Home Cinema Bunny BRS: రాజకీయాల్లోకి రానున్న బన్నీ. బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగనున్నాడు.

Bunny BRS: రాజకీయాల్లోకి రానున్న బన్నీ. బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగనున్నాడు.

Bunny BRS: పుష్ప చిత్రం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం తెలుగు రాష్ట్రాలనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో విపరీతంగా పెరిగిపోవడంతో ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ కూడా కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుతం పుష్ప 2 సెట్స్ మీద చాలా బిజీ బిజీగా తన షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్నాడు అల్లు అర్జున్. ఇక మన తెలుగు రాష్ట్రాలలో అల్లు అర్జున్ ఎంతటి భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా తెలియజేయడం అవసరమే లేదు. అయితే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడనే ప్రచారం నెట్టింట జోరుగా జరుగుతుంది. మరి ఏ పార్టీ నుండి బన్నీ ప్రచారం చేయబోతున్నాడో తెలుసా.?

See also  Rashmika: సుకుమార్ ను బ్లాక్మెయిల్ చేస్తున్న రష్మిక. ఆ స్టార్ హీరోయిన్ తో అలా చేస్తుండగా వీడియో తీసి మరి..

bunny-who-is-about-to-enter-politics-will-enter-the-ring-on-behalf-of-brs

సరే ఆ విషయాలన్నీ తెలుసుకుందాం పదండీ.. ఐతే ఇలా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రచారం చేయడం ఇది కొత్తేమీ కాదు. గతంలో చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ తరఫున అల్లు అర్జున్ మద్దతు కూడా ప్రకటించాడు. అయితే ప్రస్తుతం బన్నీ భార్య స్నేహా రెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చాలా చురుగ్గా ఉన్నారు కాదా.. దాంతో మామ కోసం అల్లు అర్జున్ సైతం ప్రచారంలో (Bunny BRS) పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడట. కంచర్ల చంద్ర శేఖర్ రెడ్డి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడిగా రాజకీయాల్లో ప్రస్తుతం చురుగ్గా పనిచేస్తున్నారు . నల్గొండ జిల్లాలోని పెద్దావూర మండలం చింత పల్లి గ్రామం చంద్ర శేఖర్ రెడ్డి గారి స్వస్థలం..

See also  Tamanna: డబ్బు కోసం అలాంటి నీచమైన పని చేస్తున్న తమన్నా.. దుమ్మెత్తిపోస్తున్న అభిమానులు..

bunny-who-is-about-to-enter-politics-will-enter-the-ring-on-behalf-of-brs

అయితే 2014 సంవత్సరంలో రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి టిఆర్ఎస్ పార్టీతో బరిలోకి దిగి పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యాడు. కాగా ఆ సమయం లో సైతం మామకు మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేసినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. అయితే ప్రస్తుతం ఎలక్షన్ లు సమీపిస్తున్న తరుణం లో మళ్లీ కంచర్ల చంద్ర శేఖర్ రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బానే గ్రౌండ్ వర్క్ మొత్తం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది.  ఇక ఈ సారి నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అందుకోసమే కంచర్ల ఫౌండేషన్ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు ఇప్పటికే ఉధృతం చేశాడు.

See also  Samantha: అప్పుడు రష్మిక తో స్విమ్మింగ్ పూల్ లో ఇప్పుడు సమంతతో విజయ్ దేవరకొండ.. మీకు అర్దమవుతుందా.?

bunny-who-is-about-to-enter-politics-will-enter-the-ring-on-behalf-of-brs

ఈ నెల 19వ తారీఖు నుండి ఆ నియోజకవర్గంలో పలు యాక్టివిటీస్ ను పెంచాలని సిద్ధమయ్యారట. కాగా అందులో భాగంగానే పెద్దావూర సమీపంలోని ముసలమ్మ చెట్టు వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రంలోని నిర్మించినటువంటి తన ఆఫీసు ఫంక్షన్ హాల్ ప్రారంభించేందుకు అల్లు అర్జున్ అక్కడికి రాబోతున్నారట. ఆ కారణంగానే దాదాపు పదివేల మందితో భారీ సభను ఏర్పాటు చేయాలని చంద్ర శేఖర్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారట. మరి ఈ సారైనా బన్నీ మామకు కేసీఆర్ టికెట్ ప్రసాదించి తన అదృష్టం పరీక్షించేలా చూస్తాడా. మరి బన్నీ ప్రచారం ప్రచారంలో దిగితే రిజల్ట్స్ ఎలా ఉంటుందనేది ప్రస్తుతం పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారుతున్న విషయం..