Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ అంటే సినీ అభిమానులందరికీ ఎంతో ఇష్టం. 2018 లో రొమాంటిక్ డ్రామా సినిమాతో బాలీవుడ్లో హీరోయిన్గా అడుగు పెట్టింది. అక్కడ నుంచి ఆమె బాలీవుడ్లో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వెళ్తుంది. లేడీ ఓరియంటెడ్ సినిమా కూడా నటించింది. అలాగే ( Janhvi Kapoor comments about her pics ) వరుణ్ ధావన్ సరసన బవాల్ లో నటించింది. ఇక బాలీవుడ్ లో ఆమె నటించిన ఏ సినిమాలోని కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోలేదు కానీ ఆమెపై అభిమానాన్ని మాత్రం పోగొట్టుకోలేదు. ఇప్పుడు ఆమె జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దేవరా సినిమాతో తెలుగులో డెబ్యూ ఇస్తుంది.
దేవర సినిమాలో జాన్వి కపూర్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటించబోయే ఈ సినిమాపై సినీ అభిమానులందరికీ, నందమూరి అభిమానులకి, శ్రీదేవి అభిమానులు అందరికీ ( Janhvi Kapoor comments about her pics ) కూడా ఎంతో ఆసక్తిగా ఉంది. అయితే ఇటీవల జాన్వీ కపూర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.. ఆ ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలని బయట పెట్టింది. ఆమె ఒక్కొక్క విషయం చెప్తుంటే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. తనలో ఉన్న.. తాను ఎదుర్కొన్న ఎన్నో సమస్యల గురించి మీడియాతో పంచుకుంది. ఇంతకీ జాన్వీకపూర్ పంచుకున్న విశేషాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.
నేను సెలబ్రిటీ ముఖ్యంగా శ్రీదేవి కూతురు అవడం వల్ల చిన్నప్పటి నుంచి కెమెరా అనేది నా జీవితంలో ఒక భాగం అయిపొయింది. నా చిన్నతనం నుంచి నాకు తెలియకుండానే ఎంతోమంది నా ఫోటోలు తీస్తూ ఉండేవారు. నా సోదరి ఫోటోలు కూడా తీస్తూ ఉండేవారు. కానీ కొందరు మా ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆ ఫోటోలు అశ్లీల వెబ్సైట్లో పెట్టారు. అవి చూసి నేను ( Janhvi Kapoor comments about her pics ) చాలా షాక్ అయ్యాను. నేటి డిజిటల్ యుగంలో నకిలీ చిత్రాల బెడద ఎంత దారుణంగా తయారయింది అంటే అలా ఉంది .ఇలాంటి చిత్రాలను చూసి ఎవ్వరు కూడా నమ్మకూడదు. నాకు విపరీతమైన ఆందోళన కలిగింది. ఇప్పుడు ఎలా అని భయపడ్డాను. అలాంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
అలాగే నా పదేళ్ల వయసులోనే నా ఫోటోలు ఇంటర్నెట్లో కనిపించేవి. అవి చూసి స్కూల్లో నాతో పాటు చదువుకునే వాళ్ళందరూ నువ్వు సినిమాల్లో ట్రై చేస్తున్నావా అని అనేవారు. అలాగే కొంచెం ఎదిగిన తర్వాత నువ్వు హీరోయిన్ అవడానికి పెద్ద కష్టపడక్కర్లేదులే.. నీకు ఫౌండేషన్ ఉంది కదా అని అనేవారు. నువ్వు ఎప్పుడు చదువు మానేస్తున్నావ్? ఎప్పుడు సినిమాల్లోకి వెళ్తున్నావ్ అని అనేవారు. అసలు వీళ్ళకి ఎవరు హక్కు ఇచ్చారు నా గురించి జడ్జ్మెంట్ తీసుకోవడానికి అని నాకు బాధ అనిపించేది. నాకేం అర్థం అయ్యేది కాదు. నా స్నేహితులు కూడా నన్ను ఎగతాళి చేసేవారు. కష్టపడకుండా ఏ మనిషికి ఏది దక్కదు. నువ్వు కష్టపడక్కర్లేదు అని అంటుంటే నాకు బాధ అనిపించేది అని చెప్పుకొచ్చింది. మొత్తానికి జాహ్నవి కపూర్ నేటి డిజిటల్ యుగంలో నకిలి చిత్రాలకి చాలా ఆందోళన చెందింది అన్న విషయం చాలామంది జీవితాల్లో కూడా ఇలాంటివి వింటున్నాము..