Home Cinema Biggboss 7 Winner : బిగ్ బాస్ 7 విన్నర్ ప్రశాంత్ తన ప్రైజ్ మనీ...

Biggboss 7 Winner : బిగ్ బాస్ 7 విన్నర్ ప్రశాంత్ తన ప్రైజ్ మనీ ఎంతో ఎం చేసాడో తెలిస్తే..

biggboss-7-winner-pallavi-prashanth-prize-remuneration-details

Biggboss 7 Winner : ఎవరికి ఎప్పుడు ఎలాంటి అదృష్టం పడుతుందో, వాళ్ల ట్యాలెంట్ ఎప్పుడు ఎక్కడ ఎలా బయట పడుతుందో, దాని ద్వారా వచ్చిన ఆనందాన్ని ఎలా పొందుతారు అనేది చెప్పలేము. అలాగే బిగ్ బాస్ సెవెన్ ( Biggboss 7 Winner ) విన్నర్ గా ప్రైజ్ గెలుచుకున్న పల్లవి ప్రశాంత్ గురించి కూడా అందరూ అనుకుంటున్నారు. అందరిలో లాగానే పల్లవి ప్రశాంత్ లో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి. ఎంత ట్యాలెంట్ ఉన్నప్పటికీ అతనిలో కొన్ని లోపాలు వలన మొదట్లో అతను అంటే అందరికీ ఆశ్చర్యంగా, కొంత చిరాగ్గా కూడా అనిపించేది.

Bigg-boss7-winner-pallavi-prasanth-prize-details-nagarjuna

పల్లవి ప్రశాంత్ సాధారణ సమయాల్లో ఒకలా, నామినేషన్ టైంలో ఒకలా ప్రవర్తించేవాడు. అతనిలో ఒక అపరిచితుడు ఉన్నాడా అనిపించేది. నామినేషన్స్ లో ఇతను చేసే ఓవరాక్షన్ చూసి అందరికీ అతనిపై విసుగు కూడా పుట్టేది. కానీ నామినేషన్స్ లో ( Biggboss 7 Winner ) ఎలా ఉన్నా మిగతా సమయంలో మాత్రం ఒక సామాన్యుడిగా చాలా బాగా చేశాడు. నెమ్మదిగా తనని తాను మార్చుకుంటూ.. తన తప్పులను తాను తెలుసుకుంటూ.. వాటికి కావాల్సిన పరిహారం చేసుకుంటూ ముందుకు దూసుకుపోయాడు. ఆ తర్వాత ఎంతమంది ఎంత రెచ్చగొట్టినా కూడా అతను రెచ్చిపోలేదు.

See also  Tamannaah - Vijay Varma: పెళ్ళికి ముందే తమన్నా కు అలాంటి కండిషన్ పెట్టిన విజయ్ వర్మ.!

Bigg-boss7-winner-pallavi-prasanth-prize

తర్వాత తర్వాత అతని ఆలోచన మొత్తం టాస్క్ లు మీద పెట్టాడు. రెచ్చగొడుతుంటే దానిమీద రెచ్చిపోయి మాటలు మాట్లాడే కంటే.. చేతలతో చూపించడమే కరెక్ట్ అనుకున్నాడు. ప్రతి టాస్క్ ని ఎలా గెలవాలి అనే దానిపై అతను మనసుపెట్టాడు. టాస్కులు రూపంలో అతను సాధిస్తున్న విజయాలతో.. ప్రత్యర్థికి చెమటలు పట్టేలా చేశాడు. తనని ( Biggboss 7 Winner ) తాను నిరూపించుకోవాలంటే.. మనసా, వాచా, కర్మణా తన పని మీద తనకి శ్రద్ధ ఉండాలని చూపించాడు. ఈ క్రమంలో అతను పడ్డ శ్రమ ఫలించేసింది. ఏ స్టూడియో ముందు అలా పాడుగాపులు కాసేవాడో ఇప్పుడు అదే స్టూడియోలో అందరి మన్ననలు, చప్పట్ల మధ్యన ఫస్ట్ ప్రైజ్ అందుకున్నాడు.

See also  Chiranjeevi : ఇండస్ట్రీ కుటుంబానికి చెందిన ఆ స్త్రీ వలన చిరంజీవి అన్ని బంధాలను వదిలేసి చివరికి ఇలా మిగిలాడట..

Bigg-boss7-winner-pallavi-prasanth

బిగ్బాస్ విజేతకు 50 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ప్రకటించారు. అందులో ప్రిన్స్ యాదవ్ 15 లక్షలు సూట్ కేసుని తీసుకోవడంతో.. అతనికి 35 లక్షల రూపాయలు మాత్రమే అందింది. అందులో కూడా టాక్స్, జీఎస్టీ పోగా అతని చేతికి కేవలం 17 లక్షల రూపాయలు మాత్రమే అందిందని అంటున్నారు. మరి దారుణంగా వచ్చిన 50లో ఇలా పోయాయా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. 27 లక్షలు వరకు కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోతుందని అంటున్నారు. తర్వాతే మిగిలిన డబ్బుల్ని చేతికి ఇస్తున్నారు. అలాగే పల్లవి ప్రశాంత్ కు ఒక ఖరీదైన మారుతి బ్రజా కారు, 15 లక్షలు విలువచేసే వజ్రాభరణం కూడా సొంతం చేసుకున్నాడు. అన్ని కటింగ్స్ పోను ప్రశాంత్ కు 25 లక్షల చేతికి వచ్చాయని అంటున్నారు.