Home Cinema Mahesh – Soundarya : సౌందర్య మహేష్ బాబు తో నటించకపోవడానికి కారణం అదేనట..

Mahesh – Soundarya : సౌందర్య మహేష్ బాబు తో నటించకపోవడానికి కారణం అదేనట..

soundarya-refused-to-act-with-mahesh-babu-because-of-that-reason

Mahesh – Soundarya : సౌందర్య అంటే తెలుగు సినీ అభిమానులందరికీ ఎంతో ఇష్టం. ఆమె ఎన్నో పాత్రలు నటించి ఎందరో హీరోలతో సరి సమానంగా నటించి చాలా తొందరగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోవడం సినిమా రంగానికి ( Mahesh and Soundarya ) సినీ అభిమానులకి కూడా తీరని లోటు. సౌందర్య చనిపోయిన ఇన్నేళ్ళవుతున్నా కూడా ఇప్పటికీ ఆమెని ఎవరు మర్చిపోలేదు. ఈ జనరేషన్ వాళ్ళు కూడా సౌందర్య గురించి మాట్లాడుకుంటారు. అంత గొప్ప నటి ఆమె.. సహజత్వంతో సహజమైన హావభావాలతో అందచందాలతో చక్కటి నటనతో అందరినీ ఆకట్టుకున్న గొప్ప నటి సౌందర్య.

soundarya-mahesh-babu

సౌందర్య, మహేష్ బాబు తో నటించే అవకాశం ఒకసారి వచ్చిందంట. సౌందర్య చాలా మంది స్టార్ హీరోలు సరసన నటించింది. సూపర్ స్టార్ కృష్ణ సరసన కూడా ఆమె నటించి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినవి ఉన్నాయి. అయితే మహేష్ బాబు ( Mahesh and Soundarya ) కూడా సౌందర్య తో నటించే అవకాశం వచ్చిందంట. మహేష్ బాబు మొదటి సినిమా హీరోగా రాజకుమారుడు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత యువరాజు సినిమా తీయడం జరిగింది. యువరాజు సినిమాలో మహేష్ బాబు హీరోయిన్గా సిమ్రాన్, సాక్షి శివానంద్ నటించారు.

See also  Niharika Konidela: ఆ ఒక్క ఫోటోతో విడాకులు తీసుకుంటారా.? లేదా.? అన్న సీక్రెట్ బయటపెట్టి నిహారిక..

soundarya-mahesh-babu-movie

ఈ సినిమాలో మహేష్ బాబుకి, సిమ్రాన్ కి ఒక కొడుకు పుడతాడు. ఫ్లాష్ బ్యాక్ లో సిమ్రాన్ ని చూపించి ప్రజెంట్ లో సాక్షి శివానంద్ ని మహేష్ బాబు ప్రేమిస్తాడు. ఆ రూల్ లో మొదట సిమ్రాన్ కంటే ముందు సౌందర్యని అనుకున్నాడంట దర్శకుడు. అయితే ( Mahesh and Soundarya ) ఆ పాత్రలో సౌందర్య నటించిన కోసం అడిగాడంట. అయితే సౌందర్య కదంతా విని చాలా బాగుంది నచ్చింది కానీ.. మహేష్ బాబు పక్కన తాను హీరోయిన్గా సూట్ అవ్వనని చెప్పిందంట. మహేష్ బాబు నాకంటే చాలా చిన్నోడు, నేను తనకంటే వయసులో పెద్దదాన్ని నేను తనకి అక్కలా ఉంటా తప్పా.. ఈడు జోడు సరిగ్గా కుదరదు అని చెప్పింది అంట.

See also  Sai Pallavi: తన పై వస్తున్న పెళ్లి వార్తలపై స్పందిస్తూ దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చిన సాయి పల్లవి..

soundarya-missed-mahesh-yuvaraju-movie

ఈ పాత్రలో మహేష్ బాబు సరసన సిమ్రాన్ అయితే బాగుంటుందని చెప్పిందంట. దానితో ఇక దర్శకుడు సౌందర్యని వదిలేసి సిమ్రాన్ తో మాట్లాడుకొని ఆ సినిమా చేయడం జరిగింది. యువరాజ్ సినిమా కూడా ఆ రోజుల్లో మంచి హిట్టు కొట్టింది. అయితే నిజంగా సౌందర్య సరిగ్గానే ఆలోచించిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఎందుకంటే.. సిమ్రాన్ కూడా మహేష్ బాబు కంటే పెద్దదానిలాగే ఆ సినిమాలో అనిపిస్తుంది. సిమ్రాన్ చీర కట్టుకొని పెద్ద తరహాగా ఒక కొడుకుతో ముందుకొస్తే.. మహేష్ బాబు మాత్రం అక్కడ చాలా చిన్నోడిలాగే అనిపిస్తాడు. అలాంటిది ఇక సౌందర్యతో ఆ పాత్ర చేస్తే అసలు బాగోదు. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు. సినిమాపై మహేష్ బాబు అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా మొదటిసారి రిలీజ్ చేశారు. ఆ సాంగ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మరి సినిమా సంగతి చూడాలి.