Home Cinema Salaar Review : ఫాన్స్ కి పూనకాలు వచ్చేలా సలార్ సెన్సార్ రివ్యూ..

Salaar Review : ఫాన్స్ కి పూనకాలు వచ్చేలా సలార్ సెన్సార్ రివ్యూ..

prabhas-movie-salaar-review-given-by-umair-sandhu

Salaar Review : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా రూపొందుతున్న సినిమా సలార్ . ఈ సినిమా గురించి డిసెంబర్ 22 ఎప్పుడు వస్తుందా అని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చాలా ( Salaar Review by Umair Sandhu ) కాలంగా ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ హిట్ అనేది లేకపోవడం ఈ సినిమా గురించి విపరీతంగా ఎదురు చూడటానికి కారణం కూడా అవ్వచ్చు. ఎందుకంటే.. ప్రశాంత్ నీల్.. కెజీఎఫ్, కెజీఎఫ్ 2 సినిమాలతో ఇండియన్ బాక్సాఫీసుల్ని షేక్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అదే క్రమంలో, అదే స్పీడ్ లో ఇప్పుడు ఈ సినిమాను కూడా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

See also  Tamannaah: తెలుగు ఫిల్మ్ ఇండస్ర్టీలో ఉన్న హీరోలంతా అదే టైప్ అంటూ సంచలనమైన వాఖ్యలు చేసింది తమన్నా.

prabhas-movie-salaar-review-given-by-umair-sandhu

అయితే ఈ సినిమా ఎలా ఉండి ఉంటుందా అని అభిమానుల్లో ఆత్రం కూడా ఉంది. సలార్ సినిమాపై ఎటువంటి ప్రమోషన్స్ గట్టిగా జరగడం లేదు. ముఖ్యంగా సలార్ ట్రైలర్ అందరినీ అన్ని వర్గాల వారిని సాటిస్ఫై చేయలేకపోయింది. పైగా ( Salaar Review by Umair Sandhu ) చాలా వరకు చూసిన సినిమానే ఏదో చూస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే సలార్ సినిమా కూడా ఏవైనా పోతే.. ప్రభాస్ కెరీర్ చాలా డల్ అయిపోతుందని అందరూ అనుకుంటున్నారు. మరోపక్క చూస్తే ప్రశాంత్ నీల్ కావాలనే హైప్ తగ్గించడానికి ఇలా చేస్తున్నాడని మరికొందరు కూడా అనుకుంటున్నారు.

prabhas-movie-salaar-review-umair-sandhu

ఇకపోతే దుబాయ్ సెన్సార్ బోర్డులో సభ్యుడిని చెప్పుకుంటూ.. ఎప్పటికప్పుడు సినిమాలు రిలీజ్ అవ్వకముందే.. రివ్యూ రాసే ఉమేర్ సంధు.. సలార్ సినిమాపై కూడా పడ్డాడు. సినిమా సెన్సార్ ప్రకారం దాని రివ్యూ ఇలా ఉంది అంటూ ( Salaar Review by Umair Sandhu ) ఉమేర్ సంధు చెప్పుకుంటూ వచ్చాడు.. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఈ సినిమాలో మూడు పాత్రలు చాలా గట్టిగా పని చేస్తాయి. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలాంటి పాత్రలో ప్రభాస్ నటించని విధంగా కనిపించడమే కాకుండా.. యాక్షన్స్ అన్నివేశాల్లో ఇరగదీసాడు అని చెప్పాడు. మాస్ పాత్రలు వేయాలంటే ప్రభాస్ మాత్రమే బాస్ అనే రేంజ్ లో పెర్ఫార్మన్స్ ఇచ్చాడని ఉమేర్ సంధు తెలిపాడు.

See also  Star Kids : మన స్టార్ కిడ్స్ ఈ వయసులో ఎలాంటి ఫైట్ కి సిద్దమవుతున్నారో తెలుసా?

prabhas-salaar-review-given-by-umair-sandhu

ఈ సినిమా చూస్తే ప్రభాస్ ని మించిన మాస్ హీరో ఎవరు లేరని అనిపిస్తుందని, ఒక రేంజ్ లో ప్రభాస్ ఈ సినిమాలో తన పాత్రకు న్యాయం చేశాడని, చాలా అద్భుతంగా నటించాడని, ప్రభాస్ నటనకు ఎక్కడా కూడా రిమార్కబుల్ అనేదే ఉండదని.. ఉమేర్ సంధు ఈ రివ్యూ లో చెప్పాడు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు శృతిహాసన్ కూడా చాలా బాగా నటించిందని, ఆమె పాత్ర ఆమె నటన అందరిని ఆకట్టుకుంటుందని, పృథ్విరాజ్ సుకుమార్ పాత్రలు కూడా బలంగా ఉన్నాయని, పృథ్వీరాజ్ కుమార్ యాక్టింగ్ అదిరిపోతుందని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ సినిమాకి ఉమేర్ సంధు 4/5 రేటింగ్ ఇచ్చాడు. అయితే ఇతను రేటింగు, ఇతను రివ్యూ ఒక్కొక్కసారి గట్టిగానే దెబ్బ తింటూ ఉంటాయి. సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా దీన్ని నమ్మడానికి లేదు. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి.