Navadeep: తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఒక్కొక్కరుగా ఇప్పటికే 7 అడుగులు వేస్తూ పెళ్లిబాట పయనమయ్యారు. ఇక రీసెంట్గా ఆ మొన్న నాగశౌర్య పెళ్లి చేసుకున్నాడు, తనేగాక శర్వానంద్ కూడా ఎంగేజ్మెంట్ చేసుకొని వంటి వాడు కాబోతున్నాడు. ఇకపోతే ప్రభాస్ కూడా ఈ సంవత్సరం పెళ్లికి సిద్ధమయ్యాడు అంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే తరహాలో నవదీప్ కూడా ఏడడుగులు వేయబోతున్నారా అంటే మరేమవుతుందో చూద్దాం.. ఇదిలా ఉంటే గతంలో గౌతం ఎస్ఎస్సి తో మొదటి సినిమాతో పరిచయమై తర్వాత చందమామ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నవదీప్.
అలా తన జీవితం సాఫీగా సాగుతుందన్న సమయంలో అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యాడు. మళ్లీ కొద్ది రోజుల తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా రీఎంట్రీ ఇచ్చాడు. చాలా రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు అనే సమయంలో ధ్రువ, నేనే రాజు నేనే మంత్రి సినిమాలో కీలక పాత్ర వహించి మళ్లీ కం బ్యాక్ అయ్యాడు. ఆయన నటించిన ఈ పాత్రలన్నిటికీ మంచి గుర్తింపు రావడంతో ట్రాక్ లోకి వచ్చాడు. కానీ ప్రస్తుతానికి అయితే ఈ హీరో నుంచి ఎలాంటి సినిమా అప్డేట్ రాలేదు. ఇదే సమయంలో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత ఫేమస్ అయ్యాడు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ లోకి వచ్చి చివరి వరకు ఉన్న కంటెస్టెంట్ గా గుర్తింపు పొందాడు. అలాగే అప్పట్లో బుల్లితెరపై ప్రచారం అయ్యే షోలకు హోస్ట్ గా వ్యవహరించాడు. తాజాగా నవదీప్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు అంటూ ఒక పోస్ట్ వైరల్ అయింది. నవదీప్ పెళ్లి చేసుకోబోతున్నాడు అని పోస్ట్ చెయ్యకుండా, వాలెంటైన్స్ డే సందర్భంగా అమ్మాయి సిగ్గుతో నవ్వుతూ తన ముఖాన్ని దాచుకున్న ఫోటోని అలాగే రింగ్ ని చూపిస్తూ తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో చూసిన చాలామంది నటిజన్స్ నవదీప్ కూడా పెళ్లి పీటలేకపోతున్నాడని అనుకున్నారు.
నవదీప్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి కావచ్చని, ఎంగేజ్మెంట్ కూడా జరిగి ఉండొచ్చు అంటూ రకరకాల కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అయితే ఆ ఫోటో షేర్ చేస్తూ దాని కింద ఖుషి అహుజా అనే ఓ పేరును కూడా ట్యాగ్ చేశారు. కానీ ఆ పేరు చూసి చాలామంది ఆమె ఎవరని సోషల్ మీడియా ఆరా తీయగా ఆ పేరుతో ఎవ్వరు కూడా లేరు. మరి కొంతమంది ఫూల్ చేశాడంటూ, మరికొందరు నవదీప్ నిజంగా పెళ్లి చేసుకోబోతున్నాడు కావచ్చు అనే కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నవదీప్ హీరో వస్తున్న లవ్ మౌళి మళ్లీ తన కెరీర్ ని కొత్త ఊపునిస్తుందని చాలామంది భావిస్తున్నప్పటికీ ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఏదేమైనాప్పటికీ ఈ హీరో కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుందంటున్నారు నేటిజన్స్..