Arvind Swamy: దళపతి సినిమాతో తొలిసారిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అరవింద్ స్వామి.. తెలుగు వాళ్లకి ఎక్కువగా ఆ పేరు వినగానే గుర్తుకు వచ్చే సినిమాలో రోజా, బాంబే, దృవ ఈ మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ గానే నిలిచాయి. మొదటి రెండు సినిమాలు హీరోగా నటించిన అరవింద్ స్వామి ఆ తర్వాత ( Arvind Swamy father Delhi Kumar ) విలన్ పాత్రలవైపు వెళ్లారు. అరవింద్ స్వామి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఆయన అందానికి ఎంతోమంది ఆడవాళ్లు ఫిదా అయిపోయి .. ఫ్యాన్స్ గా మారారు. అందంతో పాటు మంచి నటన, అతనికి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది.
మణిరత్నం దర్శకత్వంలో రోజా సినిమా ఆ రోజుల్లో ఎంత పెద్ద హిట్టు కొట్టిందో.. ఇప్పటికీ ఎవరు మర్చిపోలేకపోతున్నారు. ఆ సినిమాలో పాటలు ఈనాటికీ కూడా అందరిని అలరిస్తున్నాయి. తెలుగు ఆడియన్స్ కూడా ఎంతో ఇష్టపడే హీరో అరవింద్ స్వామి. కానీ ఎందుకో తెలుగులో ఒక స్టార్ హీరోగా నిలబడలేకపోయారు ( Arvind Swamy father Delhi Kumar ) అరవింద్ స్వామి. సినిమాల్లో నటనతో పాటు బిజినెస్ కూడా చేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. అరవింద్ స్వామి తండ్రి పేరు వెంకట రామ దొరై స్వామి అని అందరికీ తెలుసు. అయితే అరవింద్ స్వామిని వెంకటస్వామి వెంకటరామ దొరై స్వామి పెంచుకున్నారు.
ఆయన అరవింద్ స్వామిని పెంచుకున్న తండ్రి కానీ అరవింద్ స్వామికి సింగం నటుడు డిల్లీ కుమార్ సొంత తండ్రి. ఈ విషయాన్ని అరవింద్ స్వామి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తల్లో ఒకసారి చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఆయన తండ్రి గురించి బయటికి చెప్పనూ లేదు. తండ్రి కొడుకులు కలిసి ఒకే ( Arvind Swamy father Delhi Kumar ) సినిమాలో ఎప్పుడూ నటించడం కూడా జరగలేదు. అరవింద్ స్వామి ఒక్కసారైనా చెప్పడం జరిగింది గాని.. డిల్లీ కుమార్ మాత్రం ఎప్పుడూ అరవింద్ స్వామి తన కొడుకని ఎక్కడ అనౌన్స్ చేయడం జరగలేదు. కానీ ఇన్నాళ్లకు ఢిల్లీ కుమార్ అరవింద్ స్వామి తన సొంత కొడుకుని నోరు విప్పి చెప్పారు.
అరవింద్ స్వామి పుట్టగానే తన చెల్లెలకి దత్తత ఇచ్చానని చెప్పారు. మేమిద్దరం తండ్రి కొడుకులు అయినా కూడా మా ఇద్దరి మధ్యన అలాంటి బంధం లేదని చెప్పారు. మా ఇంటికి ఎప్పుడో అకేషన్ ఉంటే తప్పా.. అరవిందస్వామి వచ్చేవాడు కాదని, వచ్చినా కూడా వెంటనే వెళ్ళిపోయేవాడని.. తనతో పెద్దగా మాట్లాడడని.. మేమిద్దరం కలిసి ఒక ఫోటో తీయించుకున్నది కూడా ఇంతవరకు కనిపించలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఒకసారి అరవింద్ స్వామిని అలా పెంచుకోవడానికి ఇచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరి బంధాన్ని పెంచుకోవడం సరైన పని కాదని ఆలోచించి అలా చేశారేమో మరి.. ఎన్నాళ్ళకు డిల్లీ కుమార్ అరవింద్ స్వామి తన కొడుకే అని చెప్పడమే కాకుండా.. ఏదైనా అవకాశం దొరికితే అరవింద్ స్వామితో కలిసి నటిస్తానని కూడా చెప్పుకొచ్చారు.