Home Cinema Salaar : సలార్ సినిమా స్టోరీ బయటకు చెప్పేసిన దర్శకుడు.. ఆ సినిమాలనే అనిపిస్తుంది..

Salaar : సలార్ సినిమా స్టోరీ బయటకు చెప్పేసిన దర్శకుడు.. ఆ సినిమాలనే అనిపిస్తుంది..

director-prashanth-neel-revealed-prabhas-movie-salaar-story

Salaar : బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలు వరుసగా .. మూడు ఫ్లాప్ సినిమాలు రిలీజ్ కావడంతో.. ప్రభాస్ అభిమానులు ఎంతో ఆందోళనలో ఉన్నారు. అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ అయితే మాత్రం ఎక్కడ తగ్గలేదు. ప్రభాస్ ( Prashanth Neel revealed Salaar story ) సినిమా అంటే ఇప్పటికీ ఎన్నో అంచనాలతో సినీ అభిమానులందరూ ఎదురుచూసే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రభాస్ సాధించిన విజయం అలాంటిది. బాహుబలితో ప్రభాస్ స్థాయి ఎక్కడకో వెళ్లిపోయింది. అప్పటినుంచి అంత హై ఎక్స్పెక్టేషన్స్ తో ఆయన సినిమా చూస్తూ ఉండడం వలన.. సినిమా ఎంత బాగున్నా కూడా సూపర్ హిట్గా తీసుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి ప్రభాస్ నెక్స్ట్ సినిమా మీదే ఉంది.

Prasanth-neel-salaar-story-revealed

ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ చిత్రంపై ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.ఈ సినిమాపై సినీ అభిమానులకు, సినీ ఇండస్ట్రీకి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే.. ఒకపక్క ( Prashanth Neel revealed Salaar story ) ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ మరోపక్క ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఉగ్రం, కే జి ఎఫ్ చిత్రాలతో క్రియేట్ చేసిన దర్శకుడవడం వలన ఈ సినిమాలపై భారీ అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమా మళ్లీ ప్రభాస్ కి ఒక కొత్త సంచలనాన్ని ఇచ్చి ప్రభాస్ స్థాయిని మరింత పైకి లేపుతుందని అందరి అంచనాలు.

See also  Dimple Hayathi : ఛి ఛి డింపుల్ హయాతి నైబర్ తో నీచమైన పని చేస్తున్న వీడియో బయటకొచ్చింది!

Prasanth-neel-salaar-story

సలార్ సినిమా కేజీఎఫ్ లా ఉంటుందని కొందరు అనుకుంటుంటే, ఇంకెలా ఉంటుందో ఇంకేమైనా కొత్తగా తీస్తాడేమో అని మరికొందరు ఎదురుచూస్తున్నారు. ఇటీవల దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంగ్లీష్ మీడియా వాళ్లకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో సలార్ సినిమా స్టోరీ చెప్పాడు ప్రశాంత్ నీల్. సలార్ సినిమాలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ( Prashanth Neel revealed Salaar story ) ఉంటారని.. వాళ్ళిద్దరూ శత్రువులుగా మారతారని చెప్పాడు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అతిపెద్ద శత్రువులుగా ఎందుకు మారారు అనేది ఆ సినిమా స్టోరీ అని.. ఆ తర్వాత వారిద్దరి మధ్యన ఏం జరుగుతుంది అనే దాని మీద కథ నడుస్తుందని చెప్పుకొచ్చారు. ప్రాణస్నేహితుల ఎమోషన్ ఉంటుందని.. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ లో సగం కదే చెబుతామని.. ఆ తర్వాత రెండవ పార్ట్ లో మిగిలిన సగం వస్తుందని చెప్పారు.

See also  Sree Reddy: పవర్ స్టార్ పై మళ్ళీ నోటికి వచ్చిన మాటలతో విరుచుకుపడిన శ్రీ రెడ్డి - ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.

Prasanth-neel-salaar-movie-story-revealed

అంటే ఈ సినిమాలో ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమార్.. ఇద్దరు స్నేహితులై ఉంటారని అందరూ అంచనా వేస్తున్నారు. ఈ ఇద్దరు స్నేహితుల మధ్య శత్రుత్వం మొదలవుతుందని.. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యన శత్రుత్వం ఎలా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో చూపించడమే సినిమా అయ్యి ఉంటుందని, అది సగం పార్ట్ ఫస్ట్ చూపించి.. ఆ తర్వాత మిగిలిన బ్యాలెన్స్ రెండో పార్ట్ లో చూపిస్తారని అర్థమవుతుంది. అయితే ప్రశాంత్ మీరు ఫస్ట్ మూవీ ఉగ్రం ఈ సినిమాలో కూడా ఇద్దరు ప్రాణ స్నేహితులు ప్రాణం తీసుకునే బద్ధ శత్రువులుగా మారుతారు. అదే కాన్సెప్ట్ ని మళ్ళీ తీసుకొస్తున్నాడా ఏమిటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా ప్రశాంత్ నీల్ చెప్పిన స్టోరీ ప్రకారం చూస్తే.. సినిమా ఎలా ఉండబోతుంది అనే ఆత్రుత ఎక్కువగా పెరిగింది. ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 1 వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.