Home Cinema Priyamani: ఆ దర్శకుడు నన్ను నమ్మించి మోసం చేసాడు అంటూ సంచలమనైన ఆరోపణలు చేసింది ప్రియమణి..

Priyamani: ఆ దర్శకుడు నన్ను నమ్మించి మోసం చేసాడు అంటూ సంచలమనైన ఆరోపణలు చేసింది ప్రియమణి..

Priyamani Cheating: రెండు దశాబ్దాల కాలం నుండి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నటిగా ప్రియమణి మనందరికీ తెలుసు.. ఆమె నటించిన చిత్రాలకు జాతీయ అవార్డు సైతం దక్కింది. అలాంటి ప్రియమణి గురించి మనందరికీ తెలిసిందే కొత్తగా పరిచయాలు చేసేదేముంది చెప్పండి. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ లో జన్మించిన ప్రియమణి అసలు పేరు ప్రియ వసుదేవ మణి అయ్యార్. విద్యా రీత్యా బి ఏ చదివిన ఈ కేరళ కుట్టి నటనపై మక్కువ ఎక్కువ ఉండడంతో సినిమా రంగుల ప్రపంచంలో అడుగు పెట్టి తనేంటో నిరూపించుకుందామని వచ్చింది. 2003 వ సంవత్సరంలో ఎవరే అతగాడు అనే చిత్రంతో సనీ రంగ ప్రవేశం చేసింది ప్రియమణి. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటిస్తున్న ప్రియమణికి పెళ్లయిన కొత్తలో చిత్రం చాలా మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత వరుసగా చిత్రాలలో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా తనేంటో నిరూపించుకుని స్టార్డమ్ ను మూటగట్టుకుంది.

See also  Hansika - Shimbu: ఆ హీరోతో యవ్వారం నడిపిస్తున్నదని హన్సికను చితకొట్టుడు కొట్టాడా శింబు..? బయటపడ్డ సీక్రెట్.

Actress Priyamani

అగ్ర హీరోల చెంత నటిస్తూ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాక తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో పలు చిత్రాలు నటిస్తూ తన దైన శైలిలో తను ఏంటో మంచి ఇమేజ్ ని కాపాడుకుంటూ వచ్చింది. ఇక వివాహం చేసుకున్న తర్వాత కొద్ది రోజుల అనంతరం నటనకు కాస్త గ్యాప్ ఇచ్చినప్పటికీ.. మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టింది. మొదటి ఇన్నింగ్స్ లో కంటే సెకండ్ ఇన్నింగ్స్ లో డబుల్ ఇమేజ్ ని కైవసం చేసుకుంది. తనకు తగ్గ పాత్రలను చేస్తూ కెరియర్ లో మరింత ముందుకు పరుగులు తీస్తుంది. ఇక ఇటీవల ప్రియమణి షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రంలో నటించి ప్రేక్షకులను పలకరించింది. ఇక ఈ చిత్రం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన మాస్ యాక్షన్ డ్రామా చిత్రమిది.

Priyamani

ఇక ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా నటించారు.. ఈ చిత్రంతో బాలీవుడ్ కి తొలి సారిగా పరిచయమైంది నయనతార. ఈ చిత్రం సెప్టెంబర్ 7వ తారీఖున విడుదలై భారీ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామీని సృష్టిస్తూ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రంలో ప్రేయమణి కీలకమైన పాత్రలో నటించగా యాక్టింగ్ మంచి స్కోప్ ఉన్న పాత్ర ఆమెకి దక్కడంతో.. ప్రియమణి అదరగొట్టేసిందనే చెప్పాలి. విమర్శకుల చేత ప్రశంసలు దక్కించుకుంది. జవాన్ చిత్రం సక్సెస్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ప్రియమణి.

See also  Rashmika Mandanna : కెరీర్ లో ఒక వెలుగు వెలుగుతున్న ఈ టైం లో సంచలన నిర్ణయం తీసుకున్న రష్మిక..

ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. స్టార్ డైరెక్టర్ అట్లీ నన్ను నమ్మించి దారుణంగా మోసం చేశాడు అంటూ పలు వ్యాఖ్యలు చేయగా అభివృద్ధి ప్రస్తుతం నెట్టింట పెద్ద దుమారం లేపుతున్నాయి. మరి అసలు ఏం జరిగింది.? అనేది మనం ఇప్పుడు చూద్దాం.. ఈ చిత్రం విడుదలకు ముందే తమిళ్ వెర్షన్ లో దళపతి విజయ్ తెలుగు వెర్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ రోల్ ప్లే చేయబోతున్నారంటూ ఓ పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. అయితే ఓ రోజు ఈ విషయం పై ప్రియమణి డైరెక్టర్ ఆరా తీయగా అవును అని చెప్పకనే చెప్పాడు. దాంతో ప్రియమణి హీరో విజయ్ తో తనకు ఒక షాటైనా పెట్టమని అడిగిందట. అందుకు అట్లీ సైతం సరే అని బదులిచ్చాడు. కానీ చివరకు ఇటు విజయ్ అటు ఎన్టీఆర్ ఇద్దరూ జవాన్ చిత్రంలో నటించలేదు. అసలు మూవీ బృందం వారిని సంప్రదించలేదట. దాంతో ప్రియమణి నన్ను బిస్కెట్ చేశారంటూ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి ఈ విషయాన్ని ప్రస్తావించింది. అలా విజయ్ పేరు ఎన్టీఆర్ పేరు చెప్పి నన్ను అట్లీ(Priyamani Cheating) దారుణంగా నమ్మించి మోసం చేశాడు అంటూ ప్రియమణి చెప్తూ సరదాగా నవ్వింది దాంతో ఈ విషయం కాస్తా ట్రెండింగ్ లోకి వచ్చింది.