Home Cinema Janhvi kapoor: వామ్మో ఎన్టీఆర్ లో ఆ కోణాన్ని కనిపెట్టేసిన జాన్వీ కపూర్..

Janhvi kapoor: వామ్మో ఎన్టీఆర్ లో ఆ కోణాన్ని కనిపెట్టేసిన జాన్వీ కపూర్..

Janhvi kapoor comments about Junior NTR

Janhvi kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ అంటే ఇండియాలో అన్ని భాషల వారికి ఎంతో అభిమానం. దివంగత స్టార్ హీరోయిన్, అతిలోకసుందరి శ్రీదేవి కూతురు అవ్వడం వలన జాన్వికపూర్ అంటే అభిమానులందరికీ ఎంతో ఇష్టం. జాన్వీ కపూర్ తనదైన శైలిలో నటిస్తూ అభిమానుల్ని ఎప్పటికప్పుడు ( Janhvi kapoor comments about Junior NTR ) ఆకట్టుకుంటూనే ఉంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ బాలీవుడ్ సినిమా ఉలజ్ ప్రపోషన్లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న జాన్వీ కాపూర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది.

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వికపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లాంటి అంతర్జాతీయ లెవెల్లో పేరు సంపాదించుకున్న సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమాపై ఆయన అభిమానులకు ఎంతో ఆసక్తి ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో ( Janhvi kapoor comments about Junior NTR ) జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించి అందరినీ ఆకట్టుకుంటుంది. ఎందుకంటే జాన్వి కపూర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తొలిసారిగా హీరోయిన్గా నటిస్తుంది. అది కూడా నందమూరి నందమూరి వారసుడు సరసన శ్రీదేవి కూతురు నటించడం తెలుగు అభిమానులకు ఎంతో ఆనందాన్నిస్తుంది.

See also  Tarakaratna: తారకరత్న అంత్యక్రియల్లో బాలకృష్ణని హెచ్చరించిన ఆ పిచ్చోడు ఎవరు.??

అయితే సినిమా ప్రమోషన్ నిమిత్తం జాన్వి కపూర్ ఇస్తున్న ఇంటర్వ్యూలో.. తాను ఎన్టీఆర్ తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని, తెలుగువారి పనితీరు తనకు చాలా బాగా నచ్చిందని, సినిమాని కథ మీద ఆధారపడి కథ మీద నమ్మకంతో ఎంతో కష్టపడి చాలా బాగా తీస్తారని చెప్పకు వచ్చింది. దేవర సినిమాలో తాను నటిస్తున్నంత సేపు ఎన్టీఆర్ లో ఉన్న జోష్ ని చూసి చాలా ఆశ్చర్యపోతున్నానని చెప్పుకొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ సెట్ లో అడుగు పెట్టగానే అందరిలోనూ ఒక రకమైన ఉత్సాహం వస్తుందని, ఆయన్ని చూస్తే.. అందరికీ చాలా ( Janhvi kapoor comments about Junior NTR ) ఇన్స్పిరేషన్ గా ఉంటుందని చెప్పింది. జూనియర్ ఎన్టీఆర్ దేన్నైనా కూడా చాలా తొందరగా పసిగట్టి నేర్చుకుంటాడని చెప్పింది.

See also  Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ అదిరింది.

ఇటీవల ఇద్దరి మధ్యన ఒక పాట చిత్రీకరించారని చెప్పింది. జూనియర్ ఎన్టీఆర్ నటన గాని, ఆయన వేసే స్టెప్స్ గాని చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పింది. ఆయన దేన్నైనా ఇట్టే నేర్చేసుకొని అట్టే చేసేస్తారని.. ఆయన చేసే పని తాను నేర్చుకుని చేయాలంటే.. జూనియర్ ఎన్టీఆర్కి ఒక నిమిషం పడితే.. తనకి పది రోజులు పడుతుంది అని చెప్పకు వచ్చింది. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ లో ఉన్న జోష్ ని, అతనిలో ఉన్న తెలివిని, దేనినైనా వెంటనే పసిగట్టి దాన్ని చాలా తొందరగా చేసే పనితీరుని.. అన్నిటిని జాన్వీ కపూర్ అతి తొందరగా పసిగట్టేసిందని అందరూ చెప్పుకుంటున్నారు. ఇక దేవర సినిమా గురించి నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ జంట కొరటాల శివ దర్శకత్వంలో ఎలాంటి సంచలనాన్ని క్రియేట్ చేస్తుందో చూడాలి.