కళాతపశ్వి శ్రీ కె విశ్వనాధ్ గారు గురువారం మరణించిన విషయం సినీ రంగాన్ని, సినీ అభిమానులను ఎంతగానో బాధిస్తుంది. తెలుగువారు గర్వించే విధంగా సినిమాలు చిత్రీకరించే అలాంటి వ్యక్తి, వెళ్లిపోవడం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. ప్రముఖులంతా ఆయనకు నివాళులు అర్పిస్తూ, సంతాపాన్ని తెలియజేస్తున్నారు. విశ్వనాధ్ గారు చనిపోయే ముందు కూడా ఒక పాట రాస్తూ, ఇక రాయలేక కుమారుడికి అప్పజెప్పారని కూడా సమాచారం.
నిరంతరం ఆయన వృత్తి పై ఆయనకి ఉండే ఇష్టం, భక్తి చూసి నేటి తరం వాళ్ళు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన తీసిన ప్రతీ సినిమాలో తెలుగుదనం, తెలుగువారి కళలు, సాంప్రదయాలతో పాటు దైవ భక్తి చూపిస్తారు. ఎంత దైవభక్తి చూపించినా, దేవుడి ముందు అందరూ ఒక్కటే, కులాలు అంటూ కొట్టుకో కూడదని మంచి నీతిని కూడా చూపిస్తారు. సాంప్రదాయాన్ని చూపిస్తూనే, సప్తపది లో ప్రేమకు ఎంత విలువ ఉందొ చూపించారు.
అలాగే ప్రతీ పని విలువైనదే, అందరికీ గౌరవం ఇవ్వాలని స్వయంకృషి సినిమాలో చూపించారు. ఇలా చెప్పుకుంటే వెళ్తే, ఆయన ప్రతీ సినిమా చాలా చిన్న బడ్జెట్ లా అనిపిస్తాది కానీ, చాలా పెద్ద సమాచారాన్ని మాత్రం మనకు అందిస్తాది. విశ్వనాధ్ గారి సమయంలో దర్శకులకు ఇప్పటితో పోలిస్తే అంత పెద్ద రెమ్యునిరేషన్స్ లేవు. అయినప్పటికీ ఆయన బాగానే సంపాదించారు. ఒక పక్క నిమ్మదిగా సినిమాలు చేస్తూనే ఆయన తన ఆదాయాన్ని చక్కగా కూడబెట్టుకున్నారు.
విశ్వనాథ్ గారికి 12 కోట్లు విలువచేసే ఇల్లు జూబ్లీహిల్స్ లో ఉంది. ఇంకా స్థలాలు ఉన్నాయి. ఇలా మొత్తం 130 కోట్లు ఆస్తి ఆయనకు ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ మొత్తం ఆస్తిని ఎటువంటి క్లాష్ లు రాకుండా ఉండేలా ఆయన బ్రతికిఉండగానే ఆయన సంతానం ముగ్గురికి సమానంగా రాసి పెట్టేశారంట.