Home Cinema Honey Rose: ఆ పనులు చేస్తూ కూడా గట్టిగా సంపాదిస్తున్న హనీ రోస్..

Honey Rose: ఆ పనులు చేస్తూ కూడా గట్టిగా సంపాదిస్తున్న హనీ రోస్..

Honey Rose Earning Money: తెలుగులో 2008వ సంవత్సరంలో వచ్చిన ఆలయం అనే చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది హనీ రోస్. ఆ సినిమా తర్వాత ఈ అమ్మడుకి ఇక్కడ సరైన అవకాశాలు రాలేదు. అయితే మలయాళంలో మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలో చేసుకుంటూ ఓ రేంజ్ లో గుర్తింపు దక్కించుకుంది. ఇక్కడ రీసెంట్ గా చేసిన వీర సింహారెడ్డి సినిమాతో మళ్లీ టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళం ముద్దుగుమ్మ పేరు ప్రస్తుతం మాత్రం తెలుగులో ఓ రేంజ్ లో మూత మోగిపోతుంది.

See also  Anchor Varshini: సీఎం జగన్ మోహన్ రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వర్షిణితో ఉన్న సంబంధం ఇదే..

honey-rose-is-also-earning-huge-money-by-doing-this

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రూపుదిద్దుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా బరిలోకి దిగి సంచలనమైన హిట్ సాధించి సూపర్ హిట్ గా నిలిచిపోయింది. అయితే ఈ సినిమాలో మెయిన్ రోల్ శృతిహాసన్ అయినప్పటికీ హనీ రోస్ కే ఎక్కువ గుర్తింపు దక్కిందని చెప్పాలి. బాలయ్య మరదలుగా.. తల్లిగా నటనతో అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటోలతో ఘాటుగాటు ఫోటోషూట్లతో మరింత పాపులర్ అయింది.

honey-rose-is-also-earning-huge-money-by-doing-this

అప్పుడే విరబూసి విచ్చుకుంటున్న లేలేత గులాబీ రంగులో ఉన్న రోజా పువ్వుల ఆమె చిరునవ్వుకు కుర్రాళ్ళు దాసోహం అవుతున్నారు. ఆమె అందచందాలకు మైమరిచిపోతున్నారు. తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే హనీ రోజ్ సినిమాల ద్వారానే కాకుండా షాపింగ్ మాల్ ఓపెనింగ్ ద్వారా కూడా గట్టిగా సంపాదిస్తుంది. ఒక సినిమా హిట్ అయితే క్రేజ్ సంపాదించుకుంటే సైడ్ ఇన్కమ్ కోసం షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఆఫర్లు వస్తుండడం చూస్తుంటాం. అదే హనీ రోజు విషయంలో కూడా జరుగుతుంది.

See also  Surekha Vani Daughter: సురేఖ వాణి కూతురు సుప్రీత తనుప్రేమించిన బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పిందా.??

honey-rose-is-also-earning-huge-money-by-doing-this

కానీ ఏకంగా ఒకటి రెండు కాదు వరుస ఆపర్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే నాలుగు ఐదు చోట్ల షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ అటెండ్ అయినా ఈ గురువారం ఖమ్మంలో ముగ్ధ షోరూం ఓపెనింగ్ కి హాజరు కాబోతోంది. ఇందు గాను ఆ షోరూం వారు ఆమెకు భారీగానే ఫోటో ముట్ట చెప్పినట్టు సమాచారం. మొత్తానికి హనీ ఈరోజు తన క్రేజ్ ను బాగానే క్యాష్ (Honey Rose Earning Money) చేసుకుంటుందని చెప్పవచ్చు. ఓవైపు వరస సినిమాలతో దూసుకుపోతూ మరోవైపు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లో ఈ మలయాళం ముద్దుగుమ్మ సందడి చేస్తుంది.