ప్రభాస్ పెళ్లి అనే టాపిక్ చాలా రోజులుగా సాగుతున్నది కాని, ఇప్పుడు మరీ ఎక్కువగా ఉంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ప్రభాస్ పెళ్లి గురించి అనేక పోస్ట్స్ హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ కి పెళ్లి వయసు వచ్చి చాలా కాలం అయ్యింది. సినిమాలతో, హిట్స్ తో ఆనందంగా గడిపేస్తున్న ప్రభాస్ పెళ్లి అనేదగ్గరకి వచ్చేటప్పటికి మాత్రం ముందడుగు వేయడం లేదు. ఎందుకో గాని, పెళ్లిని ఎంత దాటిస్తే అంత మంచిదన్నట్టు ఉన్నాడు.
ప్రభాస్ అనుష్క లవ్ లో ఉన్నారని, వారిద్దరూ పెళ్లి చేసుకుంటారని ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒక్క అనుష్క గురించే కాదు.. త్రిష, కృతి సనన్ లతో కూడా ప్రభాస్ లవ్ లో ఉన్నాడని వార్తలు చాలాసార్లు వచ్చాయి. కానీ అన్ని వార్తలని ఎప్పటికప్పుడు ప్రభాస్ ఖండిస్తూనే వచ్చాడు. మొన్ననే అనుష్క తల్లితండ్రులు.. ప్రభాస్ వాళ్ళ అమ్మగారిని కలవడానికి వెళ్తే.. ప్రభాస్, అనుష్కల పెళ్లి గురించి మాట్లాడటానికి వెళ్లారని వార్తలు వచ్చాయి.
ఇలా ప్రభాస్ పెళ్లి గురించి ఎదో ఒక రకమైన వార్తలు వస్తుంటే, ఇప్పుడు మరొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ప్రభాస్ ఎంగేజ్మెంట్ వచ్చేవారం జరగబోతుంది అంటూ ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సందు తన సోషల్ మీడియా ఖాతాలో చెప్పుకొచ్చారు.అంతేకాదు ఎంగేజ్మెంట్ ఇక్కడ కాదు మాల్దీవ్స్ లో అని కూడా చెప్పారు. ప్రభాస్ ఎంగేజ్మెంట్ అనగానే ఎవరితో అని అందరికీ ఆతృతగా ఉంటాది కానీ, మరో పక్క అనుష్క తోనే అయ్యి ఉంటుందని అనుకుంటారు.
ప్రభాస్ ఎంగేజ్మెంట్ కృతి సనన్ తో జరగబోతుంది. ఆది పురుష్ అనే సినిమాలో వీళ్ళిద్దరూ నటిస్తున్నారు. ఆ షూటింగ్ టైంలోనే వీరిద్దరి మధ్య లవ్ ఏర్పడిందని అనుకుంటున్నారు. అయితే ఈ వార్తలో కూడా ఎంతవరకు నిజముందో తెలీదో గాని.. అయ్యయ్యో ప్రభాస్ అనుష్కను కాకుండా, కృతి సనన్ చేసుకుంటున్నాడా? అని అభిమానులు అనుకుంటున్నారు.