
Vijayashanti Husband: ఒకానొకప్పుడు విజయశాంతి సినిమాలంటే ప్రత్యేకించి పరిచయాలు అవసరం లేదు. లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తూ లేడీ అమితాబచ్చన్ గా పేరు తెచ్చుకుని సౌత్ ఇండస్ర్టీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొంది స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తూ తన దైన శైలిలో మంచి గుర్తింపు పొందింది. లెడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవడమే కాకుండా ఎందరో మహిళలకు స్పూర్తి దాయకంగా నిలిచేది. ఇక ఆమె నటించిన అప్పటి చిత్రాలు ఇప్పుడు రీ రిలిజ్ చేస్తే మాత్రం తప్పకుండా కోట్లు వసూళ్ళు తెచ్చి పెట్టడం ఖాయం అలా ఉంటుంది ఇప్పటికీ ఆమె రేంజ్.
అందుకు సాక్ష్యం ఆమె నటించిన ఓసేయ్ రాములమ్మ చిత్రం ఇప్పటికీ టీవీ లలో వస్తే అలా చూస్తూ టీవీ కి అతుక్కుపోయే అభిమానుంటూ ఉండడు. అలాంటి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న విజయశాంతి కేవలం లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో మాత్రమే నటించకుండా చాలా మంది స్టార్ హీరోల సరసన డజన్ల సంఖ్య చిత్రాలలో ఆడి పాడింది. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే అప్పట్లో స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా సరి సమానమైన రెమ్యునరేషన్ పుచ్చకున్న ఏకైక హీరోయిన్ గా నిలిచింది. ఇంకా కొద్ది మంది హీరోలకంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ కూడా తనే.
అనేక సినిమాలతో చాలా బిజీ బిజీగా కొనసాగుతున్న విజయశాంతి నటుడు శ్రీనివాస ప్రసాద్ (Vijayashanti Husband) ను ప్రేమించి వివాహం చేసుకున్నది. ఇక ఆ శ్రీనివాస ప్రసాద్ మరెవరో కాదు సినిమా ఇండస్ర్టీలో పెద్ద కుటుంబమైన నందమూరి కుటుంబానికి చెందిన దగ్గరి బంధువట. కాగా గతంలో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి నడుమ ఎఫైర్ ఉందటూ అనేక వార్తలు వినిపించసాగాయి. ఆ కారణం చేతనే బాలకృష్ణ మీద కోపంతోనే నందమూరి సమీప బంధువైన శ్రీనివాస ప్రసాద్ ని వివాహమాడిందనే వార్తలు కూడా ఎన్నో సార్లు వినిపించాయి.
కాగా ఎంతో ఇష్టపడి వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్నప్పటికీ చిన్న చిన్న గొడవల వల్ల చివరకు ఒకరికి ఒకరు దూరమైపోయి ఎవరికి వారు విడిపోయారని వార్తలు చాలానే వినిపించాయి. ఇక మనందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత నుండి విజయశాంతి మరో పెళ్ళి చేసుకుకోండా అప్పటి నుండి ఒంటరిగానే ఉంటున్నట్టు సమాచారం. కాగా ఇక ఆ తర్వాత కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంటూ మరో పక్క రాజకీయాలలో రాణిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఇటీవలే తన సెంకడ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి ఓ వైపు సినిమాలలో రాణిస్తూ మరో వైపు రాజకీయాల్లో రాణిస్తూ వస్తుంది.