Home Cinema Mahesh Babu: ఆఖరికి మహేష్ బాబు కూడా వేణుస్వామి తో దాని కోసం పూజలు చేస్తూ...

Mahesh Babu: ఆఖరికి మహేష్ బాబు కూడా వేణుస్వామి తో దాని కోసం పూజలు చేస్తూ వైరల్ అవుతున్న ఫోటోలు..

mahesh-babu-also-did-puja-under-venu-swamy-direction

Mahesh Babu: గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఒక్కరిలో భక్తి అనేది ఎక్కువగానే పెరుగుతూ వస్తుంది. దానితో పాటు జాతక,దోష నమ్మకాలూ కూడా ఎక్కువ అయ్యాయి. దానికి కారణం మనిషికి భయం పెరిగే కొద్దీ భక్తి పెరుగుతూ ఉంటుందని, ఆశ పెరిగే కొద్దీ భయం పెరుగుతూ ఉంటుందని, ఇలా ఎందరో కామెంట్ చేస్తూ ఉంటారు. ఇందులో ఏది ( Mahesh Babu and Venu Swamy ) నిజమో అందరికీ తెలియదు గానీ.. భక్తి అనేది పెరగడం ఒకరకంగా మంచిదే దాని వల్ల మానవత్వం పెరిగితే ఇంకా మంచిది. ఇటీవల కాలంలో వేణు స్వామి గురించి మనం చాలా ఎక్కువగా వింటున్నాం. ఇతను జాతకాలను చెబుతూ.. సెలబ్రిటీస్ గురించి వాళ్ళ జీవితాల్లో జరగబోయే మార్పులు గురించి ఎన్నో చెప్తూ వస్తూ ఉంటాడు.

See also  Baby Super Hit: మూడు రోజుల నుండి వసూళ్ళ సునామి సృష్టిస్తున్న చిత్రం బేబీ. ఎన్ని కోట్లో తెలుసా.?

mahesh-babu-also-did-puja-under-venu-swamy-direction

వేణు స్వామి అనగానే నాగచైతన్య, సమంత గుర్తుకొస్తారు. వీళ్ళిద్దరూ కచ్చితంగా విడిపోతారని చెప్పడం.. అలాగే విడిపోవడం కూడా జరిగింది. అలాగే ఇతను రష్మిక మందన, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లు వేణు స్వామితో పూజలు చేయించుకున్న తర్వాత వాళ్లకు మంచి కెరీర్ ఉందని కూడా అర్థమవుతుంది. అలాగే వేణు స్వామి చెప్పిన ఇంకా ఎన్నో ( Mahesh Babu and Venu Swamy ) జరుగుతూ వచ్చాయి. ఆదిపురుష్ సినిమా ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అవుతుందని అతను చెప్పినట్టుగానే ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అలాగే ఎందరి గురించో వేణు స్వామి చెప్పినవి జరుగుతూనే రావడంతో.. అతని మీద రోజురోజుకీ చాలామందికి నమ్మకం పెరిగిపోతుంది.

అయితే ఇప్పుడు వేణు స్వామి మహేష్ బాబు గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. మహేష్ బాబు కూడా వేణు స్వామితో కలిసి పూజ చేయించాడని.. అందుకే మహేష్ బాబు కెరీర్ ఒక వెలుగు వెలుగుతుందని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మహేష్ బాబు వేణు స్వామితో పూజలు చేయించుకోవడం ఏంటి అని అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వాటిని మహేష్ బాబు కూడా నమ్ముతున్నాడా అంటూ ( Mahesh Babu and Venu Swamy ) కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలా మహేష్ బాబు గురించి అందరూ అనుకుంటున్న తరుణంలో.. పైగా మహేష్ బాబు వేణు స్వామి అందరిలో పూజ చేస్తున్నట్టు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

See also  Jr. NTR: జూనియర్ ఎన్టీఆర్ బాలయ్యకు మధ్య ఇంత పెద్ద చిచ్చు ఎవ్వరూ ఊహించి ఉండరు..

mahesh-babu-also-did-puja-under-venu-swamy-direction

మహేష్ బాబు వేణు స్వామి తో పూజలు చేయించుకున్నాడు, అందుకే రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడా అని కొందరు అంటుంటే.. మరికొందరు ఇంకెన్నో ప్రశ్నలు. కానీ నిజానికి అసలు మహేష్ బాబు వేణు స్వామితో ఎలాంటి పూజ చేయించుకోలేదు. అలాంటిది ఈ వార్త ఎలా వచ్చింది అంటే మహేష్ బాబు హీరోగా వచ్చిన తర్వాత అందులో వచ్చిన రెండవ సినిమా యువరాజు సినిమా పూజా కార్యక్రమాల సమయంలో.. ఆ పూజ కార్యక్రమాలు చేయించడానికి వేణు స్వామిని పిలిచారు. అందుకని వేణు స్వామి మహేష్ బాబుతో పూజ చేయించారు. ఆ ఫోటో ఇప్పుడు బయటికి రావడంతో.. దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.. అంతే తప్ప మహేష్ బాబు పర్సనల్గా వేణు స్వామితో ఎలాంటి పూజలు చేయించలేదు. కేవలం యువరాజు సినిమా ఓపెనింగ్ కోసం మహేష్ బాబు పూజ చేశారు అంతే..