Home Cinema Chiranjeevi : ఈ ఫోటో వెనుక చాలా పెద్ద స్టోరీనే ఉంది..

Chiranjeevi : ఈ ఫోటో వెనుక చాలా పెద్ద స్టోరీనే ఉంది..

chiranjeevi-with-three-heroines-in-magadheerudu-movie-shooting-spot

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఎంత హుషారుగా డాన్స్ చేస్తూ, ఫైట్స్ చేస్తూ ఉంటారో.. అలాగే సినిమా షూటింగ్స్ స్పర్ట్ లో కూడా అందరితో అంతే సరదాగా ఉంటాడు. ఆ రోజుల్లో ఆయనతో నటించిన ప్రతి హీరోయిన్ కూడా ( Chiranjeevi with three heroines ) చిరంజీవి అంటే పడి చచ్చిపోయేవారు. ఎందుకంటే ఆయన వాళ్లతో అంత చనువుగా, ఆనందంగా, వాళ్ళకంతాగా యాక్సెస్ ఇస్తూ.. మంచి స్నేహితుడిగా ఉండేవారు. అలాగే కొంతమంది దర్శకులు, నిర్మాతలు కూడా చిరంజీవితో చాలా మంచి ప్రయాణం చేసేవారు. చిరంజీవి వలన ఎందరో చాలా సంపాదించుకున్నారు. చిరంజీవి కూడా వాళ్ళతో ముందుకు సాగి కెరీర్ లో చాలా సక్సెస్ సాధించారు.

chiranjeevi-with-three-heroines-in-magadheerudu-movie-shooting-spot

విజయ్ బాపినీడు దర్శకత్వంలో.. చిరంజీవి ఆరు సినిమాల నటించారు. అందులో లాస్ట్ సినిమా బిగ్ బాస్ సినిమా తప్పా.. మిగిలిన అన్ని సినిమాలు కూడా హిట్ అయ్యాయి. విజయబాపినీడు దర్శకత్వంలోనే 1986లో ( Chiranjeevi with three heroines ) మగధీరుడు సినిమా విడుదలైంది. ఈ సినిమాని శ్యాం ప్రసాద్ నిర్మించగా.. ఈ సినిమా కుటుంబ కథా చిత్రంగా రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ఆయన సరసన జయసుధ హీరోయిన్గా నటించింది. జయసుధ కేవలం ఒకే ఒక్క సినిమా చిరంజీవితో కలిసి ఈ సినిమాలో నటించింది. ఈ సినిమాలో చిరంజీవి, జయసుధ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సినిమా కథ, వాళ్ళిద్దరి నటన, కుటుంబం గురించి వాళ్లు పడే కష్టాలు అన్నీ కూడా చాలా చక్కగా కుదిరాయి.

See also  Project K : వామ్మో ప్రభాస్ సినిమా ప్రాజెక్ట్ కె లో ఈ సీన్ వీడియో చూస్తే.. ఒక్కసారి లుక్కెయ్యండి మీకే తెలుస్తాది..

chiranjeevi-with-three-heroines-in-magadheerudu-movie-shooting-spot

అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో హీరోయిన్ జయసుధ ఆ స్పాట్ లో ఉండడం సహజమే. అయితే ఆ పక్కనే సుహాసిని కూడా ప్రెసిడెంట్ గారి అబ్బాయి సినిమా షూటింగ్ కోసం ఉంది. ఆ పక్కనే షూటింగ్ స్పాట్ లో చిరంజీవి ఉన్నారని తెలిసి.. సుహాసిని ఫ్రీ టైం లో అక్కడికి వెళ్లి.. చిరంజీవిని, జయసుధని కలిసింది. అలాగే చిరంజీవి ( Chiranjeevi with three heroines ) షూటింగ్ జరుగుతుందన్న విషయం తెలిసి సుమలత కూడా చిరంజీవిని ఒకసారి చూద్దామని ఆ షూటింగ్స్ స్పాట్ కి వెళ్ళింది. అలా ఈ ముగ్గురు హీరోయిన్స్ చిరంజీవిని ఒకేసారి అక్కడ చూడడం జరిగింది. ఇక ముగ్గురు హీరోయిన్స్ తో చిరంజీవి.. పైగా మంచి ఫేమ్ లో ఉన్న టైంలో.. వీళ్ళ ముగ్గురు చిరంజీవితో ఎంత అల్లరి చేశారో.. చిరంజీవి వాళ్ళతో ఎంత చనువుగా, చిన్నపిల్లాడిలాగా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి.

See also  Upasana : టెన్షన్ లో రామ్ చరణ్.. హాస్పిటల్ లో ఉపాసనా!

chiranjeevi-with-three-heroines-in-magadheerudu-movie-shooting-spot

ఈ ముగ్గురు హీరోయిన్స్ కలిపి చిరంజీవిని ఏదో ఏడిపించారంట. వాళ్ళకి కావాల్సింది ఏదో అడిగితే చిరంజీవి చక్కగా తప్పించుకుని.. వాళ్లని నొప్పించకుండా.. అవుననకుండా, కాదనకుండా తప్పించుకున్నాడు అంట. దానితో వీళ్ళు ముగ్గురు కలిసి ఎంత గట్టిోడు? ఎంత మొండోడు అనుకుంటూ వెనకనుంచి వెక్కిరిస్తున్నారంట. ఇలా వీళ్ళు సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఈ మూమెంట్ ని.. అక్కడ ఉన్న కెమెరా మాన్ ఒక్కసారిగా క్లిక్ మని ఫోటో తీసి పెట్టాడు. దాన్ని ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత అభిమానులు చూసి చాలా ఆనంద పడుతున్నారు. ఇలాంటి ఫొటోస్ వాళ్ళ మధ్యలో ఉన్న అనుబంధాల్ని తెలియజేస్తాయి. చిరంజీవి నిజంగా కృషి పట్టుదలతో పైకి రావ డమే కాకుండా.. లైఫ్ ని ప్రశాంతంగా నవ్వుతూ ఎంజాయ్ చేయడం కూడా తెలిసిన వ్యక్తి..