Home News Pawan Kalyan: మొదటిసారి మూడు పెళ్లిళ్ల గురించి అసలు విషయం బయటపెట్టిన పవన్ కళ్యాణ్…

Pawan Kalyan: మొదటిసారి మూడు పెళ్లిళ్ల గురించి అసలు విషయం బయటపెట్టిన పవన్ కళ్యాణ్…

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరమే లేదు. అందరి హీరోలకి అభిమానులు ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మాత్రం భక్తులు ఉంటారు. అంతటి అభిమానం సంపాదించుకున్నారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగుతెరకు పరిచయమై ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. అటు సినిమాలోని కాకుండా ఇటు రాజకీయాల్లో కూడా వచ్చి సీఎం గా ప్రజల బాగోగులు చూడాలని జనసేన పార్టీ పెట్టాడు.

See also  Mobile recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ లో 28,56,84 రోజులే ఉండటం వలన ఎన్ని వేల కోట్లు లూటీ అంటే..

for-the-first-time-pawan-kalyan-disclosed-the-truth-about-three-marriages-stunning-fans

పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా ఢీకొట్టే దమ్ము లేక చాలామంది ఆయన పర్సనల్ మ్యాటర్స్ తెరమీదకి తీసుకువచ్చి విమర్శిస్తూ ఉంటారు. తాజాగా బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ షో లో మూడు పెళ్లిళ్ల విషయం గురించి పవన్ కళ్యాణ్ స్పందించాడు. నాకు పెళ్లంటే ఏంటో తెలియని వయసులో నందిని అనే అమ్మాయిని చేసుకున్నాను అప్పటికి నేనింకా పెళ్లికి సిద్ధంగా లేను. కుటుంబ సభ్యుల ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాను.

for-the-first-time-pawan-kalyan-disclosed-the-truth-about-three-marriages-stunning-fans

దాంతో మొదట్లో నా భార్యతో మనస్పర్ధలు ఏర్పడి ఆమెకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. ఇక రెండోసారి రేణు దేశాయ్ ని వివాహమాడాను. తనతో కూడా అభిప్రాయ భేదాలుండడంతో  తనకు విడాకులిచ్చాను. ఐతే ఈ పెళ్లిళ్ల తర్వాత నేను పెళ్ళి చేసుకోకుండా ఓ యోగిలా మారిపోవాలనుకున్నా,  నాకు మూడో పెళ్లి చేసుకోవాలని ఉద్దేశ్యం లేదు అనుకోకుండా నా మూడో పెళ్లి జరిగిపోయింది. చాలామంది నన్ను రాజకీయంగా ఢీకొట్టే సత్తా లేక నా పర్సనల్ విషయాన్ని తెరమీద తీసుకొచ్చి మూడు పెళ్లిళ్లు అంటూ ఎప్పుడు నన్ను విమర్శిస్తుంటారు.

See also  Urfi Javed Hot Topic: అందాలు ఆరబోస్తే తప్పెలా అవుతుంది.! నేను ఒక్కదాన్నే చూపిస్తున్నానా.? ఉర్ఫీ జావేద్

నేను కూడా వాళ్ళ పర్సనల్ విషయాలో తిట్టొచ్చు కానీ, వేరే వాళ్ళ విషయంలో జోక్యం చేసుకునే సంస్కారం నాకు లేదు. నేనలా తిట్టను వాళ్లకు ఫ్యామిలీ ఉంది, నేనలా తిట్టినప్పుడు తిట్టే వ్యక్తికి ఏం కాకపోవచ్చు, గాని వాళ్ళ భార్య,పిల్లలు బాధపడతారు. అందుకే నేను వాళ్ళను మధ్యలో ఎప్పుడు లాగను అంటూ తన మూడు పెళ్లిళ్ల విషయం గురించి చెప్తూ విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చాడు.