Raksha Bandhan : ఆడ, మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఆనందంగా ఎదురుచూసే వేడుక రక్షాబంధన్. ఒకే తల్లి కడుపున పుట్టిన బిడ్డలు ఎంత ఆనందంగా చేసుకుంటారో ఈ వేడుకని.. అలాగే ( Raksha Bandhan follow these tips ) ఎక్కడెక్కడో పుట్టిన వాళ్లు కూడా అన్నా చెల్లెలుగా, అక్కా తమ్ముళ్లుగా బంధం కలిస్తే అంతకంటే గొప్పగా ఆనందంగా చేసుకునే వేడుక ఇది. కులమత బేధాలు లేకుండా అందరూ ఆనందంగా చేసుకునే ఈ వేడుక కోసం ఏడాది అంతా ఆడపిల్లలు, మగపిల్లలు కూడా వాళ్ళ సోదరీ సోదరీమణులతో రాఖీ కట్టించుకునే వాళ్ళు, కట్టే వాళ్ళు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు.
2023 సంవత్సరంలో రాఖీ పండుగ దగ్గరికి వచ్చేస్తుంది. ఇక కేవలం రెండు రోజుల్లో ఈ పండుగ ముందుంది. అయితే ఈ ఏడాది అందరికీ ఒక అనుమానం మొదలైంది. ఆగస్టు 30వ తేదీని రాఖీ పండుగ? లేదా 31వ తేదీన? ఏ రోజు అన్నదమ్ములకు రాఖీ కట్టుకోవాలి అనే ఆలోచనలో పడ్డారు.దానికి కారణం ఆగస్టు 30వ తేదీన ( Raksha Bandhan follow these tips ) భద్రకాలం ఉండడం వలన ఏ రోజు కట్టాలి అనేది ఎవరికి అర్థం కావడం లేదు. అంతేకాకుండా రాఖీ పండుగ అనగానే ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తారో.. ఈ వేడుక విషయంలో ఎన్నో ప్రశ్నలు కూడా అందరిలో ఉంటాయి. అలాంటి కొన్ని ప్రశ్నలకి ఇక్కడ కొందరు పండితులు సమాధానమిచ్చారు.
ఏ అనుమామైనా శాస్త్రం ప్రకారం అనుమానం కలిగితే.. దాన్ని పండితులు తీరుస్తేనే మనకు ఆనందంగా ఉంటుంది.మనలో మనం ఏదో అనుకుని ఏదో చేస్తే.. ఏం జరుగుతుందో అనే భయం ఉంటుంది. అందుకే ఏ చిన్న అనుమానం ఉన్న అందరూ కూడా పండితుల దగ్గరికి వెళ్తారు. ఈ పని ఎలా చేయాలి? ఇది చేయొచ్చా ? చేయకూడదా? చేస్తే ఏం జరుగుతుంది? చేయకుండా ఉంటే ఏం జరుగుతుంది అని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. పాపం ( Raksha Bandhan follow these tips ) పండితులు సామాన్యులకు కలిగే ప్రతి అనుమానానికి సమాధానం చెబుతూ సహనంగా ఉంటారు. అందుకే వాళ్ళని పండితులను అంటారు రాఖీ విషయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం.
రాఖీ కట్టేటప్పుడు సోదరడు ముఖం తూర్పు దిశగా ఉండాలి. మరోవైపు రాఖీ కట్టే సోదరి పడమర లేదా ఉత్తరం వైపుగా ఉండాలి. ఈ సమయంలో ఇద్దరికీ దక్షిణం వైపు ఎదురుగా ఉండకూడదు. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి నాడు రాఖీ పండుగను జరుపుకోవాలి. అలాగే ఈ రాఖీ కట్టిన తర్వాత వెంటనే తీసేయకూడదు. అలానే ఎక్కువ కాలం కూడా ఉంచుకోకూడదు. రాఖీని కట్టేటప్పుడు ఎంత పవిత్రమైన రోజు చూసుకొని కడుతున్నామో.. అలాగే అది తీసేటప్పుడు కూడా పవిత్రమైన రోజు చూసుకొని తీయాలి. రాఖీని ఎక్కడబడితే అక్కడ వదిలేయకూడదు. దాన్ని ఒక ఎర్రని గుడ్డలో కట్టి దేవుడు మూల పెట్టుకోవాలి. ఈ ఏడాది ఆగస్టు 30న ఉదయం గం.10. 12 ని.. లకు పౌర్ణమి ప్రారంభం గాక.. ఆగస్టు 31న ఉదయం 7:45 గంటలకు ముగుస్తుంది. అయితే ఆగస్టు 30న పూర్ణిమ తో పాటు భద్ర కూడా స్టార్ట్ అవుతుంది. భద్రలో రాఖి కట్టడం శ్రేయస్కరం కాదు. ఇది తోబట్టులకు వయసు తగ్గిస్తుంది. ఈరోజు భద్ర రాత్రి గం. 8. 58 ని.. వరకు ఉంటుంది. రాత్రిపూట రాఖీ కట్టరు. అందుకే ఆగస్టు 31న రక్షాబంధన్ జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.