పుట్టినరోజు అని అనుకోవచ్చు. ఎందుకంటే తన భార్యతో పాటు, ఆమె కడుపులో ఉన్న తన బిడ్డతో కలసి ఈ ఏడాది పుట్టినరోజు గడుపుకుంటున్నాడు. వచ్చే పుట్టినరోజుకి పండంటి బిడ్డతో కలిసి ఇంకా ఆనందంగా రామ్ చరణ్ పుట్టినరోజు గడుపుకుంటాడు. అంతేకాదు ఆస్కార్ అవార్డు అందుకున్న నాటు నాటు పాట లో హీరోగా ప్రపంచ వ్యాప్తంగా రామ్ చరణ్ అందరికీ పరిచయం అయ్యాడు.యావత్ ప్రపంచంలో ఉన్న సినీ అభిమానుల అందరి నుంచి..
పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకుంటాడు. ఇక మెగా ఫామిలీ ఎంతో ఆనందంగా ఈ వేడుకను జరుపుకుంటుంది. రామ్ చరణ్ 15 వ సినిమా శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సంగతి మనకు తెలిసినదే. అయితే ఈ సినిమా టైటిల్ ఇంతవరకు ఓకే అవ్వలేదు. ఇప్పటి వరకు అనేక టైటిల్స్ సోషల్ మీడియాలో వచ్చాయి గాని, అందులో ఏదీ కూడా ఆఫిషియల్ గా నిర్ధారించలేదు. అయితే ఈ రోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేసారు. గేమ్ చేంజర్ అనే టైటిల్ ఈ సినిమాకి ఫిక్స్ చేస్తూ.. ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి, టైటిల్ దానికి తగ్గట్టుగా పెట్టారని..
అనుకుంటున్నారు. అసలు గేమ్ చేంజర్ అంటే ఏమిటి? ఈ సినిమా కథ దేనికి రిలేటెడ్ అని అనిపిస్తుందా? ఈ సినిమా కథ దేని గురించి నడుస్తాది? అందులో రామచరణ్ పాత్ర ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు అన్నిటికీ సమాధానంగా ఒక వీడియో రిలీజ్ చేసారు. అందులో చూపిన ప్రకారం ఈ సినిమా రాజకీయలపైన కథ అంతా నడుస్తాది. శంకర్ ఏ సినిమా తీసినా సమాజానికి ఒక మెస్సేజ్ ఇస్తాడు. అలాగే ఈ సినిమాలో కూడా రాజకీయాలకు రిలేటెడ్ ( Game Changer movie name released for Ramcharan birthday special)ఒక మెస్సేజ్ ఇస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్నికల అధికారిగా కనిపిస్తాడని అంటున్నారు. ఎన్నికల్లో రాజకీయనాయకుల గేమ్స్ ని తిరగరాసే క్యారెక్టర్ లో ఉంటాడని అంటున్నారు.
ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్ క్రేజ్ ఎంతగా పెరిగిందో.. అంతకంతకు ఎక్కువగా ఈ సినిమా తో క్రేజ్ పెరుగుతాదని అంచనాలు వేస్తున్నారు. కీయరా అద్వానీ, అంజలి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా అవ్వడం ఒక విశేషం. ఈ సినిమాలో శ్రీకాంత్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తాడట. ఈ సినిమా ఇప్పటికి సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే రామ్ చరణ్ వచ్చే ఏడాది సమ్మర్ లో 200 కోట్ల బుడ్జెట్ తో ఎన్నికలో బరిలో దిగుతూ రాజకీయనాయకుల ఎత్తుకు పై ఎత్తు వేసే క్యారక్టర్ లో.. ఈ సినిమాతో మన ముందుకు వస్తాడన్నమాట..