Home Cinema Taraka Ratna: తారకరత్న మరణం తరవాత అతని భార్యకు ఎవరు సపోర్ట్ గా ఉన్నారో తెలిస్తే...

Taraka Ratna: తారకరత్న మరణం తరవాత అతని భార్యకు ఎవరు సపోర్ట్ గా ఉన్నారో తెలిస్తే షాక్ అవుతారు.. పైగా బంధువంట..

Taraka Ratna wife Alekhya Reddy sister details:తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటీవల ఒకరి తరవాత ఒకరు అనుకోకుండా చనిపోతున్నారు. బాగా ఏజ్ ఉన్నవారు, జీవితంలో అన్ని బాధ్యతలు తీరి, జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించిన వారు చనిపోయినా బాధగానే ఉంటాది గాని.. మరీ అంత భరించలేని బాధని ఇవ్వదు. కానీ ఇటీవల మరణించిన తారకరత్న మాత్రం వయసులో చిన్నవాడు, ఇంకా బాధ్యతలు తీరని వాడు అవ్వడం వలన అందరూ బాధపడతున్నారు. పైగా పిల్లలు కూడా చిన్నవాళ్లు. నలభై ఏళ్ళ వయసులో చనిపోయిన తారకరత్నని చూసి ఆయన భార్య, పిల్లలు, తల్లి ఏడ్చిన విధానం చూస్తే, నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. సినిమాలలో హీరోగా ఎంటర్ అవుదామని వచ్చిన తారకరత్న అప్పట్లో ఒకేసారి 9 సినిమాలకు సైన్ చేసిన ఘనత ఆయనకే దక్కింది.

See also  JR.NTR: జాన్వి కపూర్ కి జూనియర్ ఎన్టిఆర్ అంటే ఎంత ఇష్టమో మరోసారి బయటపడింది.

taraka-ratna-wife-alekhya-reddy-sister-details

 

ఆ తర్వాత అతనికి అదృష్టం కలసి రాక, అతనికి హిట్ అనేది తగలక సినిమా రంగంలో నిలబడటం కష్టం అయ్యింది. అలా సినిమా రంగంలో నిలబడలేకపోవడం నిజంగా బాధాకరం. మరణానికి ముందు తారకరత్న తన అదృష్టాన్ని రాజకీయాలలో పరీక్షిద్దామని లోకేష్ యువగలం కాలి నడకలో పాల్గొని కొంచెం దూరానికి వెళ్ళేసరికే ఆయున పడిపోవడం ఆ తరవాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగినా బ్రతకలేకపోవడం నందమూరి కుటుంబానికి బాధను మిగిల్చింది. తారకరత్న మరణం తరవాత అతని భార్య అలేఖ్య రెడ్డిని ఓదార్చడం ఎవ్వరి తరం కాలేదు. ఆమె సోషల్ మీడియాలో తన భర్త జ్ఞాపకాలను పోస్ట్ చేస్తూ తన బాధని అందరితో పంచుకునేది. తారకరత్న మరణం తరవాత అలేఖ్య రెడ్డికి దగ్గరగా ఉంటూ వాళ్ళ బంధువుల్లో ఒకరు ధైర్యం చెబుతున్నారంట.

See also  Mahesh Babu - Namratha : మహేష్ నమ్రతల పెళ్ళి తో త్రిష కి ఉన్న లింక్ ఏమిటంటే..

taraka-ratna-wife-alekhya-reddy-sister-details

 

ఇక్కడ నుంచి నువ్వు నీ గురించి కాదు పిల్లల గురించి ఆలోచించి ధైర్యం తెచ్చుకుని బ్రతకాలంటూ ఆమె చెల్లెలు ధైర్యం చెబుతుందంట. అలేఖ్య రెడ్డి చెల్లి అంటే సొంత చెల్లి కాదు కానీ బాగా దగ్గర చుట్టం. ఇంతకీ ఆ చెల్లెలు ఎవరో కాదు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు. ఈయన కూతురు పేరు నేహా రెడ్డి. ఈమె ప్రముఖ ఫార్మా దిగజం అయిన అరవిందో ఫార్మాసిటికల్స్ చైర్మన్ కొడుకు రోహిత్ రెడ్డి భార్య. అలేఖ్య రెడ్డి, నేహా రెడ్డి ( Taraka Ratna wife Alekhya Reddy sister details )ఇద్దరు సొంత అక్క చెల్లెళ్లు కాకపోయినా కూడా సొంత అక్క చెల్లెళ్ల కంటే ఎక్కువ అనుబంధం ఉంది. ఇక అలేఖ్య ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న టైంలో కూడా అలేఖ్య కు చాలా సపోర్ట్ ఇచ్చిందట నేహా రెడ్డి.

See also  Tarakaratna: తారకరత్న అంత్యక్రియల్లో బాలకృష్ణని హెచ్చరించిన ఆ పిచ్చోడు ఎవరు.??

taraka-ratna-wife-alekhya-reddy-sister-details

 

వీళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెల్లు కాకపోయినా, రాజకీయ పార్టీల పరంగా నేహారెడీ తండ్రి విజయసాయి రెడ్డి , అలేఖ్య రెడ్డి భర్త తారకరత్న రెండు విభిన్న పార్టీలు టీడీపీ వైసీపీ కి చెందిన వారైనా కూడా స్నేహా రెడ్డి కష్టంలో ఉన్న తన అక్క లాంటి అలేఖ్య రెడ్డి కి అంత సపోర్ట్ గా నిలబడి ధైర్యం చెప్పడం నిజంగా అందరూ స్నేహ రెడ్డిని మెచ్చుకుంటున్నారు.