List of Tollywood heroines living without husbands: మన భారతదేశంలో సామాన్యులకైనా, సెలబ్రెటీస్ కి అయినా పెళ్లి అనేది ఒక రకమైన విలువను తెచ్చిపెడతాది. ముఖ్యంగా మన భారతదేశంలో వివాహానికి చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే పెళ్లంటే నూరేళ్ళ పంట అని అంటారు. పెళ్లంటే నూరేళ్ళ పంట అని ఎందుకు అంటారంటే.. పెళ్లి చేసుకున్న ఇద్దరినీ నూరేళ్ళపాటు కలిసి ఉండమని చెప్పడం. కానీ ఇప్పుడు నూరేళ్లు ఎక్కడ, నూరు రోజుల్లో వాళ్ళ స్టోరీ లో చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. అక్కడ నుంచి వాళ్ళు విడిపోవడానికి పెద్ద రీజన్స్ అవసరం లేకుండా పోతుంది. ఒకరినొకరు వద్దని అనుకున్న మరుక్షణం విడిపోవడమే. సెలబ్రెటీ జంట కలవడం ఒక న్యూస్, విడిపోవడం ఇంకొక బ్రేకింగ్ న్యూస్. ఇవే వీటికి పేర్లు, అంతే తప్ప పెళ్లి కి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? విడిపోవడం వలన వచ్చిన నష్టాలు ఏమిటి ఇవన్నీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
ఈరోజుల్లో సెలబ్రెటీస్ పెళ్లి చేసుకోవడం, విడిపోవడం వెంటనే ఇంకొక పెళ్లి చేసుకోవడం చూస్తూనే ఉన్నాము. అలాగే విడిపోవడం అనే కాన్సెప్ట్ కాకూండా, భర్త గాని, భార్య గాని చనిపోతే కూడా ఇంకొక పెళ్లి చేసుకుంటున్న పరిస్థితులను చూస్తున్నాం. కానీ భర్త చనిపోయినా కూడా పెళ్లి చేసుకోకుండా ఉండి వాళ్ళ జ్ఞాపకాలకు దూరం కాకుండా.. వారి ప్రేమను తలుస్తూ.. పిల్లల భవిష్యత్తు కోసం బ్రతుకున్న మన టాలీవుడ్ హీరోయిన్స్ లను ఒక్కసారి ( List of Tollywood heroines living without husbands ) చూద్దాం.. 1. సురేఖా వాణి.. ఈమె చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. మళ్ళి చేసుకునే వయసు అందం కూడా ఉంది. అయినా కూడా ఇప్పటివరకు ఈమె తన కూతురి భవిష్యత్తు కోసం ఆలోచించి, ఆమెను పెంచుకుంటూ భర్త జ్ఞాపకాలతో హాయిగా బ్రతికేస్తుంది. సురేఖ వాణి తల్లి, వదిన, అక్క పాత్రలలో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది.
2. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో, సీరియల్స్ లో నటించే రాగిణి కి పెళ్లి అయిన వెంటనే భర్త చనిపోయాడు. అయినా కూడా ఆమె తన అక్క పిల్లతో హాయిగా బ్రతుకుతుంది. 3. ఉదయకిరణ్ భార్య కూడా చిన్న వయసులోనే భర్తని పోగొట్టుకుంది. అయినా కూడా ఆమె మళ్ళి పెళ్లి చేసుకోకుండా, ఉదయకిరణ్ జ్ఞాపకాలతో చెన్నైలో ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతుంది. 4. రఘువరన్ భార్య రోహిణి.. ఈమె సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్, రఘువరన్ చనిపోయిన తరవాత మరో పెళ్లి చేసుకోకుండా.. కొడుకుని పెంచుకుంటూ బ్రతికేస్తుంది. 5. శ్రీహరి భార్య డిస్కో శాంతి కూడా ఆమె భర్త శ్రీహరి చనిపోయిన తరవాత మరో పెళ్లి చేసుకోకుండా ఆయన జ్ఞాపకాలతో బ్రతికేస్తుంది. 6. మీనా భర్త కూడా లాస్ట్ ఇయర్ చనిపోగా, ఆమె కూడా పెళ్లి మాట ఆలోచించకుండా.. తన కూతురిని పెంచుకుంటూ బ్రతుకుతుంది.
7. భానుప్రియ భర్త కౌశల్ చనిపోయాక కూడా ఇంకొక పెళ్లి చేసుకోలేదు. 8. సుమలత కూడా తన భర్త చనిపోయిన తరవాత పెళ్లి మాట ఎత్తకుండా పిల్లల కోసం బ్రతుకుతుంది. 9. జయసుధ భర్త నితిన్ కపూర్ చనిపోయినా పిల్లల భవిష్యత్తు కోసం అలాగే జీవిస్తోంది. ఇలా ఎందరో తమ భర్తలు చనిపోయినా వాళ్ళ జ్ఞాపకాలకు, వాళ్ళ ఇంటిపేరుకు దూరం కాకూండా జీవిస్తున్నారు.