Nagarjuna Talk: యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గురించి పరిచయాలు మనకి కొత్తేమీ కాదు. కాగా ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్సార్ లో స్రీమింగ్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో తన దైన శైలిలో ఎప్పటిలాగే తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలు ఊగిస్తున్నాడు. కాగా ప్రతి సీజన్ కంటే తర్వాతి సీజన్ కి భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటూ వస్తున్నాడు అక్కినేని నాగార్జున.. ఇక మన టాపిక్ విషయంలోకి అడుగు పెడితే.. అసలు ఎవరైనా సరే ఏదైనా సినిమాలో నటించే సమయంలో తన పక్కన జోడిగా యంగ్ మరియు స్టార్ హీరోయిన్లను ఎంపిక చేసుకోవడానికి తెగ ముచ్చట పడిపోతుంటారు.
అలాగే సీనియర్ హీరోలైన అంతే అందులో భాగంగానే అక్కినేని నాగార్జున నటించిన ఓ చిత్రంలో హీరోయిన్ ఎంపిక చేసుకునే సమయంలో ఆ హీరోయిన్ కచ్చితంగా స్టార్ హీరోయిన్ అయి ఉండాలి ఫేమస్ హీరోయిన్ అయి ఉండాలి అని భావించాడట. ఇక మార్కెట్లో ఎక్కువ ఏ హీరోయిన్ కి డిమాండ్ ఉంది ఏ హీరోయిన్ తన పక్కన నటిస్తే తనకి ప్లస్ అవుతుంది ఏ హీరోయిన్ తన పక్కన నటిస్తే హిట్ అవుతుంది అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ తనకే హీరోయిన్ ప్లస్ అవుతుందని ఉద్దేశంతో దర్శక నిర్మాలతో పాటు హీరోలు కూడా హీరోయిన్ల నేర్చుకునే విధానంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటారు ఎందుకంటే సినిమా బోల్తా కొడితే కెరీర్ మొత్తానికి బురిడీ కొట్టాల్సి వస్తుంది.
అందుకే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు సినీ ఇండస్ట్రీలో ఉన్న తారలు.. ఇక ఈ సోది అంతా ఎందుకు చెప్తున్నాను అనుకోవచ్చు.. అక్కడికే వస్తున్న ఇండస్ట్రీలో యువ సామ్రాట్ కింగ్ గా పేరు తెచ్చుకున్నటువంటి అక్కినేని నాగచైతన్య ఆ స్టార్ హీరోయిన్ కి ఫోన్ చేసి మరి అవకాశం ఇచ్చినప్పటికీ ఆమె మొహం మీద రిజెక్ట్ చేసిందట. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు రష్మిక మందన. నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకొని ప్రస్తుతం మీకు నార్త్ లో అటు సౌత్ లోనూ ఒక ఊపు చాలా బిజీ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక మందన. ఈ అమ్మాయికి ఇటు టాలీవుడ్ లోనూ అటు బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ అయితే కొనసాగుతోంది.
ఇక ఇలాంటి హీరోయిన్ తన సినిమాలు పెట్టుకుంటే సినిమాకి మరింత డిమాండ్ పెరగడమే కాకుండా ప్లస్ అవుతుంది అని భావించాడు (Nagarjuna Talk) నాగార్జున. ఆ ఉద్దేశంతోనే నాగార్జున తనతో ఒక సినిమాలో చేయాలని ఫోన్ చేసి మరి స్వయంగా అడిగాడు అంట. మరి ఆ చిత్రం ఏంటంటే బంగార్రాజు సినిమా కోసమే కృతి శెట్టి స్థానంలో రష్మిక మందన ను మొదట తీసుకోవాలని భావించారట. కానీ రష్మిక మందన అంత పెద్ద స్టార్ హీరోయిన్ నాగార్జున ఫోన్ చేసినప్పటికీ కూడా ప్రస్తుతం నాకు డేట్స్ ఖాళీ లేవు సార్.. అవకాశం వస్తే వేరే ఏదైనా సినిమాలో చూద్దామంటూ సున్నితంగా చిత్రాన్ని రిజెక్ట్ చేసిందట. ఇక ప్రస్తుతం ఈ వార్త చెక్కర్లు కొట్టడంతో.. టాలీవుడ్ లోనే అంత పెద్ద స్టార్ హీరో ఫోన్ చేసినా కూడా రిజెక్ట్ చేసిందా అంటూ అందరూ తెగ ఆశ్చర్యపోతున్నారు.