Allu Arjun – Sreeja : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఇప్పుడు ఎలాంటి క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ స్టైల్ గాని, నటన విధానం గాని.. సినీ అభిమానులందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకు ( Allu Arjun and Sreeja ) అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టం. అలాంటి అల్లు అర్జున్తో నటించాలంటే ప్రతి హీరోయిన్ ఎంతో ఇష్టపడుతుంది. అల్లు అర్జున్తో ఛాన్స్ దొరికితే సినిమాలో నటించాలని మహా మహా స్టార్ హీరోయిన్ లు అందరు కోరుకుంటారు. అయితే అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి మనందరికీ గుర్తుంది. గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ చాలా సామాన్యంగా అసలు సినిమా హీరో లుక్ లేకుండా ఉంటాడు.
అలాంటి గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్గా చిరంజీవి కూతురు శ్రీజని పెడదాం అనుకున్నారంట. అల్లు అరవింద్ గంగోత్రి సినిమా కథని అల్లు అర్జున్ మొదటి సినిమాగా ఒప్పుకున్నప్పుడు.. వాళ్లు ( Allu Arjun and Sreeja ) అల్లు అరవింద్ ని శ్రీజాని హీరోయిన్గా పెడదామని అడిగారంట. ఎందుకంటే.. అల్లు అరవింద్ కొడుకు, చిరంజీవి కూతురు కలిసి నటించిన సినిమా అంటే ఇక ఆడియన్స్ విపరీతంగా వస్తారని వాళ్ళకు అప్పుడే బిజినెస్ నాడి తెలుసు కాబట్టి. అలాగే శ్రీజ కి కూడా సినిమాల్లో హీరోయిన్గా నటించాలని విపరీతమైన కోరిక ఉండేదంట. ఆ కారణంగా అన్ని రకాలుగా వర్కౌట్ అవుతుందని అల్లు అరవింద్ కూడా ఆలోచించాడంట.
దానితో అల్లు అరవింద్ వెళ్లి శ్రీజ తో చెప్పగా.. ఈ విషయం తెలిసిన శ్రీజ అల్లు అర్జున్తో కలిసి సినిమాలో హీరోయిన్గా చేయడానికి విపరీతంగా ఇష్టపడిందంట. కానీ చిరంజీవికి ఈ విషయం తెలియగానే.. హీరోయిన్ ను లేదు ఏమీ లేదు వద్దు అని గట్టిగా చెప్పాడంట. అసలు హీరోయిన్గా నటించడం అనేది నాకు ఇష్టం లేదని ( Allu Arjun and Sreeja ) చిరంజీవి ఒప్పుకోలేదంట. దానితో అల్లు అరవింద్ చిరంజీవిని నొప్పించకుండా శ్రీజాని సైడ్ చేసి.. వేరొక హీరోయిన్ ని పెట్టడం జరిగిందంట. అయితే ఆ విషయంలో శ్రీజ చాలా బాధపడిందంట. అల్లు అర్జున్తో కలిసి హీరోయిన్గా నటించే అవకాశం పోయిందని ఎంతో ఫీల్ అయిందంట. అయితే ఈ విషయం తెలిసిన నెటిజనులు ఒక్కసారిగా గంగోత్రి సినిమా కథని గుర్తు చేసుకుంటున్నారు.
గంగోత్రి సినిమాలో హీరో హీరోయిన్ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉంటారు. పెద్దయిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు అనే విషయం తెలుస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ అల్లు అర్జున్ కోసం ఎంత తపించినా.. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. దానితో హీరోయిన్ చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోవడానికి సిద్ధపడుతుంది. చనిపోయిన కూతుర్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ కన్నీరు మున్నీరుగా ఏడుస్తాడు. మళ్లీ అల్లు అర్జున్ ప్రేమ, అల్లు అర్జున్ పాడిన పాట ఆమెకు ప్రాణం పోస్తుంది. ఇలా శ్రీజ పాపం ఆ పాత్రలో అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసి.. చివరికి తనకోసం సూసైడ్ చేసుకునే రోల్ లో జీవిద్దామని అనుకుంటే.. చిరంజీవి మాత్రం ఒప్పుకోకపోవడం పాపం బాధాకరమే అని నెటిజనులు అనుకుంటున్నారు.