ఈ ఏడాది ఆగస్టు 15 వ తేదీన టాలీవుడ్ లో వరుసగా నాలుగు సినిమాలు విడుదలైన సంగతి మన అందరికీ తెలిసిందే. అందులో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ భారీ అంచనాలతో విడుదల అవ్వగా, ఆయ్ మరియు తంగలాన్ చిత్రాలు చిన్న సినిమాలు గానే విడుదల అయ్యాయి. వీటిల్లో ఒక్క ఆయ్ చిత్రం తప్ప మిగిలిన మూడు సినిమాలు డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచాయి(This Week OTT Movies). ముఖ్యంగా మిస్టర్ బచ్చన్ చిత్రం పై అంచనాలు తారా స్థాయిలో ఉండేవి.
ఎందుకంటే రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా, పాటలు సూపర్ హిట్ అయ్యాయి, హీరోయిన్ అదిరిపోయింది, హైప్ కూడా కావాల్సినంత వచ్చేసింది, సినిమా యావరేజి గా ఉన్నా చాలు, బాక్స్ ఆఫీస్ బద్దలే అని అందరూ అనుకున్నారు. కానీ అంచనాలను తలక్రిందులు చేస్తూ, ఆ సినిమా కనీస స్థాయిలో కూడా ఆకట్టుకోలేకపోయింది(This Week OTT Movies). ఇక పూరి జగన్నాథ్ మరియు రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం కూడా భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది.
కానీ ఇటీవలే ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయగా, అక్కడ మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. కమెడియన్ అలీ కి సంబంధించిన ట్రాక్ తప్ప, సినిమా పర్వాలేదు, బాగానే ఉంది అని సోషల్ మీడియా లో కామెంట్స్ పెట్టారు అభిమానులు. ఇది ఇలా ఉండగా త్వరలోనే మిగిలిన సినిమాలు కూడా ఓటీటీ లో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ముందుగా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ చిత్రం ఈ నెల 12 వ తేదీన విడుదలకు సిద్ధం గా ఉంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాని భారీ రేట్ కి కొనుగోలు చేసింది.
అదే రోజున ‘ఆయ్’ చిత్రం కూడా నెట్ ఫ్లిక్స్ మరియు ఆహా డిజిటల్ మీడియా లో విడుదల కాబోతుంది. చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వసూళ్లను కొల్లగొట్టి, ప్రేక్షకులను థియేటర్స్ లో విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్ ని ఎంత వరకు అలరిస్తుందో చూడాలి. ఇక నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల నిర్మించిన సూపర్ హిట్ చిత్రం ‘కమిటీ కుర్రాళ్ళు’ కూడా ఈ నెల 12 వ తారీఖున ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇలా కొత్త సినిమాలన్నీ ఒకే రోజు ఓటీటీ లో విడుదల అవ్వడం ఆడియన్స్ కి ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు.