Rajamouli-Prashanth Neel : ప్రస్తుతం భారత సినీ ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్స్ ఎవరు అని ఎవ్వరిని అడిగిన చెప్పే పేరులు రాజమౌళి, ప్రశాంత్ నీల్. వీరిద్దరు సౌత్ ఇండస్ట్రీ నుండి అయినప్పటికీ ఇండియా మొత్తం వీళ్ళ పేరులు తెలుసు. దానికి కారణం వారు సినిమా తీసే విధానం, సినిమా పై వారికి ఉన్న ప్యాషన్. ఈ రెండు విషయాలు వీరిద్దరిని వేరే లెవెల్ డైరెక్టర్స్ అయ్యేలా చేసాయి. వీరిద్దరి సినిమాలను ప్రేక్షకులు ఎంతలా ఆదరించారు అంటే వీరు ఏ సినిమా తీసిన కలెక్షన్ల వర్షం కురుస్తుంది.
రాజమౌళి తీసిన బాహుబలి సినిమా ఇండియా లోనే మొదటి 1000 కోట్ల సినిమాగా నిలిచింది అంటే నమ్మండి. అలానే ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సినిమాలు కెజిఫ్, కెజిఫ్ 2, సాలార్ ఏ రేంజ్ లో వసూళ్లు చేశాయో మనం చూసాం. వీరి సినిమాల్లో కాన్సెప్ట్, విఎఫ్ఎక్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే అన్ని వారి ఓన్ స్టైల్ లో ట్రెండ్ సెట్ చేసే విధంగా ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ప్రశ్న అందరిని ఆసక్తికి గురి చేస్తుంది.
అదేంటంటే, రాజమౌళి ప్రశాంత్ నీల్ లో ఎవరు నెంబర్ 1 డైరెక్టర్.? రాజమౌళి విషయానికి వస్తే ఎమోషన్స్, డ్రామా ని బాగా ముందుకు తీసుకువెళ్లగలడు. ప్రశాంత్ నీల్ సినిమాలో అది ఎక్కువ సేపు క్యారీ అవ్వదు. అంతేకాకుండా రాజమౌళి ఇండియా కు ఆస్కార్ కూడా తీసుకు వచ్చాడు. ఏ విధంగా చూసుకున్న రాజమౌళి నే నెంబర్ 1. కానీ ఒక్కవిషయంలో మాత్రం ప్రశాంత్ ఏ ఫస్ట్. రాజమౌళి సినిమాకు 3-4 ఏళ్ళు తీసుకుంటాడు, కానీ ప్రశాంత్ 6-12 నెలల్లో సినిమా కథం చేసేస్తాడు. ఈ ఒక్క విషయంలో ప్రశాంత్ ఏ నెంబర్ 1.