
Nagarjuna Bigg Boss : అక్కినేని నాగేశ్వరావు వారసుడుగా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అక్కినేని నాగార్జున మంచి నటుడు మాత్రమే కాకుండా.. మంచి వ్యాపారవేత్త కూడా. నాగార్జున తెలుగు సినిమా ఇండస్ట్రీలో ( Nagarjuna Bigg Boss ) అడుగుపెట్టిన తర్వాత విక్రమ్ సినిమా నుంచి ఇప్పటివరకు కూడా ఆయన ఎన్నో హిట్స్, ఫ్లాప్స్ చూసుకుంటూ వచ్చారు. నాగార్జున తనదైన శైలిలో నటిస్తూ తనకంటూ ఒక మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ.. కొత్తదనానికి, కొత్త కథలకి అవకాశాలు ఇస్తూ ముందుకు సాగుతూ వచ్చాడు.
కెరీర్ పరంగా నాగార్జున తండ్రికి తగ్గట్టుగా ఎంతో సక్సెస్ అయ్యి సినిమా రంగంలో నిలబడ్డారు. కాకపోతే ఆయన కొడుకులిద్దరూ మాత్రం సినిమా రంగంలో స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలుగు వెలగలేకపోతున్నారు. దానికి కారణం ఏమిటా అని ఎప్పటికప్పుడు నాగార్జున స్టడీ చేస్తూనే ఉన్నాడు. ఎప్పటికప్పుడు వాళ్ళు ( Nagarjuna Bigg Boss ) తీయబోయే సినిమాలు కథలని పరిశీలించడం.. దర్శకులతో మాట్లాడటం ఎన్ని చేస్తున్నా కూడా.. మంచి ఫలితం ఫలించడం లేదు. అయితే నాగార్జున సినిమాల్లో హీరోగా నటించిడమే కాకుండా.. బిగ్ బాస్ లాంటి షోలకు హోస్టుగా కూడా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.
అయితే నాగార్జున ఒకసారి మాట్లాడిన మాటల వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తుంది. నాగార్జున, నాని కలిసి దేవదాసు సినిమా నటించారు. ఆ సినిమా 2018లో రిలీజ్ అయింది. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ సినిమా ప్రమోషన్ నిమిత్తం నాగార్జున పలు ఇంటర్వ్యూలు ( Nagarjuna Bigg Boss ) ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలు సమయంలో మీరు బిగ్ బాస్ కి హోస్టుగా చేస్తున్నారా అని ప్రశ్నించగా.. నాగార్జున చెప్పిన సమాధానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అసలు నాగార్జున అప్పుడు ఎలా మాట్లాడి.. ఇప్పుడు ఇలా ఎలా బిహేవ్ చేస్తున్నాడు అంటూ తెగ ట్రోల్స్ వస్తున్నాయి.
మీరు బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్నారా అని ప్రశ్నించగా యాంకర్ తో నాగార్జున ఇలా అన్నాడు.. బిగ్ బాస్ గురించి అసలు మాట్లాడకండి.. నేను చాలా బ్యాడ్ గా మాట్లాడాల్సి వస్తాది. అసలు అదొక షో నా అండి? ఎవరో ఏదో చేస్తున్న విషయాలు తెలుసుకోవాలని కుతూహలం ఏంటి? ఇలాంటివి ఎందుకు పనికిరావు అని నాగార్జున అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంతలా బిగ్ బాస్ షో గురించి చెడుగా చెప్పిన నాగార్జున ఇప్పుడు అదే షోకి కొన్నిఎపిసోడ్స్ కి కంటిన్యూస్గా హోస్ట్ గా పనిచేయడం వెనకాల ఉన్న కారణం ఏమిటి? అంటే డబ్బు కోసం ఒక నిర్ణయాన్ని మార్చుకుంటాడు నాగార్జున అంటూ అనేక విమర్శలు చేస్తున్నారు.