Mahesh NTR and Charan :సినిమాల్లో బిజీ బిజీ గా నటించే స్టార్ హీరోలు వాళ్ళ భార్య పిల్లలతో టైం ని గడపడానికి దారులు వెతుక్కుంటూ ఉంటారు. అందులో ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చే దారి ఏదో ఒక టూర్ వెళ్లడమే. పిల్లలకి ఎప్పుడు ( Mahesh NTR and Charan ) సెలవు ఉంటుందో చూసుకొని. ఆ టైంలో.. షూటింగ్ డేట్స్ ని చూసుకొని.. టూర్లు రుగుతూ ఉంటారు. వాళ్లకి ఏదో దేశాన్ని చూడాలి, ఏదో ఊర్లు చూడాలని ఆశతో వెళ్ళరు. ఎందుకంటే షూటింగ్లో వాళ్ళు చాల వరకు ప్రదేశాలు చూసేస్తారు. కానీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలంటే వాళ్లకు ఒక ప్రైవసీ కావాలి కాబట్టి.. ఎక్కడికో వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
అలా టాలీవుడ్ హీరోస్ లో ఎక్కువగా టూర్లు తిరిగే హీరో ఎవరు అంటే.. అది మహేష్ బాబు అని టక్కున అందరూ చెప్తారు. మీలో ఎవరు కోటీశ్వరులు అనే ప్రోగ్రాం లో జూనియర్ ఎన్టీఆర్.. మహేష్ బాబుని.. వన్ ఇయర్ లో అన్ని టూర్లు ( Mahesh NTR and Charan ) వేస్తావేంటి బాబు అని అడిగితే.. తప్పదు పిల్లలు ఇక్కడ ఉంటుండగా వాళ్ళు ఫ్రీ ఉండరు. మనం షూటింగ్ కొంత స్పేస్ తీసుకుని ఫ్రీ అవ్వగలం గాని.. వాళ్ళు మాత్రం ఎప్పుడూ ఏదో క్లాసులు, ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటారు. అదే వేరే దేశం తీసుకుంటూ వెళ్ళిపోతే.. వాళ్ళు, మనమే ఉంటాం. అప్పుడు లైఫ్ని కొద్దిసేపు పిల్లలతో స్పెండ్ చేయడం అవుతుంది. అందుకే అలా ప్లాన్ చేస్తానని చెప్పాడు.
అలాగే ఇటీవల హీరోలు సరదాగా పండుగలకి, వేడుకలకు కూడా ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ఏడాది దీపావళి పండుగ రోజున మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లోకి ఘనంగా చేసుకొని.. కొంతమంది హీరోల్ని కుటుంబాలతో ( Mahesh NTR and Charan ) పిలవడం జరిగింది. అందరూ కలిసి అక్కడ దీపావళిని ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేశారు. అలాగే ఇప్పుడు రామ్ చరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఒక ప్లాన్ వేశారంట. ఇక డిసెంబర్ లో క్రిస్టమస్ సెలవులు రాబోతున్నాయి. మహేష్ బాబు కచ్చితంగా వేరే దేశం ఫ్యామిలీతో కలిసి టూర్ వేసేస్తాడు. మామూలుగానే సెలవులు దొరికితే వదలని మహేష్ బాబు ఈసారి కచ్చితంగా వెళ్తాడు.
ఎందుకంటే.. గుంటూరు కారం సినిమా అయిపోయిన తర్వాత మహేష్ బాబు రాజమౌళితో కలిసి చేస్తాడు. అప్పుడు అసలు మహేష్ కి ఎన్ని సంవత్సరాలకు ఫ్రీ దొరుకుతుందో తెలియదు. అందుకని ఇప్పుడు కచ్చితంగా డిసెంబర్లో మంచి టూర్ వేస్తాడు. అదే టూర్ లో రాంచరణ్, ఎన్టీఆర్ కూడా.. ముగ్గురు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వెళ్లాలని డిసైడ్ అయ్యారంట. అయితే ముగ్గురూ కూడా పారిస్ వెళ్దాం అని డిసైడ్ అయ్యారంట. ఈ సీజన్లో పారిస్ చాలా అందంగా ఉంటుందని.. అక్కడికి వెళ్లి భార్యా పిల్లలతో సరదాగా మూడు ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇదే వార్త నిజమైతే మాత్రం.. ముగ్గురు అభిమానులకి పండగ లాంటి వార్త. వాళ్ళు ముగ్గురిని ఇతర దేశాల్లో ఫ్యామిలీతో ఫోటోలు ఎప్పటికప్పుడు వాళ్ళు తీసుకున్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటే వీళ్లకు అది పండగలా ఉంటుంది.