Balagam : ఏ సినిమా ఎప్పుడు ఎలాంటి హిట్ ని కొడుతుందో ఎవ్వరు చెప్పలేరు. భారీ బడ్జెట్లో తీసిన సినిమాలు బోర్లా పడే రోజులు ఉన్నాయి. అలాగే లో బడ్జెట్ తో తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టులని కొట్టాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటంటే.. సినిమాలో సత్తా ఉండాలి కానీ.. అది ఎంతలో తీసాం ఎలాంటి క్యాస్టింగ్ తో తీసాం ( Balagam and Avatar in the Film Awards ) అనేది కాదు ఇంపార్టెంట్ అని అందరికీ తెలుస్తూనే ఉంటుంది. అందులో ఇప్పటి ఆడియన్స్ సాటిస్ఫై చేయటం అంటే చాలా ట్రిపికల్ గానే ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నెట్ ప్రపంచంలో ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ ని, ఎన్నో రకాల వెబ్ సిరీస్ ని చూస్తూ ఉంటున్నా జనం ఇప్పుడు.
వీళ్ళు అన్నిటిని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉంటే ఏదో ఒక కాన్సెప్ట్ తెచ్చి దాని మీద ఏదో సాదాసీదాగా సినిమా తీస్తే ఆనియన్స్ కు ఎక్కడం లేదు. సినిమాలో ఒక కొత్తదనం, ఒక ఒక రిలీఫ్ – రిలాక్సేషన్ అనిపిస్తేనే ఆ ( Balagam and Avatar in the Film Awards ) సినిమాని ఇష్టపడుతున్నారు. ఆ సినిమా నచ్చితే ఎంత లో బడ్జెట్ సినిమా అయినా కూడా అందలం ఎక్కిస్తున్నారు. అదే ఆడియన్స్ మనసుని ఆకట్టుకోలేకపోతే.. అది ఎంత హై బడ్జెట్ సినిమా అయినా కూడా పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్న సమయంలో అతి తక్కువ బడ్జెట్ తో రిలీజ్ అయ్యి అందరి ఆదరణని పొందిన సినిమా బలగం.
బలగం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకి ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి. ఈ సినిమా చూస్తే మన అనుకునే మనుషుల విలువ, ఆత్మీయతలో వాళ్ళు చనిపోయిన తర్వాత కలిగే బాధ అన్ని కూడా కనిపిస్తాయి.. కనిపించడం మాత్రమే కాకుండా సినిమా చూస్తున్నంత సేపు అందరూ మనసులో ఫీల్ అవుతూనే ఉంటారు. అదే ఈ సినిమా గొప్పతనం. ప్రియదర్శి హీరోగా, కావ్య కళ్యాణ్రామ్ హీరోయిన్ గా, సుధాకర్ రెడ్డి, మురళీధర్( Balagam and Avatar in the Film Awards ) గౌడ్ నటించిన ఈ సినిమాని వేణు యెల్దండి దర్శకత్వం వహించడం జరిగింది. ఈ సినిమాలో సినిమా అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఒకటి ఒక ఎత్తు.. క్లైమాక్స్లో వాళ్ళు క్రియేట్ చేసిన ఒక పాట ఈ సినిమా మొత్తాన్ని హైలెట్ చేసింది.
ఇప్పటికే ఎందరో ప్రశంసలు అందుకొని.. ఎన్నో అవార్డులను అందుకున్న బలగం సినిమా ఇప్పుడు మరొక అవార్డులకు పోటీ పడుతుంది. ఇప్పటికీ ఎన్నో అంతర్జాతీయ అవార్డులో వచ్చాయి. ఇప్పుడు మరొక అవార్డు కోసం ఎదురుచూస్తుంది. ఇంటర్నేషనల్ సౌండ్ అండ్ ఫిల్మ్ మ్యూజిక్ ఫెస్టివల్ లో హాలీవుడ్ సినిమాతో బలగం పోటీ పడుతుంది. బలగం సినిమాని బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ఫీచర్ విభాగంలో నామినేషన్ సొంతం చేసుకుంది. ఈ ఫెస్టివల్ లో 82 దేశాల నుంచి 1074 సినిమాలు వివిధ విభాగాల్లో పోటీ పడుతున్నాయి. అక్టోబర్ 14వ తేదీన లో జరిగే ఈవెంట్లో.. ఇందులో విన్నర్ ఎవరో తెలుస్తుంది. ఒకవేళ బలగం ఈ అవార్డును కూడా ఆకట్టుకుంది అంటే అవతార్ సినిమాలతో కూడా పోటీ పడినట్టే.