Home Cinema Chiranjeevi – Pawan Kalyan: రైల్వేస్టేషన్ లో చిరంజీవి పరువు తీసిన పవన్ కళ్యాణ్!

Chiranjeevi – Pawan Kalyan: రైల్వేస్టేషన్ లో చిరంజీవి పరువు తీసిన పవన్ కళ్యాణ్!

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ మెగా అన్నదమ్ములు ఇద్దరిపై మెగా ఫాన్స్ కి ఉండే అభిమానాన్ని కొలవలేము.  చిరంజీవి తమ్ముడిగా పరిచయం అయిన పవన్ కళ్యాణ్ తనకంటూ సూపర్ క్రేజ్, ఒక స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా, రాజకీయాలలో కూడా చిరు పార్టీ ద్వారా ఎంటర్ అయ్యి, ఇప్పుడు తనకంటూ ఒక పార్టీ తో ముందుకు వెళ్తున్నారు.

చిరంజీవి ఇటీవల నిజం విత్ స్మిత అనే టాక్ షో లో పాల్గున్నారు. ఇందులో ఆయన అనేక పర్సనల్ విషయాలను చెప్పారు. అందులో ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి కూడా అనేక విషయాలను చెప్పారు. పవన్ కళ్యాణ్ అభిమానులకు మిగిలిన వారి అభిమానులకు తేడా ఉందని, పవన్ అభిమానులను అభిమానులు అనే కంటే భక్తులు అంటే బెస్ట్ అని అన్నారు. పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఫ్యాన్స్ కంటే కూడా చిరంజీవికి బాగా తెలుసని , ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందు పెరిగాడు కాబట్టి అని అన్నారు.

See also  Naga Chaithanya: పాపం.. రెండుసార్లు నాగచైతన్య కెరీర్ ని నాశనం చేసిన వ్యక్తి ఎవరంటే.. మీరేమంటారు?

పవన్ కళ్యాణ్ నక్సలిజంలోకి వెళ్ళిపోతాడేమో అనుకునేవాడిని అని చిరంజీవి అన్నారు. పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు గన్ లతో ఎక్కువగా ఆడేవాడంట. చిరు షూటింగ్ కి వెళ్ళేటప్పుడు, అన్నయ్య ఏదైనా గన్ బొమ్మలు ఉంటె తీసుకుని రా అని చెప్పేవాడంట. అలాగే ఒకసారి చిరంజీవి ఫామిలీ తో ఎక్కడికో వెళ్తుంటే. పవన్ కళ్యాణ్ చేతిలో గన్ పెట్టుకుని రైల్వే స్టేషన్ లో హడావిడి చేసాడంట. అది చూసిన సిబ్బంది చిరుని ఆపారంట.

See also  Nandamuri Mokshagna : మోక్షజ్ఞ ఎంట్రీ తో పాటు ఎంట్రీ ఇస్తున్న మరో బడా ఫ్యామిలీ వారసుడు ఎవరో తెలుసా?

ఆ తరవాత అది నిజం గన్ కాదని, బొమ్మ గన్ అని తెలిసి, రైల్వే సిబ్బంది సారీ చెప్పి వదిలారంట. ముద్దుల తమ్ముడు పవన్ కళ్యాణ్ వలన కొన్ని నిముషాల పటు చిరంజీవి రైల్వే సిబ్బంది తో ఇబ్బంది పడాల్సి వచ్చిందన్నమాట. ఇంకా చిరు అనేక విషయాలను చెప్పి ఆ షో మీద ఇంటరెస్ట్ కలిగేలా చేసారు.