Home Cinema Anchor Rashmi: సినిమాలలో అవకాశం ఇస్తానని చెప్పి వాడుకుని మోసం చేసారంటూ రష్మీ ఆవేదన వ్యక్తం...

Anchor Rashmi: సినిమాలలో అవకాశం ఇస్తానని చెప్పి వాడుకుని మోసం చేసారంటూ రష్మీ ఆవేదన వ్యక్తం చేసింది.

Rashmi In Films: మన తెలుగు బుల్లి తెర పై ప్రస్తుతం ఉన్న యాంకర్లలో ఒకరిగా కొనసాగుతుంది యాంకర్ రష్మీ.. తన దైన శైలిలో ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది. తన అంద చందాలతో హావ భావాలతో స్టేజి పైన తన మాటలతో యాంకర్ గా అడుగు పెట్టిన తక్కువ సమయంలోనే భారీ క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో అయితే హీరోయిన్లకు సరి సమానంగా మిలియన్ల కొద్ది ఫాలోవర్లను పెంచుకుంటూ పోతుంది. నిత్యం హీరోయిన్లతో పోటీపడుతూ ఘాటు ఘాటు ఫోటోషూట్స్ చేస్తూ ఉంటుంది. ఇక బుల్లి తెర పై ప్రసారమవుతున్న షోలలో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ మొదలైన వాటితో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు ఇతర పలు కార్యక్రమాలకు హోస్టుగా వ్యవహరిస్తుంటుంది.

rashmi-expressed-her-grief-that-she-was-cheated-by-saying-that-she-would-give-her-a-chance-in-films

బుల్లి తెర పై ఎంతగానో ఆరాధిస్తున్న పలు ఈవెంట్లతో తన సినీ కెరియర్ ను సైతం చాలా బిజీ బిజీగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అలా కేవలం బుల్లి తెర పై యాంకర్ గానే కాకుండా అంది వచ్చిన అవకాశాలతో చాలా చిత్రాలలో హీరోయిన్ గా నటించి కాస్త పర్లేదు అనిపించింది. కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేక ఫెయిల్యూర్ గానే మిగిలిపోయింది. ఎన్నో ఆశలతో వెండి తెర పై అడుగు పెట్టింది. కానీ బుల్లి తెర పై మాత్రం స్టార్ ప్లస్ ని సంపాదించుకుంది. ఇక ఇటీవలే రష్మీ బాయ్స్ హాస్టల్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇందులో భాగంగానే రష్మీ ఇంటర్వ్యూలో తనకు వెండి తెర పైన ఎందుకు అవకాశాలు రావడం లేదు అనే విషయం గురించి మాట్లాడింది. అందులో భాగంగా రష్మి మాట్లాడుతూ నాకు సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలో నటించే అవకాశం ఎన్నో వచ్చాయని తెలిపింది.

See also  Jr NTR : ఎన్టీఆర్ ని ఆ సీన్ లో చూసి ఫిదా అయిపోయిన హాలీవుడ్.. నిజంగా ఏం సీన్ రా బాబు..

rashmi-expressed-her-grief-that-she-was-cheated-by-saying-that-she-would-give-her-a-chance-in-films

ఆ విధంగానే పలు చిత్రాల్లో తనకి ఇలాంటి ఆర్టిస్ట్ గా నటించేందుకు అవకాశం వచ్చింది అంటూ రష్మి తెలిపింది. కానీ అనుకున్నట్టుగానే నేను ఆ పాత్రకి ఎంపికయ్యి ఉదయం వెళ్లి సినిమా షూటింగ్లో పాల్గొనే సమయానికి నాకు ఇచ్చిన పాత్రలో మరొకరు ఉండేవారు అంటూ తెలియజేసింది. అలా నేను చేయవలసిన ఎన్నో చిత్రాలలోని పాత్రలు ఇతరులకు అవకాశం కల్పించేవారు దర్శక, నిర్మాతలు అంటూ లక్ష్మి తెలిపింది.. అలా ఎందరో నన్ను అవకాశం ఇలా ఇచ్చినట్టే ఇచ్చి బలి పశువు చేశారు అంటూ వెల్లడించింది. ఆ కారణం చేత నేను వెండి తెర నుంచి అక్కడ సక్సెస్ కాలేకపోయా బుల్లి తెర మీద వచ్చి ఇక్కడైనా సక్సెస్ అవ్వాలని నా కెరియర్ ను ముందుకు సక్సెస్ దిశగా మళ్ళించాలని పట్టుదలతో ఇక్కడికి వచ్చాను. ఇక మీదట ఎప్పటికీ బుల్లి తెర పైనే ఉంటాను. బుల్లి తెరను వదులుకునే ప్రసక్తే లేదంటూ తెలియజేసింది యాంకర్ రష్మీ.

See also  Athulya Ravi: ప్రేమకంటే ముఖ్యమైనది.. పెళ్ళికి ముందు కావాల్సింది, చేసుకోవాల్సింది అదేనంటూ ప్రేమికులకు సలహ ఇస్తున్న హీరోయిన్.

rashmi-expressed-her-grief-that-she-was-cheated-by-saying-that-she-would-give-her-a-chance-in-films

దాంతో ఇంటర్వ్యూలో భాగంగా ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో ఇటు రష్మీ అభిమానులు కాకుండా పలువురు నెటీజన్లు సైతం షేర్ చేయడంతో ఒక్క సారిగా ఆమె మాట్లాడిన ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి. గతంలో సైతం రష్మికి (Rashmi In Films) పలు సినిమాలలో అవకాశాలు వచ్చినప్పటికీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో ఇక పూర్తిగా వెండి తెరకు బాయ్ బాయ్ చెప్పి బుల్లి తెర పైన తన స్థిరపడుతుందని మనకర్థమవుతుంది. ఇక రష్మీ నటించిన గుంటూరు టాకీస్ చిత్రం పర్వాలేదు అనిపించినప్పటికీ ఆ తర్వాత నటించిన చిత్రాలని ఆశించిన స్థాయిలో ఫలితాలు అయితే అందించలేదు. ఏది ఏమైనా రష్మీ తన యాంకర్ జీవితాన్ని మాత్రం వదులుకోవాలని ఖరాకండిగా తేల్చి చెప్పింది.