Home Cinema Keerthy Suresh Birthday : కీర్తి సురేష్ పుట్టినరోజు నాడు ఆమె లవర్ ఎవరో తెలిసిపోయింది..

Keerthy Suresh Birthday : కీర్తి సురేష్ పుట్టినరోజు నాడు ఆమె లవర్ ఎవరో తెలిసిపోయింది..

on-keerthy-suresh-birthday-everybody-got-to-know-about-her-lover

Keerthy Suresh Birthday : మహానటిగా గొప్ప పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ సినిమాతో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కీర్తి సురేష్ ముఖంలో అన్ని రకాల అందచందాలు ఉంటాయి. సాంప్రదాయంగా ఒక చెల్లెలుగా, ఒక లవర్ గా, ఒక భార్యగా ఇలా అన్ని కోణాల్లోని కూడా ( Keerthy Suresh Birthday ) అద్భుతంగా నటించగలదు. కీర్తి సురేష్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆమెకి పెద్దగా డైలాగ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు.. మౌనంగా కూడా మంచి నటన నటిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలదు. ఆమె మౌనంగా తలదించుకుని ఉన్నా కూడా ఆ సినిమాలో ఆ సీన్ పండించేస్తాది. అంత మంచి ముఖ లక్షణాలు ఆమె కలిగి ఉంది.

Keerthy-suresh-birthday

ఇటీవల చిరంజీవితో కలిసి బోలాశంకర్ సినిమా నటించిగా.. ఆ సినిమా డిజాస్టర్ అవడంతో కీర్తి సురేష్ కి కొంత క్రేజ్ తగ్గిందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె టాలీవుడ్ లో కొంచెం తగ్గినా కూడా.. బాలీవుడ్ లో దూసుకుపోతుంది. కీర్తి సురేష్ ( Keerthy Suresh Birthday ) ఇప్పుడు హిందీలో వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవల సినిమా షూటింగ్ నిమిత్తం ఆటోలో ఇద్దరు కలిసి వెళ్తున్న ఫోటోలు కూడా తెగ వైరల్ అయ్యాయి. ఆటోలో కీర్తి సురేష్ చాలా సామాన్యంగా లెగ్గింగ్ మరియు టీ షర్టు వేసుకొని ఉంటే.. వరుణ్ ధావన్ మాత్రం కేవలం కట్ బనీన్ వేసుకొని ఉన్నాడు.

See also  Allu Arjun - Sreeleela : అల్లు అర్జున్ కి శ్రీలీలకి మధ్య ఇలాంటి వాదన జరిగిందా.. బన్నీ మామూలోడు కాదు సుమీ..

Keerthy-suresh-birthday-lover-news

ఈ ఫోటోల మీద అనేక స్టోరీలు వచ్చాయి. కీర్తి సురేష్ తన బాయ్ ఫ్రెండ్ తో అర్ధరాత్రి బయట తిరుగుతుందని.. ఎవరికీ తెలియకుండా ఆటోలో తిరుగుతుందని ఇలా ఎన్నో వార్తలు వచ్చాయి. తర్వాత చూస్తే అది సినిమాలో షూటింగ్ అని తెలిసింది. అక్కడితో కొంచెం ఆగిపోయారు. ఇక కీర్తి సురేష్ పెళ్లి గురించి అనేక వార్తలు ( Keerthy Suresh Birthday ) ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. కీర్తి సురేష్ ఒకసారి తన సోషల్ మీడియాలో తన ఫ్రెండ్ తో కలిసి ఒక ఫోటో పెడితే.. అతనే కీర్తి సురేష్ లవర్ అని, చిన్నప్పటినుంచి అతనితో ప్రేమలో ఉందని అనేక వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అది కూడా నిజం కాదని.. అతను కేవలం తన ఫ్రెండ్ మాత్రమే అని కీర్తి సురేష్ చెప్పడంతో ఆ వార్తలను కూడా పక్కన పెట్టేశారు.

See also  Allu Arjun: ఏంటి.! అల్లు అర్జున్ హీరోగా సినిమాల్లోకి రాకముందుకు ఆ పనులు చేస్తూ పైసలు సంపాదించేవాడా.?

Keerthy-suresh-birthday-lover-revealed

ఈరోజు కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానులందరూ ఆమెను ఎంతగానో తలుచుకుంటూ సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నారు. కీర్తి సురేష్ కూడా తన పుట్టినరోజుని ఎంతో ఆనందంగా వేడుకగా చేసుకుంది. అయితే బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం.. కీర్తి సురేష్ కి పుట్టినరోజు సందర్భంగా వరుణ్ ధావన్ ఒక గిఫ్ట్ ఇచ్చాడంట. గిఫ్ట్ అంటే ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాడు ఇద్దరు కలిసి నటిస్తున్నారు కాబట్టి.. కానీ, ఇచ్చిన గిఫ్ట్ చూసి అప్పుడు అర్థమవుతుంది. కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా డైమండ్ బ్రాస్లైట్ ఇచ్చాడంట. కేవలం నాలుగు రోజుల క్రితం పరిచయానికి అంత కాస్ట్లీ గిఫ్ట్ ఎందుకు ఇచ్చాడని.. కచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందని బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుంది. దీనితో కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమె లవర్ సంగతి బయట పడిపోయిందా అంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.