Home Cinema Salaar : సామాన్య సినీ అభిమానుడిని అలా దెబ్బ కొట్టిన సలార్..

Salaar : సామాన్య సినీ అభిమానుడిని అలా దెబ్బ కొట్టిన సలార్..

prabhas-movie-salaar-pre-release-booking-business-and-ticket-updates

Salaar : ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుకున్న సలార్ సినిమా గురించి ప్రభాస్ అభిమానులు అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ( Prabhas movie Salaar ticket ) ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాపై ఎక్కువగా ప్రమోషన్ జరగడం లేదు. అలాగే ట్రైలర్ కూడా ఎవరిని అంతగా సాటిస్ఫై చేయలేదు. అయినా కూడా ఈ సినిమాపై క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇప్పటికే ఈ సినిమాకి ఇటు భారతదేశంలో అటు విదేశాల్లో కూడా ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ ఉంది.

Prabhas-movie-Salaar-pre-release-booking

ఈ సినిమా పై క్రేజ్ ఎంత ఉందంటే.. ఈ సినిమాకి పెద్దగా ప్రమోషన్ చేయకపోయినా కూడా ఫ్రీ రిలీజ్ బుకింగ్ బిజినెస్ అద్భుతంగా సాగుతుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బుకింగ్ హాఫ్ మిలియన్ డాలర్ల వరకు తీసుకొచ్చింది. ఈ సినిమా ( Prabhas movie Salaar ticket ) ఇప్పటికే నాలుగు కోట్ల వరకు తీసుకొని వచ్చింది అంటున్నారు. అది కూడా తెలుగు వర్షన్ నుంచే అంత రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనా సినిమా ట్రైలర్ పెద్దగా లేకపోయినా, సినిమా ప్రమోషన్ అంతగా లేకపోయినా కూడా ఇంత క్రేజ్ ఉండడం నిజంగా అదృష్టమే.

See also  Malli Pelli: వామ్మో టీజర్ రిలీజ్ చేస్తేనే ఒక్కొక్కరి నరాలు కట్ అయ్యాయి.. రేపు సినిమా విడుదల అయితేనూ..

Prabhas-movie-Salaar-pre-release-booking-business-update

ప్రభాస్ మీద ఒక రకమైన నమ్మకం ఉంటే, ప్రశాంత్ నీల్ పై ఇంకొక రకమైన నమ్మకం తో.. ఇద్దరు ఏం చేస్తారో చూడాలి. అలాగే సినిమా టికెట్లు రేట్లు గురించి కూడా ఒక వార్త హల్చల్ చేస్తుంది. తెలంగాణలో 100 రూపాయలు అదనంగా పెంచి అమ్ముతున్నారు. హైదరాబాద్ తో ( Prabhas movie Salaar ticket ) పాటు తెలంగాణ మల్టీప్లెక్స్ లో 330 నుంచి 400 రూపాయల వరకు ఒక్కొక్క టికెట్ను అమ్మడానికి సిద్ధపడుతున్నారు. అలాగే సింగల్ స్క్రీన్స్లో సినిమా టికెట్ రేట్ అప్పుడు కొన్న దానిమీద 30 రూపాయలు ఎక్స్ట్రా పెంచడానికి డిసైడ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న టిక్కెట్లు రేట్లు పై 100 రూపాయలు అదనంగా పెంచాలని డిసైడ్ అయ్యారు.

See also  Chiranjeevi : పవన్ మహేష్ బాబులను పిలిచి చిరంజీవి ఆ విషయం చెబితే వాళ్ళమేన్నారంటే..

Prabhas-movie-Salaar-pre-release-booking-tickets

295 రూపాయలు ఉండే టికెట్టు రిక్లెయిన‌ర్లు 395 అవుతుంది అంట. అలాగే ఒక్కొక్క చోట 450 టికెట్ కూడా ఉంటుందని అంటున్నారు. ఉదయం ప్రీమియర్ షోకు అయితే టికెట్ 500 రూపాయలు అంట. ఇక ఈ సినిమా టికెట్లు రేట్లు ఎంత పెంచితే.. సామాన్య సినీ అభిమానులకి చాలా కష్టమే అని అనుకుంటున్నారు. అంటే ఎలాగోలా ఖర్చు పెట్టి చూస్తారేమో గానీ.. మామూలుగా సినిమా చూసే వాళ్ళకి ఇలా టికెట్ రేట్స్ పెంచేస్తే కష్టమే కదా అని అనుకుంటున్నారు. మరి ఆ సినిమా బడ్జెట్ ని బట్టి.. ఆ సినిమాకి కనీసం వాళ్ళ బడ్జెట్ రావాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోకు తప్పదేమో మరి అని మరికొందరు అనుకుంటున్నారు. మరి సలార్ రిలీజ్ అయిన తరవాత ఎంతవరకు హిట్ అవుతుందో చూడాలి.