Home Cinema Sridevi: శ్రీదేవికి కొన్ని కోరికలు తీరకుండానే వెళ్ళిపోయింది.. వాటి లిస్ట్ ఇదే..

Sridevi: శ్రీదేవికి కొన్ని కోరికలు తీరకుండానే వెళ్ళిపోయింది.. వాటి లిస్ట్ ఇదే..

these-wishes-were-not-fulfilled-until-sridevi-death

Sridevi: అతిలోక సుందరి శ్రీదేవి అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఇష్టమే. అందం అంటే మొదటగా గుర్తొచ్చేది శ్రీదేవి. అందుకే ఆమెను అతిలోకసుందరి అని అంటారు. మూడు తరాల వారితో ఎంతో హుషారుగా నటించిన హీరోయిన్ శ్రీదేవి. ఆమె ప్రతి పాత్రలో అందం అభినయంతో పాటు నటనతో ఎంతో అద్భుతంగా ఆకట్టుకుంటుంది. సీతాకోకచిలుక ( Sridevi wishes were not fulfill ) లాంటి అమాయకపుతో నటనతో మనుషుల గుండెల్లో నిలబడిపోయింది. అలాంటి శ్రీదేవి అంత తొందరగా అందరినీ వదిలి వెళ్ళడం ఎందరికో బాధను కలిగించింది. ఈరోజు శ్రీదేవి పుట్టినరోజు అవడం వలన ఆమె జ్ఞాపకాలను అందరూ గుర్తు చేసుకొని ఆమెను తలుచుకుంటున్నారు.

these-wishes-were-not-fulfilled-until-sridevi-death

శ్రీదేవి కెరీర్ పరంగా తెలుగులో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి.. ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా ఆమె ఒక వెలుగు విరిగింది. కెరీర్ పరంగా ఆవిడ ఎంత సక్సెస్ అయినా కూడా.. పర్సనల్ లైఫ్ లో ఆమె చాలా కష్టాలు అనుభవించింది. చిన్న వయసులోనే సినిమా రంగంలో అడుగుపెట్టి, చిన్న వయసులోనే ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతూ సంపాదించి ( Sridevi wishes were not fulfill ) కుటుంబానికే పెట్టేది. ఎదిగిన కొద్ది కుటుంబ భారం అంతా ఆవిడదే అయింది. ఇన్ని చేసిన ఆమె పెళ్లి విషయంలో కూడా చాలా తప్పులు చేసింది. అందుకే ఆమె జీవితం అలా అయిపోయింది అని అందరూ అంటారు. శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని ఎందరో స్టార్ హీరోలు కోరుకున్నా కూడా ఆమె చివరికి ఎన్నుకున్న విధానం చాలా బాధాకరమైన రిజల్ట్ నే ఇచ్చింది.

See also  Dhanush - Aishwarya: రజనీకాంత్ కూతురు ధనుష్ ను పెళ్ళి చేసుకుంది ఆ స్టార్ హీరో పై పగ తీర్చుకోవడం కోసమేనా.?

these-wishes-were-not-fulfilled-until-sridevi-death

శ్రీదేవికి చనిపోయే వరకు కొన్ని కోరికలు తీరకుండానే ఉండిపోయాయంట. ఆ కోరికలు తీరకుండా ఆమె వెళ్ళిపోయిందని ఆమె అభిమానులకు ఎంతో బాధగా ఉంది. శ్రీదేవి అలా సడన్గా చనిపోతుందని ఎవరు ఊహించలేదు. ఆమె కూడా ఊహించలేదు. ఆమె మరణం వెనుక ఉన్న మిస్టరీ ఇంతవరకు ఏమీ తెలియలేదు. ఆమె మరణం పై అందరికి ఎన్నో అనుమానాలు, అవన్నీ పక్కన పెడితే.. శ్రీదేవి కొన్ని కోరికలు తీరకుండానే చనిపోయింది అనుకున్న ( Sridevi wishes were not fulfill ) వాటిలో మొదటి కోరిక.. ఆమె కూతురు జాన్వికపూర్ ని హీరోయిన్గా వెండి తెర మీద చూడాలని.. చూసి ఆనందాన్ని అనుభవించాలని ఆవిడ ఎంతగానో ఆశపడింది. దగ్గరుండి ఏ సినిమాల్లో నటిస్తే బాగుంటుందో చూసుకొని మొదటి సినిమాని సెలెక్ట్ కూడా చేసింది. కానీ దురదృష్టం ఆ కోరిక తీరకుండానే ఆమె వెళ్లిపోయింది.

See also  Pushpa 2 : పుష్ప 2 గురించి ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ లో ఇదే పండగలాంటి వార్త.

these-wishes-were-not-fulfilled-until-sridevi-death

అలాగే శ్రీదేవి తెలుగు సినిమా ఇండస్ట్రీకి బాగా చేరువైన మనిషి. ఆమె కెరీర్ ఇక్కడ మొదలుపెట్టి తెలుగులో ఎన్నో సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగు పెట్టింది. తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలోనే 24 సినిమాలు చేసింది. అయితే ఆ తర్వాత ఆమె బాలీవుడ్ లో బాగా బిజీ అయిపోయిన తర్వాత.. సినిమాలకు కూడా దూరమైన తర్వాత.. కొంతకాలం ఆమె రాఘవేంద్ర తో 25వ సినిమా చేయాలని చాలా కోరికగా ఉండేది అంట. దాంతో సిల్వర్ జూబ్లీ అవుతుందని అనుకునేదంట. కానీ ఆ 25వ సినిమా చేసే అవకాశం రాకముందే ఆమె కన్నుమూసేసింది. ఇలా ఆమె జీవితంలో కొన్ని కోరికలు తీరకుండానే, ఆమెకు తెలియకుండానే, ఊహించకుండానే అతి తొందరగా వెళ్ళిపోయిందని బాధగా ఉంది. ఈరోజుతో శ్రీదేవికి 60 వ పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానులందరూ ఆమెను ఒక్కసారి స్మరిస్తూ గుర్తు చేసుకుంటున్నారు..