Home Cinema Ram Charan: ఎన్టీఆర్ నుండి అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని లాగేసుకుంటానంటున్న చరణ్. మరేంటి...

Ram Charan: ఎన్టీఆర్ నుండి అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని లాగేసుకుంటానంటున్న చరణ్. మరేంటి ఇంతకు అది.?

Ram Charan NTR: ఇటు నందమూరి కుటుంబం నుండి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమంలోకి అడుగు పెట్టినటువంటి రామ్ చరణ్.. ఇక వీళ్ళు ఇద్దరూ ఆయా కుటుంబాల ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకువెళ్లారనే చెప్పాలి. ఆ విషయం మనందరికీ తెలిసిందే.. ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా వీళ్ళిద్దరూ గుర్తింపు తెచ్చుకున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే.. దర్శకధీరుడు రాజమౌళి తరికెక్కించినటువంటి ఈ చిత్రం ఎన్నో రకాలైనటువంటి రికార్డులను కొల్లగొట్టింది. పైగా దేశ వ్యాప్తంగా వసూళ్ల సునామీని సృష్టించింది. చివరగా ఆస్కార్ అవార్డు సైతం కైవసం చేసుకుంది. అయితే మనందరికీ తెలియని విషయం ఏంటంటే..

ram-charan-says-that-if-an-opportunity-comes-from-ntr-he-will-definitely-grab-it

ఈ చిత్రంతోనే ఎన్టీఆర్ రామ్ చరణ్ లు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారని అంతా అనుకున్నారు. కానీ ఆర్ ఆర్ ఆర్ చిత్రం కంటే ముందే ఎన్టీఆర్ రామ్ చరణ్ మధ్య ఎంతో సాన్నిహిత్యమైన స్నేహబంధం కొనసాగుతూ మంచి అనుభందం ఉంది. ఇక ఎన్నో ఏళ్లుగా మన ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ వర్సెస్ నందమూరి ఫ్యామిలీ అన్నట్లుగా పోటాపోటీగా సినిమాలు విడుదల అవుతూనే వస్తూ ఉన్నాయి. ఇక ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చ గడ్డి వేసిన సరే రగులుకునే అంత పగలు సైతం ఉన్నాయంటూ ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. కానీ ఎన్టీఆర్ చరణ్ లు ఈ ప్రచారానికి పూర్తిగా నాంది పలికారు. నిజ జీవితంలో వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం మన తెలుగు చిత్ర పరిశ్రమ లో ఏ ఇద్దరు హీరోల మధ్య నేనే లేదని నిరూపించేశారు. పైగా ఆర్ ఆర్ ఆర్ చిత్రం తర్వాత వీళ్ళిద్దరి మధ్య అనుబంధం మరింత రెట్టింపు అవ్వ సాగింది.

See also  Upasana : మనవరాలి మీద ప్రేమతో కూతురిని ఏడిపించిన ఉపాసన తల్లి!

ram-charan-says-that-if-an-opportunity-comes-from-ntr-he-will-definitely-grab-it

మరి ముఖ్యంగా చెప్పాలంటే.. ఎన్టీఆర్ కి ఉన్న ఎనర్జీ లెవెల్స్ ని రామ్ చరణ్ ఎంతగానో లైక్ చేస్తాడంట. గతంలో ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయాన్ని మనందరికీ స్వయంగా రాంచరణ్ వెల్లడించాడు. పైగా ఎన్టీఆర్ ని చాలా ఎత్తుకు పొగిడేస్తూ ఆయనలో అంతులేని ఎనర్జీ ఉందని అది ఎక్కడినుండి వస్తుందో కూడా నాకు అర్థం కావడం లేదని అతనిలో ఉన్నంత ఎనర్జీ నాలో లేనే లేదని అవకాశం వస్తే కచ్చితంగా ఎన్టీఆర్ నుండి ఆయన నేను అప్పుగా ఆయిన లాగేసుకోవడానికి సిద్ధపడతానంటూ రామ్ చరణ్ ఇంటర్వ్యూలో భాగంగా తెలిపాడు. (Ram Charan NTR)

See also  Upasana : బిడ్డ పుట్టాక చిరు సురేఖల గురించి సంచలన నిర్ణయం తీసుకున్న ఉపాసన!

ram-charan-says-that-if-an-opportunity-comes-from-ntr-he-will-definitely-grab-it

ఇక రామ్ చరణ్ అప్పట్లో చేసిన ఈ వాక్యాలు చాలా వైరల్ అవ్వ సాగాయి. కాగా మరి ఇప్పుడు ఏమైందని మీరు ప్రశ్న వేయవచ్చు.? కానీ మరోసారి కూడా ఈ వార్తలు నందమూరి అభిమానులు కాకుండా అటు మెగా అభిమానులు కూడా షేర్ చేయ సాగారు. ప్రస్తుతమైతే ఇటు జూనియర్ ఎన్టీఆర్ అటు రామ్ చరణ్ ఇద్దరూ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తూ తన అభిమానులనే కాకుండా సినీ ప్రేక్షకులను సైతం ఎంతగానో అలరింప చేస్తూ ఊరించేస్తున్నారు. కాగా ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తుంటే.. రామ్ చరణ్ శంకర్ తో గేమ్ చేంజర్ సినిమాను పట్టాలెక్కించేశాడు. ఇక ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా వచ్చే సంవత్సరం మొదట్లో విడుదలకు సిద్ధమవుతాయని మనకు తెలుస్తుంది.