Home Cinema Raashii Khanna: మహేష్ బాబు పై తన మనసులో ఉన్న మాట బయట పెట్టిన రాశి...

Raashii Khanna: మహేష్ బాబు పై తన మనసులో ఉన్న మాట బయట పెట్టిన రాశి కన్నా

Raashii Khanna Comments: తెలుగు చిత్ర పరిశ్రమకి ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైంది రాశి కన్నా. మొదటి సినిమాలోనే తన అందంతో,అభినయంతో హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఆ తర్వాత తమిళంలో కూడా నటించింది, తమిళంలో మాత్రం వరుస చిత్రాలతో తగ్గేది లేదంటూ దూసుకుపోతుంది తను.. అలా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా తనకంటూ తెలుగు ఇండస్ట్రీలో గొప్ప స్థానాన్ని పదిల పరుచుకుంది.

rashi-khanna-made-interesting-comments-on-mahesh-babu

ఆ తర్వాత నెమ్మ నెమ్మదిగా ఇటు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ బిజీబిజీగా ఉంటుంది. అయితే తాజాగా రాజ్ మరియు కేడి దర్శకత్వంలో వచ్చిన ఫర్జీ వెబ్ సిరీస్ లో ఈమె నటించింది. అయితే ఈ వెబ్ సిరీస్లో సాహిద్ కపూర్ మరియు విజయ్ సేతుపతి తో పాటు రాశి కన్నా కూడా నటించి ఒక్కసారిగా అందర్నీ అలరించి ఆకట్టుకుంది. తను ఈ వెబ్ సిరీస్లో మేఘ అనే ఒక కీలక పాత్ర పోషించింది. ఈ వెబ్ సిరీస్ లో రాశి కన్నా ఆర్బిఐ ఆఫీసర్గా నటించి అందర్నీ ఎంతోగానో మెప్పించింది.

See also  Upasana: సీమంతం రోజు ఉపాసన వేసుకున్న డ్రస్ ధర అన్ని లక్షలా.?

rashi-khanna-made-interesting-comments-on-mahesh-babu

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశి కన్నా దీని గురించి కూడా సోషల్ మీడియాలో లైవ్ లో పెట్టింది. అదే క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి సంచలమైన వ్యాఖ్యలు చేసింది రాశి కన్నా. అదేంటంటే ఇటీవలే సోషల్ మీడియా లైవ్ లో పాల్గొన్న రాశి కన్నా ఓ అభిమాని అడిగాడు మహేష్ బాబు తో ఎప్పుడు నటిస్తారో చెప్పమని.. దాంతో రాశి కన్నా మాట్లాడుతూ నేను మహేష్ బాబు (Raashii Khanna Comments) గారికి చాలా పెద్ద ఫ్యాన్ మహేష్ బాబు నమ్రత గారు చాలా మంచి వ్యక్తులు నేను ఇప్పుడు కాదు ఎప్పటినుంచో ఆయన వీరాభిమాని.

See also  Bhola Shankar Review : భోళాశంకర్ లో దర్శకుడి చీప్ ట్రిక్స్ తో చిరంజీవిని చీప్ చేసిన సీన్స్ ఇవే.. రివ్యూ మరియు రేటింగ్..

rashi-khanna-made-interesting-comments-on-mahesh-babu

ఆయనతో ఒక్క సినిమాలో నటించాలని ఎప్పటినుంచో ఆశపడుతున్నాను అంటూ ఆమె మనసులో ఉన్న అసలు నిజం బయటపెట్టింది రాశి కన్నా. ప్రస్తుతానికి కాకపోయినా భవిష్యత్తులో ఆయనతో కలిసి నటించే అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను అంటూ వ్యక్తపరిచింది. ప్రస్తుతమైతే కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలో రాశి కన్నా సెకండ్ హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో పోయిన వారంలో రాశి కన్నా తన సినిమాలకు సంబంధించిన ఒక లేటెస్ట్ ఫోటో కూడా సోషల్ మీడియాలో మనందరికీ షేర్ చేసిన విషయం తెలిసిందే..