Bhola Shankar : ఇప్పుడు జనాలు ప్రతి విషయంలో చాలా క్లియర్ గా ఉన్నారు. ఈ మాత్రం తమకి కాస్త నచ్చకపోయినా నిర్దాక్ష్యంగా పక్కన పడేస్తున్నారు. మొహమాటం లేదు, అస్సలు కాంపర్మైజ్ కూడా అస్సలు కావడం లేదు. కాబట్టీ ( Chiranjeevi about his movie Bholashankar movie ) జనాల నుండి మనీ collect చేస్తున్నప్పుడు అది ఎంత బ్రాండ్ అయినా సరే ఖచ్చితంగా నాణ్యమైనది అయిండాలి, ఈ మాత్రం నాణ్యత లోపించిన నెగెటివ్ ప్రచారం అత్యంత వేగంగా స్ప్రెడ్ అవుతుంది.. సినిమాల విషయంలో అయితే మరీ వేగంగా ఉంది , దీనికి ప్రధాన కారణం థియేటర్స్ లో విపరీతంగా పెరిగిన టికెట్ రేట్లు, వాటితో పాటు కూల్ డ్రింక్స్, వాటర్, తినుబండారాల రేట్లు సామాన్యులకి అందుబాటులో లేకపోవడం , 10 నుండి నెలరోజుల్లో ఏదో ఒక OTT ప్రసారం అవుతుండటంతో జనాలు అనవసరంగా చెత్త సినిమాల కోసం వందలకి వందలు తగలేసే పరిస్థితి లేదు.
ఆకోవలోకి ఈ మధ్య పెద్ద సినిమాలు , పెద్ద హీరో, డైరెక్టర్ సినిమాలు కూడా మరీ నాసిరకంగా ఉన్నాయి. ఇక్కడ మరీ కామెడీ ఏమిటంటే పక్క రాష్ట్రంలో , వేరే భాషలో రిలీజ్ అయ్యి, అద్భుతమైన విజయాల్ని అందించిన సినిమాలు సైతం ( Chiranjeevi about his movie Bholashankar movie ) తెలుగులో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. అంతెందుకు బ్రో సినిమాని తీసుకుంటే తమిళ్ లో అతి తక్కువ బడ్జట్ తో పెద్దగా పేరు లేని యాక్టర్స్ తో సినిమా తీస్తే అద్భుతమైన విజయం సాధించింది. మన తెలుగులో పెద్ద పెద్ద హీరోలు, పెద్ద బడ్జట్, అదిరిపోయే ప్రచార ఆర్భాటాలు… వెరసి మూడో రోజు ఆసినిమాని ఫ్రీగా చూపిస్తామన్నా చూసే వాడు లేకుండా పోయాడు.
మెగాస్టార్ అంటే క్రేజ్ ఏరేంజిలో ఉంటుందో ఎవరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి మెగాస్టార్ కొరటాల కాంబినేషన్లో ఆచార్య వచ్చింది, బేసిక్ గా కొరటాలకి ఫ్లాప్ లేదు, ఖచ్చింతగా మినిమం గ్యారెంటీ ఉన్న సినిమా ( Chiranjeevi about his movie Bholashankar movie ) తీస్తాడనే నమ్మకం ఉన్న సూపర్ డూపర్ కాంబినేషన్స్ సెట్ చేసినా సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ సినిమా విషయంలో అందరూ కొరటాలనే తప్పు పట్టారు, చిరంజీవి, చరణ్ కాంబినేషన్ లో కొరటాలకి మంచి అవకాశం ఇస్తే చెడగొట్టారని అందరూ కొరటాలనే తప్పు పట్టారు.
కానీ భోళా విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ చిరంజీవిని మాత్రమే తప్పు పడుతున్నారు. దానికి కారణం లేకపోలేదు, ఒక రీమేకు తీసేటప్పుడు మినిమం జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా??? వందలు, వేలు ఖర్చు పెట్టుకుని ఫామిలీ నో , ఫ్రెండ్స్ నో తీసుకుని థియేటర్ కి వెళితే.. కనీసం సినిమా పూర్తి అయ్యేవరకు సీట్లో కుర్చూ పెట్టలేకపోతే.. ఇంతకంటే అవమానం ఏంటి అని మెగాస్టార్ ఫ్రెండ్స్ డైరెక్ట్ గా సోషల్ మీడియాలో తిట్టేస్తున్నారు. ఇంక మీదైనా కథ మీద, కథనం మీద దృష్టి పెట్టి మంచి సినిమాలు తీయాలని, దొరక్కపోతే కామ్ గా ఉండాలని చిరంజీవి కి ఉచ్ఛిత సలహాలు ఇస్తున్నారు చిరంజీవి అభిమానులు.