Home Cinema Niharika: షాకింగ్.. అందుకే విడాకులు తీసుకోబోతున్న నిహారికా!

Niharika: షాకింగ్.. అందుకే విడాకులు తీసుకోబోతున్న నిహారికా!

Shocking comments on Niharika about her divorce: మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన మెగా ఫ్యామిలి అంటే తెలుగు సినీ అభిమానులకు ఎంత ప్రేమో కొత్తగా చెప్పుకోనక్కరలేదు. చిరంజీవి ఒక్కడిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, ఇప్పుడు సగం పైన సినిమా ఇండస్ట్రీ అంతా మెగా హీరోలే కనిపిస్తున్నారు అంటే అది కేవలం చిరంజీవివి కృషి, పట్టుదల మరియు మంచి మనసు అని చెప్పుకోవచ్చు. మెగా ఫ్యామిలీ నుంచి మెగా హీరోలు ఎక్కువమందే వచ్చారు గాని, హీరోయిన్ అయ్యే సాహసం మాత్రం నాగబాబు కూతురు నిహారిక ఒక్కర్తే చేసింది. కానీ పాపం నిహారికా సినిమాల్లో హీరోయిన్ గా నిలబడలేకపోయింది. సినిమాలంటే నిహారికకు ఎంత ఇష్టమో కనిపిస్తూ ఉంటాది కానీ, ఆమె ఎందుకు మంచి హీరోయిన్ అవ్వలేకపోయిందో ఒక పజిల్ గానే ఉంటాది.

See also  Rashmika: పంది మాంసం పై సంచలమైన కామెంట్స్ చేసిన రష్మిక మందన.

shocking-comments-on-niharika-about-her-divorce

అయితే మెగా డాటర్ కి సినిమా లు మాత్రమే కాదు పెళ్లి కూడా కలిసి రాదంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి కూతురు మొదటి పెళ్లి ఇంట్లోవాళ్లకు ఇష్టం లేకుండా చేసుకుని, కొంతకాలం తరవాత అతన్ని వదిలేసింది. తరవాత ఇంట్లో వాళ్ళ ఇష్టం తోనే రెండవ పెళ్లి చేసుకుని అతన్ని కూడా వదిలేసింది. ఇక నిహారిక విషయానికి వస్తే, కొంతకాలం నాగసౌర్య తో ప్రేమలో ఉందని అనేవారు. కానీ తరవాత అది నిజం కాదని తేలింది. సినిమాల్లో పెద్దగా వర్కౌట్ కాకపోయే సరికి నిహారికకి జొన్నలగడ్డ చైతన్య తో పెళ్లి చేసారు. నిహారిక పెళ్లిని మెగా ఫామిలీ ఎంతో ఘనంగా చేసారు. రాజస్థాన్ ప్యాలెస్ లో చాలా అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. వీరిద్దరి జంట కూడా చూడముచ్చటగా ఉంటాది.

See also  Balagam - Virupaksha : బలగం విరూపాక్షలో వాళ్లిద్దరూ ఆ ఒక్కదాన్నే నమ్ముకుని కోట్ల డబ్బు రాబట్టారు.. ట్రై చేస్తే పోలా?

shocking-comments-on-niharika-about-her-divorce

నిహారిక పెళ్లి తరవాత కూడా సోషల్ మీడియాలో చాలా హుషారుగా ఉంటున్న విషయం తెలిసినదే. అయితే సోషల్ మీడియాలో ఒక వార్త బాగా హల్చల్ చేస్తుంది . అదేమిటంటే.. విడాకులు ఇవ్వబోతున్న నిహారిక అంటూ వార్తలు వస్తున్నాయి. కొన్ని కారణాలు వలన నెటిజనులు నిహారిక విడాకులు తీసుకుంటాదని ఫిక్స్ అవుతున్నారు. అసలు సంగతి ఏమిటంటే.. పెళ్ళైన తరవాత నిహారికా (Shocking comments on Niharika about her divorce ) సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటాది. ఒంటరిగా వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇకపోతే ఇప్పటివరకు చైతన్యతో కలిసి దిగిన ఫోటోలను ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం చాలా అరుదు.. దీంతో నిహారిక చైతన్యను దూరం పెడుతోంది అంటూ వార్తలు వచ్చాయి.

See also  NTR Birthday : ఎన్టీఆర్ బర్త్ డే కి లక్ష్మి ప్రణతి ఇచ్చిన గిఫ్ట్ లో అద్భుతమైన స్పెషల్ ఏమిటంటే..

ఈ వార్తలకు తగట్టుగా నిహారిక, చైతన్యలు ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాల్లౌ చేసుకున్నారు. అంతేకాదు తమ పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఇక వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు అంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. అసలు ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే, అసలు నిజం నిహారిక చెబితే గాని నమ్మలేము. ఏది ఏమైనా మెగా ఫామిలీ లో అమ్మహాయిలకు ఇలా జరగటం అభిమానులకు బాధగానే ఉంటాది. అభిమానులకే అలా ఉంటుంది అంటే, ఇక ఆ కుటుంబానికి ఎంత బాధగా ఉంటాదో అర్ధం చేసుకోవాలి.