Home Cinema Animal Audience Review : అనిమల్ సినిమా పబ్లిక్ ఆడియన్స్ రివ్యూ పాయింట్స్ అదిరాయి..

Animal Audience Review : అనిమల్ సినిమా పబ్లిక్ ఆడియన్స్ రివ్యూ పాయింట్స్ అదిరాయి..

ranbir-kapoor-movie-animal-audience-review-in-telugu

Animal Audience Review : రన్బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా, అనిల్ కపూర్, సన్నీ డియోల్ ముఖ్యపాత్రలో నటించగా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన అనిమల్ సినిమా ఈరోజు డిసెంబర్ ఒకటో తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని సినీ ప్రపంచమంతా కూడా ( Animal Audience Review ) ఎదురు చూసింది. అర్జున్ రెడ్డి సినిమాతో సినిమాల్లో ఉండాల్సిన కొన్ని పద్ధతులను బ్రేక్ చేసి మరి ఇలాగే తీయాలి అని ఆలోచించకుండా.. ఒక అతీతంగా తీసి అదిరిపోయే సంచలనాన్ని క్రియేట్ చేసి సక్సెస్ అందించిన సందీప్ రెడ్డి వంగ.. అనిమల్ సినిమా ఎలా తీస్తాడు? ఎలా తీయబోతున్నాడు, ఎలాంటి సంచలనాన్ని క్రియేట్ చేయబోతున్నాడు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న రిజల్ట్ తెలుసుకునే తరణం వచ్చేసింది.

Animal-audience-review

అనిమల్ సినిమా ఈరోజు మార్నింగ్ షో ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ అయింది. ఇక తెలుగు ఆడియన్స్ ఈ సినిమాని ఎలా తీసుకున్నారు, ఎలా ఉంది అనే దానిమీద.. సినిమా హాల్స్ దగ్గర మీడియా వాళ్ళు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని వాళ్ళ అభిప్రాయాల్ని అడగడం జరిగింది. ఆ అభిప్రాయాల ప్రకారం ఈ సినిమాపై ఎవరి ఆలోచనలు ( Animal Audience Review ) ఎలా ఉన్నాయి, ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్ అంచనాలను రీచ్ అయిందో ఒక్కసారి తెలుసుకుందాం. ఈ సినిమా మూడు గంటల పైన ఉందన్న సంగతి ముందుగానే చెప్పుకొచ్చారు. మూడు గంటల 20 నిమిషాల పాటు అసలు ప్రేక్షకులు కూర్చుని అంతసేపు ఒక సినిమాను చూడగలరా అని అందరూ అనుకుంటున్నారు.

See also  Rajamouli : పరువు పోగొట్టుకున్న రాజమౌళి.. బాధపడుతున్న అగ్ర హీరోలు..

Animal-audience-review-telugu

అలాంటిది ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత ప్రేక్షకులను అడిగితే.. మూడు గంటల పైన కూర్చున్నాం కానీ.. అంతసేపు అంత ఆసక్తిగా సినిమాను చూడగలిగాము అంటే.. సందీప్ రెడ్డి వంగ నిజంగా మా తెలుగోడైనందుకు మాకు గర్వకారణం అంటున్నారు. ప్రేక్షకులు సినిమా మూడు గంటల పైన ఉన్నట్టే ఎక్కడా అనిపించలేదని.. అంతసేపు కూర్చున్నా కూడా సాధారణమైన సినిమా రెండు గంటలు పైన సినిమా చూసినట్టే అనిపించిందని సగర్వంగా చెబుతున్నారు ఆడియన్స్. ఇక ఫైట్స్ విషయానికొస్తే.. అలాంటి ఫైట్స్ తెలుగు ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్ లో కూడా అలాంటి ఫైట్స్ రాలేదని ఆడియన్స్ చెప్పుకొస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాలో ఆటిట్యూడ్ చూస్తే.. ఈ సినిమాలో దానికి మించి అదిరే లెవల్లో ఉందని గర్వంగా చెబుతున్నారు కుర్రాళ్ళు . ఇదొక వైల్డ్ సినిమా అని, మాస్ సీన్స్ ని అదరగొట్టేలా చూపించాడని.. మన తెలుగు సినిమా అర్జున్ రెడ్డి అయింది దాన్ని కించపరచుకోకూడదు కానీ.. బాలీవుడ్ సినిమా ఇది హిందీ సినిమా అని పొగడకూడదు అనుకుంటే చెప్పలేం గానీ.. అర్జున్ రెడ్డి సినిమా ఒక టీజర్ అయితే అనిమల్ సినిమా ఒక పూర్తి సంపూర్ణమైన సినిమా అని ఆడియోస్ చెప్పుకొచ్చారు.

See also  Kajal: బ్రోతల్ హౌస్ లో చిక్కుకున్న కాజల్ అగర్వాల్.. అభిమానులకు మింగుడు పడని వార్త!

Animal-movie-audience-review-telugu

సినిమాలో గన్ ఫైట్ అద్భుతంగా ఉందని చెప్తున్నారు. తండ్రి కొడుకులు మధ్య కొన్ని సీన్స్ అయితే కన్నీళ్లు రావడం తప్పదని చెప్తున్నారు. తండ్రి కొడుకుల మధ్య వచ్చిన సెంటిమెంట్ సినిమాలు ఇప్పటివరకు చాలా వచ్చాయి గాని.. వాటన్నిటికంటే ఎక్స్ట్రార్డినరీగా ఉందని ప్రేక్షకులు చెప్తున్నారు. తండ్రీకొడుకులకు సంబంధించిన ఈ సినిమా ( Animal Audience Review ) ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా, మాస్ ఎంటర్టైన్మెంట్ గా అన్నిటికీ అనుకూలంగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఇక రష్మిక తో రన్బీర్ కెమిస్ట్రీ అదిరిపోయిందని అంటున్నారు. మొత్తం మీద అనిమల్ మూవీ వేరే లెవెల్ లో ఉందని అంటున్నారు. ఇప్పటివరకు చూసిన ప్రేక్షకులలో ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్ మాత్రమేఎక్కువగా వచ్చింది. మరి ఈ సినిమా మీద పూర్తి రివ్యూలు అనేక మీడియా వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది.