Rashmika: రష్మిక అంటే కుర్రాళ్లకు ఎంత ఇష్టమో, ఆమెకు వాళ్ళ దగ్గర ఉన్న క్రేజ్ ఎలాంటిదో మనందరికీ తెలుసు. చలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన రష్మిక, ఎక్కడా వెనక్కి తిరిగి చూడకుండా ఎదుగుతూ.. టాప్ హీరోయిన్ ( Rashmika sensational comments in interview ) లెవెల్ కి వెళ్ళిపోయింది. గీతగోవిందం సినిమాతో ఈమె స్థాయి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మాత్రమే ఆగిపోకుండా అనేక భాషల్లో తన సత్తా చాటుతుంది. ముఖ్యంగా రష్మిక విజయ్ దేవరకొండ జోడీకి మంచి ఫేమ్ ఉంది. రష్మిక ఎన్నుకున్న సినిమాల్లో మొదట్లో తన పాత్రకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది. ఇప్పుడు అనేక భాషలపై ఆమె శ్రద్ద పెట్టడం వలన, పాత్రపై ఎక్కువ శ్రద్ద పెట్టలేకపోతుందని అనిపిస్తుంది. దానికి నిదర్శనం ఇటీవల రిలీజ్ అయిన వారసుడు సినిమా.
వారసుడు సినిమాలో రష్మిక పాత్రకి అంత ప్రాముఖ్యత లేదు. ఒక క్రేజ్ ఉన్న హీరోతో కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ ని ఓన్లీ గ్లామర్ కోసం పెడితే ఎలాంటి పాత్ర ఇస్తారో, అలాంటి పాత్ర మాత్రమే ఇచ్చారు. అయినా ఆ సినిమా కూడా హిట్ అవ్వడం వలన, హీరోయిన్ ఖాతాలోకి కూడా వెళ్తాది అనుకోండి. అయితే ఇటీవల రష్మిక ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన పర్సనల్ విషయాలు చెబుతూ.. కొన్ని ఆశక్తికరమైన విషయాలను చెప్పుకుంటూ వచ్చింది. రష్మికకి ( Rashmika sensational comments in interview ) తన పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం అంట. ఆ పెంపుడు జంతువులను తాను చాలా ప్రేమగా చూసుకోవడమే కాకుండా.. పొద్దుట లేవగానే ముందు వాటితో కొంచెం టైం స్పెండ్ చేస్తానని చెప్పింది. వాటితో ఆడుకోవడంతోనే నా రోజును మొదలు పెడతానని చెప్పింది.
అలాగే ప్రతీ మనిషి జీవితం తాను మాట్లాడే తీరుని బట్టే ఉంటుందని అన్నది. మనం ఎదుటివారితో మాట్లాడే మాటను బట్టే.. వారితో సత్సంబంధాలు ఉంటాయని చెప్పింది. మన నోట్లోనుంచి వచ్చే ప్రతీ మాట ఎంతో విలువైనదని.. దానిని బట్టే మనకు ఎదుటివారితో ఉండే బంధాలు నిలబడతాయని చెప్పింది. చిన్న తేడాగా మాట్లాడినా కూడా.. అన్నేళ్ళుగా మనం నిలబెట్టుకున్న బంధాన్ని ఆరోజుతో పోగొట్టుకుంటామని చెప్పింది. తన జీవితంలో జరిగిన ప్రతీ సంఘటనని తన డైరీ లో రాసుకునే అలవాటు ఉందని చెప్పింది. అలాగే తాను ప్రతీ మనిషికి చాల విలువ ఇస్తానని చెప్పింది. ఏదైనా పని మీద బయటకు వెళ్లే ముందు ఇంట్లో పెద్దవాళ్ళ కాళ్ళు మొక్కుతానని చెప్పింది. అలాగే తనకు ఎవ్వరి మీద చిన్న చూపు ఉండదని చెప్పింది.
ఆఖరికి తనకు బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో పెద్దవాళ్లకే కాకుండా వాళ్ళ పనిమనిషి కాళ్ళు కూడా మొక్కుతానని చెప్పింది. పనిమనిషికి కూడా కాళ్ళు మొక్కేంత మంచి గుణం, సమానత్వం, ఇంతటి మానవత్వం రష్మిక కి ఎవరు నేర్పించి ఉంటారు అని కామెంట్స్ వస్తున్నాయి. బహుశా ఇంతటి సంస్కారం ఆమెకు తన తండ్రి నుంచి వచ్చి ఉంటాదని అనుకుంటున్నారు. ఎందుకంటే.. ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే తప్ప సడన్ గా వచ్చేయి కాదు. ఆడపిల్లలకి చిన్నప్పుడు తండ్రి దగ్గరే ఎక్కువ చనువు ఉంటాది. తండ్రికి బాగా చేరిక అయ్యి అన్ని తెలుసుకుంటాడు, నేర్చుకుంటాడు. అందుకే రష్మికకి ఇంతటి మానవత్వం, సమానత్వం మంచితనం తండ్రే నేర్పించి ఉంటాడు అని అనుకుంటున్నారు.