Home Cinema Animal : అనిమల్ సినిమా వలన అసలు సంగతి బయటపడింది..

Animal : అనిమల్ సినిమా వలన అసలు సంగతి బయటపడింది..

animal-movie-revealed-the-truth-about-the-telugu-cinema-industry

Animal : ఒక హిందీ సినిమా కోసం తెలుగు ఆడియోస్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన సినిమా అనిమల్ ఈరోజు రిలీజ్ అయింది. అనిమల్ సినిమాపై ఇప్పటివరకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. కారణం మహా మహా దర్శకులు, నటులు ( Animal Movie revealed the truth ) కూడా ఈ సినిమాని గొప్పగా ప్రమోట్ చేశారు. అంతేకాకుండా సందీప్ రెడ్డి వంగపై ఉన్న భరోసా కూడా అలాంటిది. అర్జున్ రెడ్డి లాంటి సినిమాని గ్రాండ్ సక్సెస్ చేసి.. ఆ తర్వాత హిందీలో అదే సినిమాని కబీర్ సింగ్ గా తీసి అక్కడ కూడా పెద్ద హిట్ కొట్టి.. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే బాగానే ఉందని, రన్బీర్ సింగ్ నటన అద్భుతం అని, ఎంతో బాగా చేశాడని, ఇక రష్మిక మందన, అనిల్ కపూర్ అందరి నటన కూడా చాలా బాగుందని రివ్యూస్ అయితే వస్తున్నాయి.

Animal-movie-revealed-the-truth-about-telugu

సినిమాలో హీరో పాత్ర ( Animal Movie revealed the truth ) చాలా స్పెషల్ తన నైజం.. ప్రేమనైన, కోపాన్ని అయినా ఎక్స్ట్రీమ్ లెవెల్ లో చూపించడమే. హీరో పాత్ర తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఎమోషన్ను కూడా డిఫరెంట్ కోణంలో చాలా అద్భుతంగా చూపించాడని అంటున్నారు. అయితే ఈ సినిమాని మొదట సందీప్ రెడ్డివంగ కథ రాసుకున్న తర్వాత మహేష్ బాబు దగ్గరికి వెళ్ళాడని అంటున్నారు. అయితే మహేష్ బాబు ఈ కథ విన్న తర్వాత కథ చాలా బాగుంది గాని.. ఇంత వైల్డ్ గా ఇలాంటి పాత్రను నటిస్తే తెలుగు ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు.. అందుకని ఈ కథకి నేను సూట్ అవ్వనని చెప్పి తప్పించుకున్నాడు అన్న సంగతి అనేక వార్తల్లో వచ్చింది.

See also  Anchor Vishnu Priya : ఆ హీరోతో.. శోభనం ఎంత ఇష్టమో విష్ణుప్రియ వివరించిన వీడియో వైరల్!

Animal-revealed-the-truth

అయితే మహేష్ బాబు కాకపోయినా వేరే ఏ తెలుగు హీరోతో కూడా సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాని చేయలేదు. మన తెలుగు దర్శకుడు తాను రాసిన ఇంత వైలెంట్ ఎమోషనల్ కథకి హిందీ హీరోని తీసుకోవడం జరిగింది. ఈ సినిమాని చాలా బోల్డ్ గా, వైలెంట్ గా తెరపై చూపించడం జరిగింది. ఈ సినిమాలో ఫ్యామిలీతో కలిసి చూడలేని కథనం సాగుతుందని అంటున్నారు. అలాగే కామెడీ కూడా బోల్డ్ గానే ఉందని అంటున్నారు. తెలుగు ఆడియోస్ ఎప్పుడు కూడా సెంటిమెంట్ ని, సున్నితంగా ఉన్న సినిమాలని, కొంత మాస్ మసాలా ( Animal Movie revealed the truth ) సినిమాలని, ఏదో కొంచెం వైలెన్స్ చూపించిన సినిమాల్ని ఇష్టపడ్డారు తప్పా.. విపరీతమైన బోల్డ్ కంటెంట్ , వైలెన్స్ను గాని ఇష్టపడరు. అలాంటి దానిలో ఒక హీరో నటిస్తే వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారో తెలీదు అనే అనుమానం భయంతో మన తెలుగు హీరోలు ఎవరూ కూడా ఈ సినిమాకి ముందుకు రాలేదని తెలుస్తుంది. అందుకే మన తెలుగు దర్శకుడు ఒక హిందీ హీరో.. ఇలాంటి నటన నటించేందుకు ముందుకు వస్తే ఈ సినిమా తీయడం జరిగింది.

See also  Amitabh Bachchan: పవన్ కళ్యాణ్ చేసిన పనికి.. కోపంతో చేతిలో వస్తువు విసిరేసిన అమితాబ్..

Animal-revealed-the-truth-audience

కానీ మన తెలుగు ఆడియన్స్ ఈ సినిమా ట్రైలర్ చూసి కచ్చితంగా ఈ సినిమా చూడాలని అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చురుగ్గా చేసుకొని మరి థియేటర్లకు వెళ్లారు. సినిమా నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బోల్డుగా ఉందని, వైలెన్స్ గా ఉందని, చాలా అగ్రసివ్ గా హీరో నటించాడని, హీరో హీరోయిన్ మధ్య చాలా బోల్డ్ కెమిస్ట్రీ సన్నివేశాలు ఉన్నాయని, చాలా వైలెన్స్ చూపించారని అంటున్నారు గానీ.. సినిమా మాత్రం బాగుంది అంటున్నారు. అంటే మన తెలుగు ఆడియన్స్ కి కూడా ఇంత వైలెన్స్, ఇంత రొమాన్స్, ఇంత బోల్డ్ కంటెంట్ ఇవన్నీ కూడా కావాలని అర్థమవుతుంది. అలాగే మన హీరోలు వాళ్ళ ఫాన్స్ కి ఏం కావాలో ఇంతకాలం అంత కరెక్ట్ గా తెలుసుకోలేకపోయారా అని కూడా అనిపిస్తుంది. ఏదేమైనా అనిమల్ సినిమా వలన బయటపడిన విషయమేంటంటే.. మన తెలుగు వాళ్ళకు కూడా ఇలాంటి కథలు కావాలని, ఇలాంటి సన్నివేశాలు ఉండాలని, దానికి తగ్గట్టుగా హీరోలు ఈసారి కథలను ఎన్నుకోవాలని, అంత బోల్డ్ గా నటించాలని కోరిక అయితే కొంత ఉందని తెలుస్తుంది.