Ileanas Comments: తన అంత చెందాలతో వయ్యారాలను వలకబోస్తూ అతి తక్కువ సమయంలోనే యూత్ లో క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కైవసం చేసుకుని అందర్నీ తన వైపు లాగేసుకున్న హీరోయిన్లలో ఇలియానా కూడా ఒకరు. ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది రామ్ హీరోగా నటించిన దేవదాసు అనే చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కైవసం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ అందర్నీ ఎంతగానో అలరించి ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఇంకేముంది ఇలియానాకు వరుస అవకాశాలు క్యూ లు కట్టాయి. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి చిత్రంలోని హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది.
ఈ సినిమా కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అప్పట్లో ఈ చిత్రం ఎంత భారీ స్థాయిలో హిట్టుగా నిలిచిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే.. అలా అలా తన సినీ కెరియర్ తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగిస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో అవకాశాలు దక్కించుకుని ఎన్నో హిట్స్ ను కైవసం చేసుకుంది. ఎన్నో చిత్రాలలో అలా నటిస్తూ కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఇదే స్పీడ్ ను కొనసాగించి అక్కడ కూడా పలు చిత్రాలలో నటించింది. ఇక ఆ తర్వాత నేరుగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. కానీ అనుకున్నంత స్థాయిలో అక్కడ హిట్స్ అందుకోలేక తన సినీ కెరియర్ బోల్తా కొట్టింది.
అయితే ఈ విషయాలన్నీ పక్కన పెట్టి మన టాపిక్ విషయంలోకి అడుగు పెట్టినట్లయితే.. ఇలియానా గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న దర్శకుల గురించి పలు సెన్సేషనల్ కామెంట్స్ చేసింది ఇలియానా.. దాంతో అప్పుడు చేసిన ఆమె మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇక ఇలియానా సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అందరి స్టార్ హీరోల చెంత నటించి భారీ విజయాలను కైవసం చేసుకుంది. అయితే ఆమె గతంలో పాల్గొన్న ఆ ఇంటర్వ్యూలో భాగంగా విలేకరి అడిగిన ప్రశ్న.. నటన పరంగా మీరు మిమ్మల్ని జనాలు గుర్తుంచుకునే పాత్ర ఇప్పటి వరకు ఒక్కటి కూడా లేదు అని ఇండస్ట్రీలో చాలా మంది అనుకుంటున్నారు మరి దానికి మీరేమని జవాబు చెప్తారు అని అడగ్గా..
ఆ వ్యాఖ్యలకు ఇలియానా (Ileanas Comments) స్పందిస్తూ.. నేను ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలను కానీ తెలుగు చిత్ర పరిశ్రమంలో ఉన్న దర్శకులు ఎక్కువగా నాలోని నటన కంటే న నడుము ఎన్ని యాంగిల్ లో చూపించాలి. అనే దాని పైనే వాళ్ల కాన్సన్ట్రేషన్ వాళ్ళ ఫోకస్ మొత్తం ఉంటుందంటూ. నా నడుం మీద ఫోకస్ పెట్టేస్తారంటూ వాళ్లకి ఎప్పుడూ నా నడుం మీద ధ్యాస దృష్టి తప్పితే వేరేగా విషయం ఉండదంటూ ఆమె కామెంట్ చేయడం పెద్ద దుమారమే రేపింది. ఇక ఇదే విషయాన్ని గతంలో రాశీ కన్నా.. పూజా హెగ్డే వంటి వారు కూడా ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది.