Home Cinema Chiranjeevi : చిరంజీవికి కొడుకు రామ్ చరణ్ కన్నా ఆ హీరో అంటే చాలా ఇష్టం...

Chiranjeevi : చిరంజీవికి కొడుకు రామ్ చరణ్ కన్నా ఆ హీరో అంటే చాలా ఇష్టం అట..

Chiranjeevi : టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహించడం లో మెగాస్టార్ చిరంజీవి ని మించినవాడు ఇండస్ట్రీ లో ఎవ్వరూ లేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన జెనరేషన్ హీరోలైనా కూడా తన మనసుకు నచ్చితే మనస్ఫూర్తిగా ఆ హీరోని పొగడడం చిరంజీవి కి మొదటి నుండి అలవాటు. అలా బాలకృష్ణ, నాగార్జున , వెంకటేష్ తదితరులను ఎన్నో సార్లు బహిరంగంగా మెచ్చుకున్నా సందర్భాలు ఉన్నాయి(Chiranjeevi favourite actor). చిరంజీవి కేవలం తన సమకాలీన హీరోతోనే కాదు,నేటి తరం హీరోలతో కూడా ఒక రేంజ్ లో పోటీ పడిన సంగతి అందరికీ తెలిసిందే.

chiranjeevi-favourite-actor

ఆయనకీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు ఎలాంటి పోటీ ఇచ్చారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యూత్ లో పవన్ కళ్యాణ్, మాస్ లో ఎన్టీఆర్ చిరంజీవి కి విపరీతమైన పోటీని ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఆయన తమ్ముడు కాబట్టి ఆయనని పొగడడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ని కూడా పొగడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో నేటి తరం హీరోలలో తనకి బాగా ఇష్టమైన హీరో జూనియర్ ఎన్టీఆర్ అని విలేఖరి అడిగిన ఒక ప్రశ్నకి మెగాస్టార్ చిరంజీవి సమాధానం చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

See also  Tarun - Aarthi Agarwal: తరుణ్ ఆర్తీ అగర్వాల్ లు ప్రేమలో పడడానికి కారణం ఆ స్టార్ హీరోనా.?

chiranjeevi-ntr

ఈ తరం హీరోలందరూ చాలా అద్భుతంగా నటిస్తున్నారని, కానీ మా కుటుంబ సభ్యులలో కాకుండా నాకు బయట హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ నటన బాగా నచ్చుతుందని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు(Chiranjeevi favourite actor). ఎన్టీఆర్ లాగ స్పష్టం గా తెలుగు మాట్లాడుతూ డైలాగ్స్ చెప్పే హీరో నేటి తరం లో ఎవ్వరూ లేరని, అతని డైలాగ్ డిక్షన్ నాకు ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఈ విషయాన్నీ చిరంజీవి అనేక సార్లు జూనియర్ ఎన్టీఆర్ కి కూడా చెప్పాడట.

See also  Rajinikanth: ఆ స్టార్ హీరోయిన్ పై ఆశపడ్డ సూపర్ స్టార్ రజినీకాంత్.. పెళ్ళి అయ్యాకకూడా..

ntr

మా అబ్బాయి నటన కంటే నీ నటనే ఎక్కువ ఇష్టపడతానని, నీ డైలాగ్ డెలివరీ బాగా నచ్చుతుంది అంటూ అనేక సార్లు ఎన్టీఆర్ కి తెలిపాడట. ఎన్టీఆర్ కూడా చ్చిరంజీవి మాటలకు ఎంతో సంతోషించేవాడని టాక్. ఈ విషయాన్నీ తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా లో చిరంజీవి కి కృతఙ్ఞతలు తెలియచేసారు. రామ్ చరణ్ మొన్నటి దాకా సినిమాల నుండి విరామం తీసుకుని కూతురితో ఆడుకుని, కొద్దీ సమయం ఫ్యామిలీతో గడిపి సినిమా షూటింగ్ కి తిరిగి వచ్చాడు. వచ్చిన కొద్దిరోజులకే గేమ్‌ ఛేంజర్‌ సినిమా ఆగిపోయింది, కారణమ్ ఏంటో తెలియక ఫాన్స్ ఏవేవో ఉహించుకుంటున్నారు.