తల్లిదండ్రులు పిల్లల ముందు అసలు చేయకూడని పనులు
Childrens:
సాధారణంగా భార్యాభర్తలు చిన్నచిన్న కారణాల వల్ల గొడవలు పడుతుంటారు అలా ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా విపరీతంగా కొట్టుకుంటూ తిట్టుకుంటారు ఇలా చేయడం వల్ల చిన్నతనం నుంచే పిల్లలకి అది అలవాటైపోతుంది కనుక పిల్లల ముందు అలా చేయొద్దు.
ఇంట్లో పిల్లల ముందు తల్లిదండ్రులు చేయకూడని పనులు
పిల్లలను చిన్నతనం నుంచి క్రమశిక్షణతో పెంచాలి మరి తల్లిదండ్రులే ఇంట్లో పిల్లల ముందు క్రమశిక్షణతో ప్రవర్తించకపోతే పిల్లలు అలాగే తయారవుతారు.
ఏదైనా తల్లిదండ్రుల నుంచి మొదట నేర్చుకునేది పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువులు.
చాలామంది భార్య భర్తలు, భార్య భర్త విషయంలో భర్త భార్య విషయంలో పిల్లలను అబద్ధాలు చెప్పమంటారు. ఇలా ఒక్కసారి అబద్ధం చెప్పడం అలవాటు చేసుకుంటే పిల్లలు భవిష్యత్తులో కూడా మనకు అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు ఇలాంటి పరిస్థితుల వలన తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే అబద్ధాలు నేర్పించకండి.
ఇంట్లో వచ్చే గొడవలు సహజం కానీ ఆ గొడవలు పెద్దవిగా చేస్తూ గట్టిగా అరుసు బూతులు మాట్లాడకూడదు అలా బూతులు మాట్లాడడం వలన పిల్లలు అవే నేర్చుకుని ఆ పదాలనే పలుకుతూ ఉంటారు. పిల్లల ముందు భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవించుకోవాలి అంతేగాని అవమానించుకోకూడదు.
దంపతుల మధ్య గొడవలు ఎత్తినప్పుడు ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుంటూ కొట్టుకుంటారు ఈ సమయంలో భార్యాభర్తలు ఒకరిపై ఒకరు అవమానించుకుంటూ ఉంటారు.
ఇదంతా పిల్లల ముందు చేయడం వల్ల భవిష్యత్తులో పిల్లలు కూడా అదే నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది.
పిల్లల ముందు అసభ్యంగా ప్రవర్తించకూడదు భార్యాభర్తలు పిల్లల ముందే ఒకరిని ఒకరు పట్టుకోవడం, లేదా ఇతర ఇతర పనులు చేయడం.
అలాంటి పనులు వాళ్ళ ముందు చేస్తే వాళ్ళ మైండ్లో అదే ఉండిపోతుంది అందుకే పిల్లల ముందు జాగ్రత్త వహించండి.