Home Cinema Trisha: ఆ పని చేయడం వల్లే నలభై ఏళ్ల వయసులో కూడా త్రిషకు వరుస సినిమాల్లో...

Trisha: ఆ పని చేయడం వల్లే నలభై ఏళ్ల వయసులో కూడా త్రిషకు వరుస సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయా.?

Trisha Films: త్రిష కృష్ణన్.. ఈ పేరు చెప్పగానే మన తెలుగమ్మాయి అనుకుంటాం. కానీ ఈ అమ్మడు పుట్టింది చెన్నైలో.. చూడడానికి అచ్చం మన తెలుగు అమ్మాయిల కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలో నటించినది. పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన కూడా ఆడి పాడి ఎంతగానో అలరిస్తూ చిందులేచింది. అలా కేవలం ఈ చెన్నై బ్యూటీ తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఎన్నో చిత్రాల్లో నటిస్తూ భారీ పాపులర్ అయితే కైవసం చేసుకుంది. ఆ తర్వాత పలు వ్యక్తిగత కారణాల చేత సినీ కెరీర్ కాస్త మందగించిందని చెప్పాలి. ఇక ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో వచ్చినటువంటి చిత్రం పొనియల్ సెల్వన్ ఒకటో భాగం రెండో భాగం లలో కుందువై పాత్రలో నటించి ఎంతగానో అలరిస్తూ అందరిని ఇట్టే ఆకట్టుకుంది.

See also  Mahesh - Ram Charan : మహేష్ మరియు రామ్ చరణ్ పోటీ పడితే గెలుపు ఆ హీరోదేనా?

Trisha

1983వ సంవత్సరం లో పుట్టిన ఈ భామ వయసు 40 ఏళ్లు పైపడుతున్నప్పటికీ కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కానంటూ ఇప్పటికీ పెళ్లి కూడా చేసుకోకుండా 25 ఏళ్ల యంగ్ హీరోయిన్ లా కనిపిస్తూ ప్రస్తుతం ఒంటరిగానే జీవిస్తూ తన సినీ కెరీర్ ని ముందుకు సాగిస్తుంది. కాగా ఈ పాటికి ఎప్పుడో పెళ్లి చేసుకొని పిల్లలతో హాయిగా ఉండాల్సిన త్రిష గతంలో నిశ్చితార్థం చేసుకుని పలు కారణాలతో ఆ పెళ్లిని అర్ధాంతరంగా నిలిపివేసింది. ఆ తరువాత సినిమాల పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికి కూడా ఏమైందో తెలియదు పెళ్లి అంటే ఆ పదానికి ఆమడ దూరంలో ఉంటుంది. సినిమాల పైన విపరీతమైన మోజు పెంచుకుంటూ ఈ వయసులో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

See also  Ram Charan : భయంతో నాగార్జున ఇంటికి వెళ్ళి తలదాచుకున్న రామ్ చరణ్..

Trisha Krishnan PS

ఇంత వయసులో కూడా త్రిష స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలు దక్కించుకుంటుందంటే ఇండస్ట్రీలో ఆమెకు ఏ రేంజ్ లో గుర్తింపు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వయసులో కూడా తన అంద చందాలతో యువతను అలరిస్తూ కుర్ర హీరోయిన్లకు దీటుగా అందంలో గట్టి పోటీ ఇస్తుందని చెప్పాలి. అయితే త్రిష మళ్లీ తన దశ కొనసాగించింది అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఆమె వరుస చిత్రాలతో స్టార్ హీరోల సరసన అవకాశాలతో దూసుకుపోతుందని చెప్పాలి. ఆమె చేతిలో ప్రస్తుతం అర డజనుకు పైగా చిత్రాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక అందులో స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం లియో ఈ దసరా కానుకగా విడుదలవుతుంది. ఈ చిత్రంలో విజయ్ కు జోడిగా త్రిష నటిస్తుంది.

Actress Trisha Krishnan

ఇక ఈ చిత్రం అనంతరం అజిత్ హీరోగా నటిస్తున్న విదామువర్చి చిత్రంలో కూడా త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఆ తర్వాత కమల్ హసన్ మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న చిత్రంతో పాటు దృశ్యం సిరీస్ దర్శకుడు జీసస్ జోసెఫ్, మోహన్ లాల్ తో కూడా తీయబడే తదుపరి చిత్రంలో కూడా త్రిష హీరోయిన్ గా ఎంపిక చేయబడింది. ఇక ఇవన్నీ కాకుండా మన తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రంలో కూడా హీరోయిన్ గా అవకాశం దక్కించుకుందని మనకు సమాచారం తెలుస్తోంది. ఏది ఏమైనాప్పటికీ నలభై సంవత్సరాల వయసు దాటినప్పటికీ కుర్ర హీరోయిన్లకి సరి సమానంగా స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కించుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న త్రిష (Trisha Films) చూసి మిగిలిన హీరోయిన్లు అయితే కళ్ళు తేలేస్తున్నారని చెప్పాలి.